చిత్రం.. మూన్ లైట్

దర్శకుడు.. బేరీ జెన్కిన్స్

భాష..ఇంగ్లీష్

బేరీ జెన్కిన్స్ దర్శకత్వం వహించిన చిత్రం “మూన్‌లైట్”. చిరోన్ అనే ఒక నల్లజాతి యువకుడు, అమెరికాలో ఎదుర్కొన్న అనుభవాల సమాహారంగా ఈ చిత్రం తెరకెక్కింది. చిరోన్ జీవితంలోని మూడు దశల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలు, సవాళ్లను అధిగమించిన విధానాన్ని దర్శకుడడు ఇందులో వివరించాడు. ముఖ్యంగా చిరోన్ తన శారీరక లోపాన్ని(లైంగికత), సమాజం ముందు ఎలా సమర్థించుకున్నాడు, విమర్శలను ఎలా స్వీకరించాడు అనేది ఇందులో కీలకమైన కథాంశం. ఈ చిత్రం 2017 లో ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డు గెలుచుకోవడంతో పాటు, కీలక పాత్రలో నటించిన నటించిన మహెర్షల అలీ ఉత్తమ సహాయ నటుడు అవార్డును అందుకున్నాడు.

చిరోన్(హిబ్బెర్ట్) బాల్యంలో ఉన్నప్పుడు ఇతరులతో సంభాషించడం తెలియని వ్యక్తి మరియు అందిరి దుషణలకు గురైన వాడు. తన తల్లితో పాటు దగ్గరివారంతా, చిరోన్ చాలా అమాయకమైన వ్యక్తిగా భావించి, నిత్యం బెదిరింపులకు గురిచేసేవారు. ఇలాంటి పరిస్థితుల్లో చిరోన్ ను, జౌన్( మహెర్షల అలీ) అనే స్థానిక డ్రగ్ డీలర్ చేరదీస్తాడు. మనం తరచూ చూసే నల్ల జాతి డ్రగ్ డీలర్లతో పోలిస్తే, జౌన్ వ్యక్తిత్వం పూర్తిగా విభిన్నం. జౌన్, చిరోన్ పట్ల తండ్రి లాంటి సానుభూతిని చూపి, శారీరక లోపం గురించి సిగ్గు పడాల్సిన అవసరం లేదంటూ చిరోన్ కు తరచూ ధైర్యం చెప్పేవాడు. రెండో దశలో, టీనేజర్ గా మారిన చిరోన్(అష్టోన్ సాండర్స్) ఎప్పుడూ ముక్కోపిగా, ఒంటరితనంతో ఉండేవాడు. అయితే వీటన్నిటి నుండీ, కెవిన్(ఝారెల్ జారోమ్) తో ఉన్న స్నేహ బంధం, చిరాన్ కు కాస్త ఉప శమనం కలిగించేది. చివరదైన మూడో దశలో చిరోన్ మార్పు చెందిన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎదుర్కోవడానికి శారీరకంగా, మానసికంగా అత్యంత ధృడంగా తయారైన తీరుతో, సరికొత్త చిరోన్ ను ప్రపంచానికి పరిచయం చేస్తాడు దర్శకుడు.

చిరోన్ జీవితంలోని స్వచ్ఛమైన అనుభూతులతో, దర్శకుడు బేరీ జెన్కిన్స్, ఈ చిత్రంలోని ప్రతి సన్నివేశాన్ని అద్బుతంగా తీర్చిదిద్దాడు. చిరోన్ కు జీవిత పాఠాలు నేర్పిస్తూ, తండ్రి లాగ వ్యవహరించిన మహెర్షల అలీ వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలెట్ గా నిలిచాయి.

చిత్రం : దంగల్

దర్శకుడు : నితీష్ తివారీ

భాష : హిందీ

ప్రముఖ ఇండియన్ రెజ్లర్, ద్రోణాచార్య అవార్డు గ్రహీత మహవీర్‌సింగ్‌ ఫోగట్‌ జీవిత కథ ఆధారంగా ‘దంగల్‌’ చిత్రాన్ని తెరకెక్కించారు. మహిళలు రెజ్లింగ్ క్రీడ వైపు రావడాన్ని అదోలా చూసే రోజుల్లో మహవీర్ సింగ్ ఫోగట్ తన ఇద్దరు కూతుళ్లు గీతా ఫోగట్, బబితా ఫోగట్ లను దేశం గర్వించదగ్గ మహిళా రెజ్లర్లుగా ఎలా తీర్చిదిద్దారు అనే కథాంశంగా ఈ సినిమా తెరకెక్కింది.

