నా సాహిత్య యాత్రలో విమర్శకుల నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్నాను… నిఖిలేశ్వర్

ఇటీవలే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ప్రముఖ తెలుగు (దిగంబర) కవి నిఖిలేశ్వర్. ఆయన సాహితీ ప్రస్థానంలో ఎన్నో మేలు రాళ్లు, మైళు రాళ్లు ఉన్నాయి. తంగేడు నిఖిలేశ్వర్ ని అభినందిస్తుంది. ఆయనతో నేటి కవి బాణాల శ్రీనివాస్ తో ఈ పక్షం ముఖాముఖి పాఠకుల కోసం…

ప్రశ్న1 : మీ సాహిత్య ప్రయాణం కుంభం యాదవరెడ్డి నుంచి మొదలై ప్రముఖ సాహితీవేత్త నిఖిలేశ్వర్ గా, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తెలుగు కవిగా నిరంతరం రచనలు చేస్తున్నారు. ఈ 60 సం.ల సాహితీ ప్రయాణంలో మరచి పోలేని తీపి చేదు జ్ఞాపకాలు వివరించండి సార్?

సమాధానం: నా బాల్యమంతా పేదరికంలోంచి తలెత్తుకుని తిరిగే అస్తిత్వ పోరాటంలో గడిచింది. తరుణ వయస్సులోనే సాహిత్య ప్రయాణం మొదలై, ఆయా దశల్లో అనేక రకాల తీపి చేదు అనుభవాలు పొందాను. గత ఆరు దశాబ్దాల జీవితానుభవాలను ప్రస్తుతం నిఖిల లోకం శీర్షికన స్వీయ చరిత్ర రాస్తున్నాను.

మీ కోసం కొన్ని మాత్రం వివరిస్తాను. నా సాహిత్యయానంలో మరచిపోలేనివి- దిగంబర కవులు మూడో సంపుటి ఆవిష్కరణం 1968లో విశాఖపట్నం లో జరిగింది. నేను నగ్నముని చెరబండ రాజు జ్వాలాముఖి విశాఖ వెళ్శినపుడు, స్థానికంగా మాకో ప్రసిద్ధ రచయితలు పురిపండా, రావిశాస్త్రి, బలివాడ కాంతారావు, కాళపట్నం, చలసాని ప్రసాద్ తదితరుల ఆదరణ స్నేహం లభించింది.

తర్వాత 1970 జనవరిలో విశాఖలోనే జరిగిన శ్రీ శ్రీ షష్టిపూర్తి ఉత్సవాల సందర్భంగా విద్యార్థుల సవాల్ కరపత్రానికి స్పందిస్తూ -అక్కడి పాన్ గల్ హాలులో సాగిన ఉత్తేజకరమైన చర్చాగోష్టి ఊపునిచ్చింది.

1970 అక్టోబర్ ఖమ్మంలో విరసం ఆవిర్భావ సభలు, 1982 లో గుడివాడలో జనసాహివి వార్షిక సదస్సులు నా ప్రయాణంలో ముఖ్యమైన మజిలీలు-ఇక శ్రీ శ్రీ గారితో కలిసి పౌర హక్కుల సభ్యుల పర్యటన, తర్వాత OPDR పక్షాన శ్రీకాకుళంలో అఖిల భారత స్థాయి నిజనిర్ధారణ కమిటీ అనుభవాలు.. 1969 లో కలకత్తా లో నేనూ చరబండ రాజు పాల్గొన్న అఖిల భారత కవితా సదస్సు, భోపాల్ లోని భారత్ భవన్, భువనేశ్వర్ కోణార్క్ ఉత్సవాలు, సాహిత్య అకాడమీ నిర్వహించిన ప్రపంచ కవితా దినోత్సవంలో కవితా పఠనం మెదలైనవన్నీ మధుర స్మృతులే !

ఇక చేదు జ్ఞాపకాల పుటలు తెరిస్తే-1971 లో హఠాత్తుగా పోలీసులు వచ్చి పి.డి యాక్ట్ కింద మమ్మల్ని అరెస్ట్ చేసి, సికింద్రాబాద్ జైలు నిర్భందించడం-

1973 లో తెనాలిలో విరసం కార్యవర్గం సమావేశంలో చారు వర్గీయుల ప్రాబల్యం వల్ల, ఆనాటి ప్రత్యేక సంచికలోని నా సంపాదయాన్ని తొలగించారు.

