అతను

శతవసంతాలతో ఉదయించాడో..

సహస్ర జీవితాలకు కిరణమవ్వాలని అనుకున్నాడో..

నీటిబుడగజీవితమైనా బడుగులకు బాసటగా

నిలవాలనుకున్నాడో…

తెలుసుకోలేని రహస్యం…!!

ప్రతిక్షణం ప్రశ్నలు ఉదయిస్తాయి

అతను ప్రజలపక్షాన నిలిచి ప్రతిధ్వనించాడు

సమాధానాలు మంతనాలు చేస్తుంటాయి

నీడనిచ్చిన చెట్టుకు గొడుగుగా మారడం ఎంతగొప్ప

భుజానికి సంచితో నడిచినదారల్లా అక్షరాలు చల్లుతూ జీవితాన్ని మోసాడతను

అన్న అమ్మైనప్పుడు….

అన్న భుజాలు నాన్న పొత్తిళ్ళుగా మారి గుండెలపై మోసాయి

ఎవరిగోడు వారిదైనప్పుడు

అందరిగోడూ అతని గొడవైంది

అన్యాయం అంతరించే దాకా ఆగని గొడవ అతనిది

అతన్ని చూస్తే భాషయాస సంభాషిస్తది

అక్షరం అతనికోసం ఉదయించిందో

అతనే అక్షరమై బతికిండో

అతని నీడలో ఎందరో బతుకులకు భరోసా

అక్షరమై ఎదిగిన మహావృక్షానికి పూసినపదాలు

వేలగొంతుకలై ఉద్యమించాయి

కర్రను ఊతంగా చేసుకొని యాసకు ప్రాణం పోసి

భాషకు కాంతిపుంజమయ్యిండు

తనకలంనుండిరాలిన సిరా చుక్కలు సమాజచైతన్య దీపికలైనయి

అక్షరమై మొలకెత్తిన అతను

విశ్వాంతరాలంలోకి ఎదిగి మనీషిగా మిగిలాడు!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com