మహవీర్‌ సింగ్‌ ఫోగట్‌(ఆమిర్‌ఖాన్‌) హరియాణాలోని భివానీ జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన రెజ్లర్. రెజ్లింగ్‌లో భారత దేశానికి బంగారు పతకాన్ని అందించాలన్నది ఆయన కల. తన కల నెరవేరక పోవడంతో తనకు పుట్టబోయే కుమారుల ద్వారా అయినా అది నిజం చేయాలని భావిస్తారు. అయితే ఆయన భార్య శోభా కౌర్‌(సాక్షి తన్వార్‌) నాలుగు సార్లు ఆడపిల్లలనే ప్రసవిస్తుంది. తన కల నిజం కాదని డీలా పడిపోయిన ఫోగట్… అనుకోకుండా ఓ రోజు స్కూల్‌లో జరిగిన గొడవలో తన కూతుళ్లు గీతా ఫోగట్‌(ఫాతిమా), బబిత కుమారీ(సాన్యా మల్హోత్ర) బల ప్రదర్శన చూసి ఆశ్చర్యపోతారు. వారిని రెజ్లర్లుగా తీర్చిదిద్ది తన కలను నిజం చేసుకోవాలనుకుంటాడు. ఇందుకోసం వారికి తానే స్వయంగా కఠోర శిక్షణ ఇచ్చి తన కూతురి ద్వారా దేశానికి పతకం అందిస్తాడు. అమీర్ ఖాన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుడిని కదిలిస్తుంది. దేశం గర్వించేలా తన తన కూతుళ్లను తీర్చి దిద్దిన మహవీర్ సింగ్ ఫోగట్ కథ ఆకట్టుకొంటుంది. క్రీడలు, మహిళలు, సమాజానికి సంబంధించిన ఒక మంచి సందేశం కూడా సినిమాలో ఉంది.అమీర్ ఖాన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుడిని కదిలిస్తుంది. దేశం గర్వించేలా తన తన కూతుళ్లను తీర్చి దిద్దిన మహవీర్ సింగ్ ఫోగట్ కథ ఆకట్టుకొంటుంది. క్రీడలు, మహిళలు, సమాజానికి సంబంధించిన ఒక మంచి సందేశం కూడా సినిమాలో ఉంది.అమీర్ ఖాన్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ప్రేక్షకుడిని కదిలిస్తుంది. దేశం గర్వించేలా తన తన కూతుళ్లను తీర్చి దిద్దిన మహవీర్ సింగ్ ఫోగట్ కథ ఆకట్టుకొంటుంది. క్రీడలు, మహిళలు, సమాజానికి సంబంధించిన ఒక మంచి సందేశం కూడా సినిమాలో ఉంది .దేశానికి బంగారు పతకం అందించాలనే పాత్రలో అద్భుతమైన భావోద్వేగాలు పండించారు ఈ చిత్రంలో దంగల్ మూవీ కథను, అందులోని భావోద్వేగాల ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు. స్క్రీన్ ప్లే అక్కడక్కడా కాస్త స్లోగా ఉన్నా ప్రేక్షకుడి ఆకట్టుకుంటుంది.ఈ సినిమా కేవలం రెజ్లింగ్‌కు సంబంధించింది మాత్రమే కాదు.. మన చుట్టూ ఉన్న సమాజం, మహిళా సాధికారిత, క్రీడల్లో అమ్మాయిలను ప్రోత్సహించడం వంటి విషయాల గురించి చెప్పే మంచి సందేశాత్మక చిత్రం.

సీతకోపము

(భాస్కర రామాయణం – హుళక్కి భాస్కరుడు)

కం. జనకుని తనయను దశరథ

జనపతి కోడల, నరేంద్రుండగు రా

ముని భార్య నన్ను, గనిసెద

నను చిత్తము విడువు, నీకనర్హంబగుటన్

ఉ. కందినయన్యకాంతయెడ కామము దక్కుము, నన్ను జేరరా

దందని మ్రానిపండులకు నజ్జులు సాతురె, నీదుకోర్కి, నీ

సుందరులందు దీర్చికొను చొప్పును బోక ఖలుండ పాపముం

బొందెడు త్రోవ బోయి తు బోదు మదంబటి కాలు ప్రొలికిన్

ఉ. నాపతి డాగురించి కుహనాగతి నన్నిట దెచ్చి, బంటవై

పాపములేలయాడెదు, నృపాలుడు సన్నిధి నున్న నా నమ

చ్చాపవిముక్త శాతశరజాలములన్ నిను నీకులంబు ను

దీపిత శక్తితో దలలు ట్రెంపక జంపక పోవనిచ్చునే

కం. సిరిజూపి నన్ను లోబడ

మరి పెదనని చూచెదేల? మనుజేశుని పై

దిరమగు నామది వాయదు

తరణింబాయని తదంచిత ప్రభ భంగిన్

శా. ప్రాణంబుల్ వలతేని రామునకు నేర్పారంగ నన్నిచ్చి, స

త్రాణుండైమను, మట్లుగాక మదిలో దర్పించినం దద్రణ

క్షోణీయుక్త ఖరాగ్రసిక పటుదో స్ఫూణోగ్రబానాసనా

క్షీణస్ఫార కఠోర ఘోరశరముల్ చెండాడు నీకంఠముల్

ఉ. వినయముతోడ నన్ను రఘువీరునకిచ్చి వినమ్రుడైన నొం

డనియెడువాడుగాడు, శరణాగత వత్సలు, డాదయాళుతో

ననువుగసంధిచేసుకొని యాదటమై బ్రతుకుండు నీవు నీ

జనములు, క్రొవ్వి చచ్చుట విచారము గాదటుగాక తక్కినన్

శా. పంకేజాసను జొచ్చినన్ జవమునన్ పాతాళమున్ దూరినన్

లంకారాక్షస వంశవారధి కరాళజ్వాలజిహ్వాల మై

సంకీర్ణస్ఫుట విస్ఫులింగపటలీ సంతానమై ఘోరమై

కింకన్ రాఘవ బాణబాడబముఖాక్షీణాగ్ని గ్రోలుంజు మీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com