గ్రామంలోకి పట్వారీ దగ్గఱకు మురాసిలా తీసుకవచ్చాడు. తహశీలు కచ్చేరి జవాను. అతి 11 గంటలయింది. పట్వారీ నిద్రపోతోన్నాడు. ఇంటి ముందు నిలబడి, “మహరాజ్ మహరాజ్,” అని కేకలు వేసాడు జవాను. నిద్రలో వున్న పట్వారీ ఉలికిపడి లేచి కండ్లు తుడుచుకుంటు బయటికి వచ్చాడు. ‘మహారాజ్ ఎల్లుండి తహశీలుదారుగారు దౌరా వస్తున్నారు. సరియైన ఇంతెజాం చెయ్యాల, ని మురాసిలా చేతికి యిచ్చి వేరే గ్రామం వెళ్ళినాడు జవాను.

పట్వారికి ఆ మాట వినేసరికి కడుపులో గుండు పడట్లు అయింది. ఆ రాత్రి నిద్ర పటలేదు. పహని నె. 4 తఖాలు మొదలగు తన దసరం మొత్తం తిర్టేసి మళ్ళేసి రాత్రంతా చూడటం మొదలు పెట్టినాడు. తెల్లవారింది. ఇంటిముందు అర్రు మీద కూర్చున్నాడు పట్వారి. తర్వాత మస్కూరిని పిలిపించి తహశీలుదారుగారు వస్తూ వున్నారు. రేపు జాంపొద్దు ఎక్కేవరకు అంతా ఇంతేజాం కావాలి. లేకుంటే నీ వళ్ళు బద్దలవుతుంది సుమా, అని బెదురుపెట్టి పనివాండ్లను మొత్తం పట్టకరాపో అని మస్కూరిని తోలించినాడు.

ఇంతలో పోలీసు పటేలు, మాలి పటేలు, పట్వారి ముగ్గురు కల్సుకున్నారు. వారు ముగ్గురు రహస్యం మాట్లడుకొని ఒక నిర్ణయానికి వచ్చి కార్యక్రమం మొదలు పెట్టినారు. హరిజనులు, చాకలివారు, మంగలివారు, కుమ్మరివారు, వడ్రంగులు, మొత్తం గుంపులు చావడి దగ్గటికి చేరారు. చావడిలో పటేలు, పట్వారీలు మగ్గురు త్రిమూర్తుల్లాగా కూర్చొని మొదలు హరిజనులను పిలిచి, “అరేయి అధికారి రేపు దౌరా వస్తున్నాడు. జాగ్రత్తతో పని చెయ్యాలి సుమా? పొండి మన గ్రామానికి రోడ్డుకు 5 మైళ్ళ దూరం వుంటుంది. త్రోవ తప్పిపోతాడు అధికారి కాబట్టి రోడ్డు నుంచి మన గ్రామం వరకు సున్నం వేసిన రాళ్ళు గుర్తులు పెట్టాలి” కొందరిని రాళ్ళకు పంపినాడు. మరికొందరిని హరిజనులను పిలిచి “మన జమీందారుగారు అధికారికి దావత్ ఇస్తాడోయేమో మీరు పోయి మన చెర్లో తుమ్మచెట్టు నరికి పొయ్యిలోకి కట్టెలు తెండి. అవి పచ్చిగా వుంటే ఏ రైతు చెలకలలో ఎండిన చెట్లు వుంటే అవి కట్టుకొని తెండి” అని పంపినాడు.

