శ్రీ ఆర్.ఎం. ప్రభులింగ శాస్త్రి ఆంగ్ల కథ

తెలుగు అనివాదం- అచ్యుతుని రాజ్య శ్రీ

‘ఏమయ్యోయ్! ఆడపిల్ల కింక పై సదువు ఎందుకంట? ఆ రాత్రి కూతురి ప్రయాణం కోసం కావాల్సిన వస్తువుల్ని సర్దుతున్న వంగడు మల్లయ్యతో అంది లోలమ్మ. తెల్లారితే మహబూబ్ నగర్ ప్రయాణం. భార్య మాట విన్పించుకోకుండా “బిడ్డా సరోజా! నీ‌ సర్టిఫికెట్స్, నీకు కావాల్సిన వన్నీ సరుదుకున్నావా?”.అని కూతుర్ని కేకేశాడు. ” తెల్లగ తెల్లారకుండానే ఆరు గొట్టంగ బస్సుంది”.

“నీవు చెప్పినట్టు చేసినా నాయనా!” సరోజ అంది. “ఏందీ! నా మాట నీసెవి కెక్కటం లేదా?”. మగడ్ని గదమాయించింది లీలమ్మ”. ” ఎహే! నోర్ముయ్యవే. ఊరికే ఎందుకు లొల్లి జేసి బేజారు సేత్తుండావు?” అంతకన్నా గట్టిగానే మల్లయ్య అరిచాడు. నేనూ సూత్త! మీ పని గిట్ల గాదు” అంటూ ఆమె కూతురి సూటుకేసు, బ్యాగు తీసుకుని బెడ్ రూంలోకి వెళ్లింది. ‘ఏందీ! ఇనపడటం లేదా? పెట్టు తీసిన కాడనించి రెచ్చిపోయాడు భర్త.

ఒక్క క్షణం బిత్తరపోయి, మగడి కోపం తెల్సుకనక మళ్లీ వాటిని యధాస్థానంలో ఉంచింది.

ఏంది ని కథ . సరోజకు నేను తల్లి ని గదా? ఆమాత్రం నాకు తెలిదా నా బిడ్డ పై సదివి తీరాలా .ఆమెను బుగులు పెట్టి నిరాశ పరచకు ఆజ్ఞ జారీ చేశాడు వయస్సులో ఉన్న పిల్ల గదా! మన జాగ్రత్తలో మనం ఉండాలే ఒక సారి చెయ్యి జారినాక

మొత్తుకోనుడు , ఏడుసుడు అంత వృథా పైగా హాస్టల్ లో పెడుతుండావు భర్తను రెట్టించింది.

“సుడే లీలమ్మా! మహబూబ్నగర్ లో నా దోస్తు, దూరపు సుట్టం శరణయ్య ఉండాడు. ఆడికి పిల్ల జెల్ల లేదు ఆరింట్లో నా బిడ్డ ఉంటాది. దాని మంచి చెడ్డలన్ని ఆ మగాడు పెళ్ళాం చూసుకుంటారు. మూడేళ్లు అల్లా కాడ బరిన వాని ముత్తెంలా మన బిడ్డ కడుపులో సల్ల కాదులకుంటా సదువుకుంటాది. బుగులు పడకు.” “ఈ ముచ్చట ముందుగళ్లనే నా సేవిన ఎందుకు పడవేయలేదయ్య ? జారింత సెప్తే నేమి ? నేనింత లొల్లి చేసేదాన్ని కాదుగా?” ఆనందం తృప్తి తో నిట్టూర్చింది ఆ తల్లి.

“అంకుల్!” సరోజ పిలుపుతో ఒక్క క్షణం ఆగి “బిడ్డా! నన్ను పెద్దనాయన అని పిలువమ్మా మీ ఆ అప్ప (తండ్రి) కంటే నేను జర పెద్దోడిని వయసుల!” అన్నాడు.

“అట్లనే పెదనాయనా! మరే..నేను జరసేపు ట్రాన్సిస్టర్ వినవచ్చునా?”. ” మరి నీకు హోం వర్క్, సుదువుకునేడిది ఏం లేదా బిడ్డా!”. “నాకు రేడియో వినుకుంటా చదువుకునే అలవాటుండాది”.

” మరి సదివెడెది నీ దిమాగులోకి ఎక్కుతదా సరోజా?” “మంచిగా! చిన్నప్పటి సందీ అలా అలవాటైంది పెదనాయనా!”. మంచిది బిడ్డా! మీ అమ్మ నాయనల తాన గెట్లుంటివో ఈడ కూడా బుగులు పడకుండా మా బిడ్డలెక్కనే ఉండు, సరేనా?”. శరణయ్య మాటలకు పొంగి పోయింది సరోజ.

” సరోజా! ఏంది బిడ్డా! గిట్ల సేస్తుండావు?? మంచిన పెయ్యినిండా పొద్దుగల టిపిను ఎందుకు తినవు?” శంకరమ్మ ఆందోళనకరంగా ఆప్యాయంగా అడిగింది.