అప్పుడు నేను నిరసనగా నా కార్యదర్శి పదవికి రాజీనామా చేసాను. సాహిత్య సాంస్కృతిక ప్రజా సంఘాల ముఠా తగాదాలు- రాజకీయ పంథా విభేదాలు, నన్ను తీవ్రమనస్తాపానికి గురి చేసాయి.

ప్రశ్న: మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి- ఆనాటి మీ రైతాంగ కుటుంబంలో సాహిత్యంతో సంబంధం వున్న వాళ్లు వున్నారా?

సమాధానం- ప్రస్తుతం యాదాద్రి జిల్లాలో వున్న వీరెల్లి(వీరవల్లి) లో నేను 1938లో ఒక పేద రైతు కుటుంబంలో జన్మించాను. ఏడాది తీరగానే మా నాన్నను కోల్పోయాను. స్వంతంగా వ్యవసాయం లేనందువల్ల మా అమ్మ కుంభం( సురవరం) నరసమ్మ ఆనాటి నిజాం రాజ్యంలోని హైద్రాబాద్ కు చేరుకుంది. నన్ను పెంచి పోషించి విద్యా బుద్దులు చెప్పించే ఆశయంతోనే ఆమె తన జీవితాంతం శ్రామికురాలిగా జీవించింది.

నా విద్యాభ్యాసం సికింద్రాబాద్ వీధి బడుల నుంచి, ప్రభుత్వ పాఠశాలల మీదుగా – ఉస్మానియా యూనివర్సిటీ దాకా కొనసాగింది.

ఇక మా రైతాంగ కుటుంబంలో ఆనాడు అందరూ- నిరక్షరాస్యులే! సాహిత్యమనే ప్రసక్తికి అవకాశమే లేదు.

ప్రశ్న: వృత్తి పరంగా మీరు ఆంగ్ల ఉపాధ్యాయులు- ప్రవృత్తి పరంగా తెలుగు సాహితీవేత్తలు-రెండింటినీ ఎలా సమన్వయం చేయగలిగారు..?

సమాధానం- భాషాపరంగా నేను హైస్కూలులో తెలుగు మాధ్యమంలోనే చదివినా, ఆరోజుల్లోనే సాయంకాలం పూట హిందీ ప్రచార సభ తరగతులకు హాజరవుతూ- భూషణ్ పరీక్షలో ప్యాస్ కాగా- హిందీ సాహిత్యంలతో అనుబంధం ఏర్పడింది. ఆ తర్వాత మా హైద్రాబాద్ సాయం కళాశాల(నిజాం కాలేజి) లో ఇంగ్లీషు లిటరేచర్ తో డిగ్రీ చదువు- ఆనాటికే ఇంగ్లీషు సాహిత్య అధ్యయనం-

అయితే చిన్న నాటి నుంచి తెలుగు సాహిత్య పఠనం- సమాంతరంగా కొనసాగినందు వల్ల -మాతృ భాషలోనే కవిత్వం -కథ- విమర్శనా ప్రక్రియల్లో నా రచనా వ్యాసాంగం సాగిపోయింది. హిందీ, ఇంగ్లీషు(కొంత ఉర్దూ) సాహిత్యాల మూలంగా నా అవగాహన నా అభివ్యక్తి మరింత విస్తృతంగా కొనసాగించి- మౌలికంగా ఇంగ్లీషు, హిందీలో కూడా రచనలు చేశాను. దింగబరకవులు మొదటి సంకలనం మీ కవిత “ఆత్మయోచి”తో ప్రారంభవముతుంది-మిగతా రెండు సంకలనాలలో మీ బలమైన కవితలు ఏవి? మిగతా దిగంబరుల గురించి మీ అభిప్రాయం?..

సమాధానం.. ది. క లలోని మా అందరి కవితలన్ని స్థాయి బేధాలతో శక్తివంతమైనవే! ఆగ్రహం-ఆవేదనతో ఆరుగురు డి.క లు సమిష్టి ఘోషగా తమ ఆశయాన్ని నెరవేర్చారు

ఇక ది.కలలో నా బలమైన కవితల విషయముకొస్తే

నీవు చెప్పింది అబద్ధంకాదు, నా దేశంలో నేను ఏకాకిని,సమాధులు చుట్టూమంటలు, ఆహ్వానిస్తున్నాను,ఈమట్టిలోంచి,హింస లాంటి కవితలను పేర్కొనవచ్చు ..