మరికొందరు హరిజనులను పిలిచి చావడికి చుట్టు మందడి కట్టాలి. ప్రతి రైతు దగ్గర చొప్ప వసూలు చేసి తొందరగా ప్రయత్నం చెయ్యండి అని వెళ్లగొట్టినాడు. తర్వాత చాకలివారిని పిలిచినాడు. “అరేయి మీరు కొందరుపోయి ఆ హరిజనులు బాటకు పెడుతున్న రాళ్ళకు సున్నం

మొండి పడితే తొందరగా సాన పట్టించుక రాండి. క్షారాలు చెయ్యాల్సి వుంటుంది. తొండంగా చేసుకరాండి,” అని పంపినాడు. తర్వాత కుమ్మరివారిని పిలిచి, “అరేయి మీరు కొందరు పోయి కుండలు తీసుకురండి. కొందరు ఇప్పుడే పొయ్యిల పెట్టి ఒక పెద్ద కుండెడు నీళ్ళు బాగా కాచి చల్లార్చండి. అవి చల్లారిన తర్వాత చావట్లో పెట్టండి. అధికారి యీ నీళ్ళు త్రాగరు” అని

పంపినాడు. పట్వారి మస్కూరిని పిలిచి, “ఏమోయి మొన్న గొర్రెపిల్ల ముత్తిగాడు తెపుడు గదా? మరి యీసారి వంతు ఎవరిదో తెల్సుకో. ఒక గొర్రెపిల్లను తీసుకొని, కొన్ని కోడిపిల్లలని గూడా సంపాదించి, యీసారి పాలు పెరుగు ఎవరు తెస్తారో తొందరగా ఇంతేజాం చేసి రా పో అని పంపినాడు పోలీసు పటేలు, కోమట్లను పిలిచి “మీ దగ్గర సరియైన సామానులు వుంచండి. లేకుంటే బస్తికి పోయి సామాను తీసుకురండి. నేను చిట్టీలు వ్రాస్తే మాత్రం కాళి చేయవద్దు సుమా? తర్వాత మీ యిష్టము,” అని బెదిరించి వెళ్ళగొట్టినాడు మాలీ పటేలు.

ఈ తహశీలుదారు దేనికి దౌరా వస్తున్నాడురా అని ఆలోచిస్తే పంటలు పండక పాడైనందుకు లెవీ కుష్ ఖరీదు మాఫీ కావాలని దరఖాస్తులు పెట్టుకున్న రైతుల పొలములు చూడటానికి దౌరా వస్తున్నాడని తెలిసింది. అప్పటికే రైతులు ఆకలిమంటకు తాళలేక కొన్ని పొలాలు పండినంతవరకు కోసి కొన్ని జీతగాండ్లకు యిచ్చి తక్కినవి వారు వాడుకొన్నారు. ఆ గింజలు కూడా అయిపోయినవి. తహశీలుదారు దౌర వచ్చేవరకు రైతుల యిండ్లలో గింజలు లేవు. కూలినాలి మాత్రం చేసుకుంటున్నారు. దొంగలు పడ్డ ఆరునెలలకు కుక్కలు మొరిగినట్టుగా వుంది. ఇది చూస్తే. అని మూలుగుకుంటూ పోయే ఒక రంగయ్యనే రైతును చూచాను నేను. అతనిని దగ్గలకి పిలిచి “ఏమిటియ్యాల….’ అని అడిగితే తెల్సిన దౌర హడావిడి అంతా పూసగుచ్చినట్టు చెప్పసాగాడు. ఇంతలో మస్కూరి వచ్చి ఆ రైతును తీసుకువెళ్ళినాడు. ‘మళ్ళీ కలుస్తానండీ’ అని రంగయ్య వెళ్ళిపోయాడు..