“మంచిగనే‌ పొట్టనిండా ఎక్కించినా పెద్దమ్మా!”. ” అమ్మా! నా కడుపున బిడ్డలు పుట్టలేదు. తల్లిప్రేమ మమకారం నాకు ఎరుకనే సరోజా! నేను తల్లి గాకున్నా బిడ్డ ఆకలి గుర్తిస్తనమ్మా!”. “లేదు పెద్దమ్మా! నీవు ఆలోచించి మనసు ఖరాబు చేసికోకు”.

” సరోజా!నా వంట మంచిగ ఉండట్లేదా? మరి‌ మూడే ఇడ్డినెలు(ఇడ్లీలు)తో పెయ్య నిండతదా? వయసులో ఉండ పిల్లవి,పూరీలు మంచిగ తినకుంటే ఎలా?”. “ఆంటీ! నేను ఎన్ని తిన్నాననేది లెక్కపెట్టను. నాకు మస్తుగ పొట్ట నిండింది”. ” అమ్మా! నేను చేసేటివి నీకు నచ్చకుంటే, రుసిగా లేకుంటే నోరు యిప్పి చెప్పమ్మా!”. అలా పదే పదే తనను గుచ్చి గుచ్చి శంకరమ్మ అడుగుతుంటే సరోజ మెల్లగా నసిగింది.

‘పెద్దమ్మా! నాకు చిరుధాన్యాల్తో చేసే రొట్టెలు మంచిగ అన్పిస్తయి. రోజూ రెండు మూడు గవే తింటా”.

“అయ్యో, అట్లనా నా బిడ్డా! మరి సెప్పవేంది? మేము రోజూ అవే తినేటోల్లం. నీ కోసమని ఇడిలీలు సేసినా. రేపటి సంది నీకిస్టమైన రొట్టెలు చేస్తాతియ్!”. శంకరమ్మ వెర్రి ఆనందంతో భరోసా ఇచ్చింది.

” పెద్దమ్మా! నా క్లాసుమేట్ సుకన్యకి ఆమె బావతో పెళ్లి నిశ్చయం అయింది. ఈ రోజు నేను ఆ ఫంక్షన్ కి వెళ్ళి తీరాలి.”. “ఏడమ్మా! సరోజా! ఫంక్షన్ హాలా?”.

” ఆ..మన మహబూబ్ నగర్ లోనే, సుదర్శన్ ఫంక్షన్ హాల్!”.

ఏ టైమ్ కి నీవు ఆడ ఉండాలి?”. “మధ్యాహ్నం 12.45 కి విందు భోజనం అక్కడే. నీవు తినేసెయ్యి”. ” మరి నీ కలాసు(క్లాసు) పిల్లోండ్లు అంతా వస్తుండారా?”.

శంకరమ్మ ప్రశ్నకి చిర్రెత్తు కొచ్చింది. యాబై ఏళ్ళు దాటినా ఆమెకి తను గొడ్రాలు అనే భావం సదా బుర్రను తొలిచివేస్తూనే ఉంటది. పెల్లిపేరెంటాలు తాంబూలాలు పుచ్చుకునే వేడుకలు చేసే తోటి శ్రీలను చూసి ఎక్కడో ఆమె ఎదలో ముల్లు గుచ్చుకునంత బాధ పడుతుంది .మరి మాతృత్వం పొందలేక ఆ అడమనసు పడే భాద ఆ బ్రహ్మకేమి తెలుసు ? “పెద్దమ్మా! ఈయల ఐతవారం (ఆదివారం) కదా? మా క్లాసు వారంతా వస్తున్నారు “, మొహం చిట్లించిన ఆ పిల్లను తల్లిగాని ఆ తల్లి శంకరమ్మ పాపం గుర్తించకే లేదు

” మరి పెయ్యిపై నగానట్రా లేకుండా అట్లనే ఎల్తావా బిడ్డా? “నగలు డిగేసుకురావాలా పెద్దమ్మా ?”

“అదేందీ తల్లి ! శుభకార్యాలప్పుడు బోసి మెడతో ఆడోల్లు ఏళ్లకూడదే తల్లి! నీకు తెల్వదేమో ? జర నే జెప్తుందాగా ,ఇనుకో” ” నాతో పాటు నగ నట్రా తెచ్చుకోలేదు గదా పెద్దమ్మా? ఇప్పుడెలా ?”

“అయ్యో నా తల్లే! నా కడుపున పుట్టకున్న నీవు నా బిడ్డవే, మా ఇంటి లచ్చిమి వి” కన్నకుతురిగా లాలిస్టు మేటికలు ఇరిచింది శంకరమ్మ.

“ఎందయ్యా ! ని చేతి సంచీ బస్తా లేగా బరువుగా ఉదేంటి ? శంకరమ్మ ప్రశ్నకు “ఆ .. మన బిడ్డ సరోజ పుట్టినరోజే ఎర్రి మొగమా! ఈ కొత్త సిరే ,మిఠాయిలు అన్నీ ఆమెకే .. అన్నాడు శరణయ్య

” నీకెట్ట ఎరుకయింది? కూపీలాగింది .

