‘బాజీరావ్ మస్తానీ’

చిత్రం : ‘బాజీరావ్ మస్తానీ’

దర్శకుడు : సంజయ్‌ లీలా భన్సాలీ

భాష : హిందీ

దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ 18వ శతాబ్దానికి చెందిన మరాఠా యోధుడు బాజీరావ్ పేష్వా-1, అతని ప్రేయసి మస్తానీ ప్రేమకథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కించారు

బాజీ రావు భల్లాల్ భట్ (రణవీర్ సింగ్) ఓటమి ఎరుగని యుద్ధ వీరుడు. అతన్ని పీష్వా బాజీరావు అని కూడా పిలుస్తుంటారు. 40 యుద్ధాలలో ఓటమి అంటే ఏమిటో తెలియని రికార్డ్ ఆయనది. ఢిల్లీ సింహాసనంసుదీప్ చట్టర్జీ అందించిన సినిమాటోగ్రఫీ బాజీరావ్ సన్నివేశాలకి ప్రాణం పోసింది. యుద్ధ సన్నివేశాలు లైవ్లీగా రావడంలో సినిమాటోగ్రఫీ ముఖ్యపాత్ర పోషించింది. డైరెక్షన్, సినిమాటోగ్రఫీలతోపాటు కాస్టూమ్స్ కూడా సినిమాకి కీలకంగా మారాయి. క్యారెక్టరైజేషన్‌లో కాస్టూమ్స్‌కి ప్రత్యేకస్థానం వుంది. బాజీరావ్‌గా రణ్‌వీర్ సింగ్, అతడి ప్రియురాలు మస్తానీగా దీపికా పదుకునె, బాజీరావ్ భార్య కాశీబాయి పాత్రలో ప్రియాంక చోప్రాల పర్‌ఫార్మెన్స్ బాగుంది. ప్రేమకి మతం లేదు.. ప్రేమలోనే ఓ మతం వుందనే సందేశంతో ‘బాజీరావ్ మస్తానీ’ని ఆడియెన్స్ ముందుకు తీసుకువచ్చాడు భన్సాలీ. నుండి మొఘలులను గద్దె దించాక దేశం మొత్తాన్ని తన పాలన కిందకి తెచ్చుకోవడానికి నిశ్చయించుకుంటారు. ఇందులో భాగంగా యుద్ధాలు చేసుకుంటూ ముందుకు సాగుతుంటాడు. ఆ సంగతి అలా ఉంటే బాజీరావు మస్తానీ(దీపిక పదుకోన్) అనే ముస్లిం అమ్మాయి ప్రేమలో పడతాడు. అప్పటికే బాజీరావుకు కాశీభాయి(ప్రియాంక చోప్రా)తో వివాహం జరుగుతుంది. అయితే బాజీరావు ముస్లిం అమ్మాయిని ప్రేమించడాన్ని కుటుంబ సభ్యులు, అతని తల్లి వ్యతిరేకిస్తుంది. ఓ వైపు భారత దేశం మొత్తాన్ని తన కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని యుద్దాలు చేస్తూనే మరో వైపు తన ప్రేమను గెలుచుకోవడానికి కుటుంబ సభ్యులతో పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన కొన్ని ప్రతిష్టాత్మకమైన చిత్రాల జాబితాలో ‘బాజీరావ్ మస్తానీ’ కూడా ఒకటి అని చెప్పుకోవడంలో ఏ సందేహం అవసరంలేదు. ఈ సినిమాని అంతే అందంగా మలచడంలోనూ భన్సాలీ సక్సెస్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. హిందూ సామ్రాజ్యస్థాపన కోసం 18వ శతాబ్ధంలో మొఘల్స్‌తో దాదాపు 40 యుద్ధాలు చేసి గెలిచిన మరాఠా యోధుడు బాజీరావ్. ఇంతకు ముందెన్నడూ ఆన్‌స్క్రీన్‌పై చూడని అతడి ప్రేమకథని అందంగా తెరకెక్కించిన సంజయ్ లీలా భన్సాలీ… పిక్చరైజేషన్, క్యారెక్టరైజేషన్‌లో తన ప్రతిభకి పదునుపెట్టాడు. టెక్నికల్ వ్యాల్యూస్ పరంగా చూస్తే, ఈ సినిమాని బాగా హైలైట్ చేసిన మరో అంశం సినిమాటోగ్రఫీనే.

స్పాట్ లైట్

చిత్రం: స్పాట్ లైట్

దర్శకుడు : థామస్ మెక్ కార్తీ

భాష : ఇంగ్లీష్

స్పాట్ లైట్ చిత్రం బోస్టన్ నగరంలో జరిగిన నిజ జీవిత కథ ఆధారంగా జాన్ సింగర్ రాసిన ఈ కథని ప్రముఖ దర్శకుడు మెక్ కార్తీ తెరకెక్కించారు. 2001 లో, ది బోస్టన్ గ్లోబ్ యొక్క సంపాదకుడు మార్టి బారన్ 80 మందికి పైగా అబ్బాయిలను పూజారి అయిన జాన్ జియోఘన్ వేధించాడని ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి పాత్రికేయుల బృందాన్ని నియమిస్తాడు. ఎడిటర్ వాల్టర్ “రాబీ” రాబిన్సన్ (మైఖేల్ కీటన్) నేతృత్వంలో, విలేకరులు మైఖేల్ రెజెండెస్ (మార్క్ రుఫలో), మాట్ కారోల్ మరియు సాచా ఫైఫెర్ ఇంటర్వ్యూ బాధితులు మరియు సున్నితమైన పత్రాలను తెరవడానికి ప్రయత్నిస్తారు. రోమన్ కాథలిక్ చర్చిలో లైంగిక వేధింపులను కప్పిపుచ్చకుండా రుజువు చేయడం విలేకరుల లక్ష్యం.ఎవరు నమ్మలేని విధంగా ఒక చర్చ్ లో పిల్లలని వేధించడం ఎక్కడ చూడలేని వింతగా ఉంటుంది. ఈ బాధితుల్లో చాలామంది స్పాట్ లైట్ బృందానికి చాల సహకరిస్తూ వాళ్లు పడ్డ వేదనను వివరిస్తారు దీని ద్వారా వాళ్ళందరినీ తన విచారణలో తెలుసుకొని అందరికి శిక్ష పడేలా చేస్తుంది స్పాట్ లైట్ బృందం.స్పాట్లైట్ “లోతైన సత్యాన్ని కూడా చూపిస్తుంది, దుర్వినియోగం వల్ల కలిగే మానసిక గాయం, బాధితులకు మాత్రమే కాకుండా ప్రతిచోటా భయపడిన కాథలిక్కులకు.” స్పాట్లైట్ “విశ్వాసాన్ని కలిగిస్తుంది. మాజీ పూజారి మరియు మానసిక వైద్యుడు ఇందులో ముఖ్యమైన పాత్రలు . “మార్క్ తన నటనతో ప్రపంచ స్థాయిలో ప్రేక్షకులను మాడ్యులేట్ చేస్తాడు. దర్శకుడు మెక్‌కార్తీ మరియు అతని బృందం ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు బోస్టన్‌ను నగరాన్ని చూపించడం చాల కొత్తగా ఉంటుంది. “బోస్టన్” నగరం దాని గందరగోళ వలస-యుగ వీధులు మరియు చర్చి స్పియర్స్ ఆచరణాత్మకంగా ప్రతి మూలలో ఆకాశంలోకి దూసుకెళ్లడం సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే కూడా అద్బుతంగా ఉంటుంది ఆ విభాగం లో కూడా ఆస్కార్ అవార్డు లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com