ప్ర..మీ ‘అగ్నిశ్వస’ కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది దానిమీద మీ స్పందన ఏమిటి?

సమాధానం..”అగ్నిశ్వాస”లో ఎక్కువగా 2015-17 మధ్య రాసిన కవితలున్నాయి. మత ఛాందస టెర్రిరిజాని ఎదుర్కోవల్సిందేననే పిలుపుతో సహా ఆయా సన్నివేశాలు,వ్యక్తులు-సామాజిక పరిణామాలపై తాత్వికంగా కొన్ని సూటిగా రాసిన కవితలున్నాయు.. అయితే 2004-2014 మధ్య వచ్చిన జ్ఞాపకథకొండ యుగస్వరం,ఖండతారాల మీదుగా కాలాన్ని అధిగమించి సంపుటలలో ఎదో ఒకదానికి ఈ అవార్డు అప్పుడే వచ్చింవుంటే మరింత ఆనందంగా ఉండేది. ఇక నా సాహిత్య యాత్రలో ఎన్నో మాజిలీల దాటుతూ,ప్రజాభిమానం పొందిన నేపథ్యంలో,ఈ అవార్డు సాహిత్య పరంగా ఒక అదనపు గుర్తింపు అని భావిస్తున్నాను..

6 ప్రశ్న.. దిగంబర ఉద్యమం నుంచి విరసం జనసాహితి వరకు మీ పాత్ర గణనీయమైనది. ప్రభుత్వ కార్యకలాపాలను వ్యతిరేకిస్తూ కవిత్వం రాస్తున్నారు – మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డు మీద మీ అభిప్రాయం..

సమాధానం.. కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక వ్యవహారాలశాఖలో ‘సాహిత్యా అకాడమీ’ స్వయం ప్రతిపత్తి గల సంస్థ.

ఒక అటానమస్ బాడీగా ఈ కేంద్ర సాహిత్య అకాడమీ 1955 నుంచి భారతీయ భాషా సాహిత్యాలకు ఏటా అవార్డులు ఇస్తున్నది. ప్రజాస్వామికంగా ఎన్నికలు జరిపి, జనరల్ కౌన్సిల్ ద్వారా స్వతంత్రంగా అకాడమీ తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నది. 1988 నుంచి అకాడమితో నా అనుబంధం- ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి గారు తెలుగు సలహా సంఘానికి (1992-97)కన్వీనర్ గా ఉన్నపుడు నేను కూడా ఒక సభ్యుడిగా వున్నాను. గ్రౌండ్ లెవల్ నుంచి ఆయా భాషల రచయితల సూచనలు , ప్రచురణలను స్వీకరించి, వడబోసి -చివరగా ముగ్గురు సభ్యుల జ్యూరి నిర్ణయం మేరకు అవార్డును ప్రకటిస్తారు. ఈ ప్రక్రియలో పాలక పక్షాలకు లేదా మంత్రులకు ఎలాంటి ప్రమేయం వుండదు. సీనియర్ సాహితీవేత్తలు-విద్యావేత్తలు పరిశీలించి నిర్ణియించి ప్రకటించే అవార్డు కాబట్టి నేను స్వీకరిస్తున్నాను. ఈ అవార్డు వచ్చినా వ్యక్తిగతంగా నేను ప్రజల పక్షాన ప్రతిపక్షంలో వున్నాను—ఏనాటికైనా ఈ అగ్నిశ్వాస నా అంతరంగిక భాష శ్రమ జీవుల పోరాటాల ధ్యాస.

ప్రశ్న: కవిత, కథానిక, విమర్శ, రాజకీయ వ్యాసాలు, అనువాదాల వంటి ప్రక్రియల్లో మీరు రచనలు చేసారు. ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలంగా పని చేసారు. మీ సాహిత్య కృషి పట్ల విమర్శకుల అంచనాలు ఎలా వున్నాయి?