నేను గ్రామం బయటికి వెళ్ళి నిలబడ్డాను. అటువైపు చూచేసరికి దూరం నుంచి ఒక పెద్ద పెండ్లివారు గుంపులు గుంపులుగా వచ్చినట్టు వస్తూ వున్నారు. ముందు వున్న ఆ హరిజనుల గుంపు, వారి వెనుక గల్లుగల్లున మ్రోగే కంచుగంటల జమీందారిగారి బండి. ఇరుప్రక్కల జవానులతో వెనుకముందు పెట్టి బేగారీలతో నడుమ వస్తూ వున్న బండి లోపల ఎవరున్నారా అని చూచేసరికి బాటా కంపెనీ బూట్లు, దాని మీద తొడిగిన సన్నకాళ్ళలాగు, దానిపై ట్వీడ్ శేరువాని, లోపల నుంచి వ్రేలాడుతున్న ఎర్రని రేష్మిలాగు నాడ, సన్ననిగాలిలో అటుయిటు కొట్టుకొనుచున్న నెత్తిమీది శేరిగోలా టోపి, సూర్యుని కిరణాలకు ధగధగ మెరయుచున్న నాలుగు వ్రేళ్ళ వుంగరాలతో నిండిన చెయ్యి, మెత్తని దూది పరుపు మీద బండి నిండా పండుకున్న విగ్రహం. అందులో విసనకర్ర క్రిందికి మీదికి జానెడు మూరెడు ఎగురుచున్నది. అది చూచేసరికి నాకాశ్చర్యం కలిగినది. బాగా చూచేవరకు తహశీలుదారుగారు విసనకర్రతో విసురుకుంటు నిద్రపోయి విసనకర్ర బొర్ర మీద పెట్టుకున్నాడు. అప్పుడు గ్రహించాను. తహశీలుదారు వీరేనని. ఒకేసారి నాకు మాయ లోకం జ్ఞప్తికి వచ్చింది. నేను వెనుదిరిగి యింటికి వెళ్ళాను.

చలిజ్వరము వచ్చి మూడు రోజుల వరకు ఇంట్లో నుండి బయటకు వెళ్ళలేదు. నాల్గవ రోజు అరుగుమీద కూర్చున్నాను. ఇంతలో ‘తప్పకుండా ఇవ్వాలి’ అని బాధపెడుతున్నడు జవాను రంగయ్యను. ఆ యిద్దరు కలిసి వస్తూ వున్నారు. రంగయ్యను కలిసాను. బిక్కమొగము పెట్టుకొని వచ్చాడు పాపం. “ఏమయ్యా అలా వున్నావు” అని అడిగాను. ‘తహశీలుదారుగారి దౌరా పూర్తి అయింది. నాకు దయ్యం పట్టింది’ అని వెంట వున్న జవానును చూశాడు రంగయ్య. ‘నీవు అలా చిన్నపోయినావు ఎందుకని’ అడిగాను. ‘నేను తహశీలుదారుగారి దర్శనం చేసుకునేసరికి వెంటనే జ్వరం పట్టింది. నేటికి నాలుగురోజులయింది. ఇవాళ కంచెము నెమ్మది అయింది. నీ కొరకే ఎదురు చూస్తున్నాను. కూర్చొపోదువుగాని” అని రంగయ్యను కూర్చోపెట్టి వెంబడి వున్న జవానును గూడా ఒక బీడిముక్క యిచ్చి కూర్చొ పెట్టినాను.

దొర తనక్కిలో ఏమి జరిగిందని రంగయ్య రైతు)ను ప్రశ్నించాను. “ఏం చెప్పాలండి

– పీటలు వేశారు. తహశిలుదారు వచ్చి మొదటి రోజు పూర్తిగా విశ్రాంతి తీసుకున్నాడు. రెండవరోజు జమీందారిగారి యింట్లో దావతుకు పోయినాడు. ఆ రోజు అంతా జమీందారుగారితో మాట్లాడుకుంటూ రాగాల పెట్టె (గ్రామఫోన్) వినుకుంటూ వున్నాడు. అధికారికి మా బాధలు |

