-వనపట్ల సుబ్బయ్య

అతను

పుస్తకాలను

ప్యాంటు బుషోటుగా తొడుక్కున్నందుకేమో

గదినిండా జ్ఞాన గంధం

ఆ ఇల్లు నడుస్తున్న విజ్ఞాన క్షేత్రం

చెట్టు

గంగరేగుపండ్లను తెంపిచ్చినట్లు

ఒక్కొక్క కావ్యాన్ని చేతికిస్తున్నడు

నాకు

మా నాయిన తయిదకంకుల్ని నలిచి

అంగి కీసలో పోసినట్లుంది

ఇటుకలు

సిమెంట్ , స్టీలు లేకుండా

అక్షరాలనే

కంకర మాల్ కలిపి పునాది కట్టినట్లుంది

అల్మారాలు సజ్జలు గోడలు

విభిన్న గ్రంథాలతో నవ్వుతున్నవిఆ ఇల్లు వెలుగు పూలతోట

ఆకాశం

నక్షత్రాలను పరుచుకున్నట్లు

రూములనల్లుకున్న పుస్తకాల కట్టలు

యాబైవేల జ్ఞానదీపాలు

దొంగలు దోయలేని బంగారాలు

ఒక్కో సంకలనం ఒక్కో చరిత్ర

ఏ పూట

ఎవరు ఆ ఇంటికెల్లినా

తినగలిగినంత వచనాలు

తొవ్వుకోవాల్సినంత పరిశోదనలుతొవ్వుకోవాల్సినంత పరిశోదనలు

తాగవలసినంత శతకాలు

తరించాల్సినంత నవలలు

తలకెత్తుకోవాల్సినంత చరితలు

పులకరించే అనువాదాలు

ఏ దావత్ ల తిన్నా

అంత కడుపునిండదేమో !

పదునుపెట్టే కొత్త పాళీలకు

సకల సౌకర్యాలతో మూడంతస్థుల భవనం

జ్ఞానాన్ని దారపోసే

విశాల సహృదయత

ఇంటిముందొక మహా వృక్షం

పచ్చగా పుస్తకాలతో కాపుకాసింది

ఆ కావ్యాలు

బావితరాలకు జ్ఞాన కాగడాలు

వర్తమానంలో సృజనకు దారులు

తాతల తండ్రుల ఆత్మలు

పూర్వికుల జ్ఞానదనాలు

ఒక్క పుస్తకం

వెయ్యి రాకెట్టులపెట్టు

అజ్ఞానాన్ని తొలగించే అక్షరనిధి

ఆ గ్రంథాలయం

ప్రతికవికి ఓ కల్పవృక్షం !

ఇప్పడు

తీర్థ యాత్రలు బదులు

విజ్ఞాన యాత్రలవసరం

గ్రంథాలయాల సందర్శన అత్యంత అవసరం

మళ్ళీమళ్ళీ పోదాం

యోగి వేమన జ్ఞాన గ్రంథాలయం

డాక్టర్ ఎన్. గోపిసార్ ఇంటికి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com