సమాధానం: నా సాహిత్య యాత్రలో విమర్శకుల నిర్లక్ష్యాన్ని ఎదుర్కొన్నాను. విమర్శక మిత్రులు కొందరు దిగంబర కవిత్వం దగ్గర ఆగిపోయి నా సాహిత్యాన్ని కుదించేసారు. కె.యాదవ రెడ్డి మొదలు నిఖిలేశ్వర్ గా గత 60 సంవత్సరాల కాలంలో నేను చేసిన రచనల వైవిధ్యాన్ని వీరు గుర్తించడంలేదు. మిత్రులు దర్పశయనం, డా. జతిక, ఎ,ఎన్. నాగేశ్వర రావు, రాఘవ శర్మ లాంటి వారు తప్ప మిగతా విమర్శకుల్లో, సమీక్షకుల్లో సహనం లేదు. నిశితంగా చదివి అంచనా వేసే వోపికా లేదు. ఆశ్రిత పక్షపాతం, ప్రాయోజిత ప్రశంసా పూర్వక విమర్శ ఈ నాటికి కొనసాగుతూనే వుంది. అందువల్ల సాహిత్య రంగంలో ప్రస్తుతం వస్తున్న కొందరి నిస్సారమైన కవిత్వం పట్ల, దూరదృష్టి లేని రచనల గురించి నిశిత విమర్శ లోపించింది.

ప్రశ్న: హిందీ, ఇంగ్లీషులో కూడా మీరు రచనలు చేసారు- వాటి గురించి?

సమాధానం: కవితాపరంగా హిందీలో “ఇతిహాస్కెమోడ్ పర్”, ఇంగ్లీషులో ‘లైఫ్ ది ఎడ్జ్ ఆప్ నైఫ్’(Life the edge of knife) వివిధా శీర్షికన తెలుగు కవితలు-కథలు-చలం నాటిక “మృత్యువు” తో పాటు విమర్శను హిందీలోకి అనువదించగా ఢిల్లీ పబ్లిషర్ పుస్తకంగా ప్రచురించారు.

ప్రశ్న మీరు విరివిరిగా అనువాదాలు కూడా చేసారు. వివిడభాషాలతో ఉన్న అనుభవం ఎలాంటిది? మీ కథా రచనలగురించి ?

సమాధానం.. కవిత్వంతో పాటు నా జీవనయనంలోఅనువాద క్రియ కలపాలు తొడుగున్నాయి . హిందీ,ఇంగ్లీషు, ఉర్దూలతో పాటు ఇతర భాషా సాహిత్యాన్ని అనువదించాను. “అనుసృజన”ప్రచురణ నా కవితనువాదాలకో నిలువెత్తు నిదర్శనం. ఇతరత్రా నేను చేసిన అనువాదాలన్న కొంత ఆర్థికంగా ఆదుకున్నాయి – నా అనుభవంలో గ్రహించిన వాస్తవం. బహుళ భాషాలున్న భారతదేశానికి ఇతర దేశాల ఖండతారాల సాహిత్యానికి పరస్పర అనువాదాలే సజీవమైన వాహికలు. అసలు అనువాదాలు లేకుండా ప్రపంచ సాహిత్య పరిచయం అసాధ్యం! ఇక “ఖలేశ్వర్ కథలు” గురించి వివరంగా చెప్పవలసిందే! అయితే 2000 తరువాత నేను కథలు రాయలేదు

10 ప్రశ్న.. విమర్శనా రంగంలో కూడా మికొక స్తానం ఉంది . సాహిత్య విమర్శను మీరు ఏ దృష్టిలో చూస్తున్నారు?

సమాధానం. ఆనాటి వచన కవిత ప్రక్రియ ఉద్యమం కుందుకుర్తి గారి కృషిములంగా నాటి నుంచి నేను నా సమకాలీన కవుల రచనలపై పరిశీలన వ్యాసాలు రాసాను. తదుపరి ఆయా దశల్లో ఆయా ప్రక్రియల్లో వచ్చిన రచనలపై విమర్శనాత్మకరచనలు చేసాను-ఆరచనాలన్ని ‘మారుతున్న విలువలు-సమకాలీన సాహిత్యం’,’కవిత్వ శోధన’,’ఆవహించిన అక్షరం’ ప్రచురణలుగా వచ్చాయి-1995 నాటి సాహిత్య వ్యాసాలు ” ప్రపంచ సాహిత్యంలో తిరుగుబాటు ఉద్యమాలు” – రివైజీడ్ – ఎడిషన్ గా రానున్నది. సాహిత్య విమర్శలో ప్రధానంగా వస్తురూపాలు-శైలిని పరిగణలోకి తీసుకున్నా. తాత్కాలికంగా చరిత్రకగతిరత్నంలో,మర్క్సియన్ సౌందర్య శాస్త్ర దృష్టితో చూసినప్పుడే నిగ్గు తేల్చగలమనుకుంటాను!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com