సుకొనుటకు లోనికి వెళ్ళనియ్యలేదు. మూడవరోజు ప్రయాణమై వెళ్ళిపోతుంటె వెంబడి, మీరుగారు గ్రామంలో వున్న త్రిమూర్తులు (పోలీసు పటేలు, మాలి పటేలు, పట్వారి) సాయ్యారు. మొదట నా పొలము తనక్కికి తీసుకువెళ్ళారు. బావి మొదట వున్న నాలుగు ఎకరాలలో 8 వంతున వున్న మడి మాత్రం పచ్చపచ్చగ వుంది. తక్కినవన్ని రోగాలు తగల ఉండిపోయినవి. బండి వచ్చి నా బావి మొదట నిలబడింది. మొదటి పొలం మాత్రం బండలో వున్న తహశీలుదారు చూచాడు. ఎండిపోయిన పొలం చూడటానికి బండిలో వున్నాడు. కాబట్టి బండికి వున్న ఇరుపక్కల తడకలు అడ్డంగా వున్నాయి. ఆ కొద్ది భాగము చూచి అరే బాగానే వుంది అని వ్రాసుకున్నాడు. బండి నుంచి క్రిందికి దిగలేదు. పొలమంతా చూడలేదు. తర్వాత చెర్వు క్రింద వున్న జమీరుగారి పొలాలు చూడటానికి చెరువు చివర నుంచి బండిని తీసుకు వెళ్ళారు త్రిమూర్తులు. చెరువు చివరకు వున్న నీళ్ళు అందకుండా వున్న కొద్ది పొలాన్ని మాత్రం బండిలో వున్న తహశీలుదారు చూచి అరెరే ఎండిపోయింది, అని వ్రాసుకున్నాడు. తర్వాత వెళ్ళుతానని తహశీలుదారు జమీన్ దారి చేతులో చెయ్యి కల్పుకొని వెళ్ళిపోయినాడు. నిజంగా చూచినట్టు అయితే జమీందారు పొలాలు అన్నీ బాగానే వుండి తుంగమడి చూచి వారికి మాఫి యిచ్చారు. పొలాలు మొత్తం చూడకనే వసూలు కొరకు నాకు వెంబడి యీ జవానును యిచ్చారు” అని విచారంతో చెప్పసాగాడు.

‘మరి నీవు చెప్పుకోలేకపోయావా’ అని నేను ప్రశ్నించగా, “వెంబడి వున్నవారు చెప్పనివ్వలేదు. అంతా మేము చెపుతాములే అని అన్నారు. నాకు అంతటితోనే సంతోమయింది.

“అదికాదు నేను గూడా వెంబడి వస్తామనుకుంటే చూచేవరకు నాకు జ్వరము పట్టింది. నీకు దయ్యం పట్టింది.”

“దొర అంటే నాకేం తెల్సు!” “అందుకే బీదలది వదల తీస్తున్నారు పులుసు.” “కాదండి మరి వీరు యీ మాదిరి చేస్తుంటే ప్రభుత్వము చూడదా?” “ఆ గ్రుడ్డి కన్ను మూసినా ఒకటే, తెరిచినా ఒక్కటే.” “ప్రభుత్వం గూడా అంతే.” “ఇంత మాత్రానికి యీ దొర హడావుడి ఎందుకండి?”

“నీవే చూస్తున్నావు కదా ఒకవైపు మా పంటలు పాడయిపోయినవి లెవీగల్ల ఇవ్వలేము మా పంటలు వచ్చి చూడండని దరఖాస్తులు పెట్టుకుంటే జమీనుదారి యింట్లో విందులు ఆ రాగాలు భోగాలు చేసుకొనటమేగాని, వారికేమి కడుపుమంట.

జమీనుదారి లెవీ మాత్రం మాఫీ అయింది. అధికారి పొట్ట నిండింది. పైగా నీ పొట్టేగా మాడింది. “అవునండి బాగా చెప్పారు. పేరు గంగానమ్మ. త్రాగబోతే నీళ్ళులేవు. చక్కగా పండిన జమీనుదారి పొలానికి లెవీ మాఫీ. వారికి దరఖాస్తు పెడితె లెవీ కొరకు ఈ జవానును వసూలు చెయ్యమని తగిలించారు. గడ్డం కాలి పరుగెత్తుతుంటె చుట్టకు నిప్పు ఇమ్మని వెంటబడినట్టున్నది.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com