అమ్మాయి ఆమెని కాలేజీలో చేర్పించేందుకు మల్లయ్య తో పోయి ఉంటిని గదా! ఆమె సెర్టిఫికెట్ లో పుట్టిన తేదీ చూసి యాదికుంచుకున్నాను ” సరోజకు ఈ సంగతీ ఎరుకేన?” భార్య ప్రశ్నకు ” ఏమో మనం తమాషా చేద్దాం , సరేనా “అన్నాడు” “అయితే నేనూ అమెకిష్టమైనది ఏమన్నాచేస్తా” అని ఆమె అటుండగానే సరోజ ఇంటి లోకి అడుగెట్టింది. ఏంది, ఈరోజు జల్దీ వచ్చినావు పెద్దనాయిన? పెద్దమ్మా కి పెయ్యి సుస్తుగా ఉన్నదా ని ఖంగారుగా అడిగింది. నీకెమన్న భాగలేదా?

” నాకేం బిడ్డా! మంచి గుండాను ఇయ్యాల బేరాలు ఏమీలెవమ్మా ! అందుకే దుకాణం కట్టేసి బేగ వచ్చిన

బిడ్డా! జర చాయ్ తాగుదువు ” అని వంటింటి కేసినడిచింది శంకరమ్మ .అరగంట తర్వాత మొహం కడిగి వచ్చిన సరోజ చేతిలో చేరే పాకెట్ ఉంచింది .పుట్టినరోజు కదా బిడ్డా ఈరోజు ఈ చీర కట్టుకో తల్లీ!

“అరే మా ఇంటి కాడ గిట్ల ఎప్పుడు నేను పుట్టినరోజు చేసుకున్నది లేదు. మా ఇంటి అనవాయితిలేదు”

‘అవును బిడ్డా! మన కుల గురువుల పుట్టిన రోజులనే మనం ఆచరిస్తాం. కానీ ఈ ఏడాది నీవు మా ఇంటికి నడిచి వచ్చిన లచ్మివి, మాకు ఆసరాగా ఉండే బిడ్డవి”.

” మీ ప్రేమ, ఆప్యాయత ఎన్నటికీ మరవలేను పెద్దమ్మా! మీ కాల్మొక్కుతా” అంటూ ఆ దంపతుల పాదాలకి తలవంచి ప్రమాణం చేసింది.

“ఏంటీ సరోజా! కాలింగ్ బెల్ అలా ఆగకుండా మోగుతుంటే విన్పడటం లేదా?”. హరనాధ్ హెచ్చరికతో ” మీరు చూడొచ్చు గదా?”. ఎదురు ప్రశ్నించింది. “నేను అన్నం తింటున్నా. కన్పడటం లేదా నీకు? భర్త చిరాకుని అర్థం చేసుకున్న సరోజ ” సారీ! చూడలేదు ” అనుకుంటూ వెళ్ళి తలుపు తీసింది. “అరె పెదనాన్నా! అబ్బ…పదేళ్ల తర్వాత కన్పడ్డావు. ఎక్కడున్నావు?”. ఆశ్చర్యంగా శరణయ్యను ప్రశ్నించింది. చాలా బలహీనంగా ముడతలు పడ్డ దేహం, పీక్కుపోయిన కళ్లతో ఎంతో వయసున్న వాడిలా కన్పడుతున్నాడు శరణయ్య.‌ సరోజ ఆదేశంతో స్నానం ‌ముగించి ఆబగా అన్నం తినసాగాడు ఆ వృద్ధుడు. ” తల్లీ! నీ‌ పెద్దమ్మకి కాన్సరు వచ్చింది. ఆమె నగలు, మన ఇంటి ఒక భాగం కూడా అమ్మి వైద్యం చేయించినా. అయినా ఆమె దక్కలేదు. దుకాణాన్ని నెలకి ఐదువందలకి కిరాయికి ఇచ్చినాను. ఆ పైసల్తో బతుకుతుండాను. అమ్మా! నేను కంటి కాటరాక్టు ఆపరేషను చేయించుకొని తీరాల. ఐదు వేలు తక్కువ బడినాయి. కాస్త డబ్బు సర్దగలవా తల్లీ!”. సరోజ నిమ్మకు‌ నీరెత్తినట్లు ఉలక్క పలక్క బొమ్మ లెక్క కూచుంది. “అమ్మా! సరోజా! నా బిడ్డా! నా కంటి ఆపరేషన్ కి కాస్త సర్దమ్మా పైసల్ని. నా చుట్టాలు స్నేహితులంతా దాటేశారు తల్లీ ఈ లోకాన్ని! నీవే నాకు అన్నీ. నేను ఒంటరి పక్షినమ్మా! దిక్కు లేని దివాలా తీసిన ముసలోడిని బిడ్డా”. ఆయన గొంతు వణుకుతోంది. వెక్కిళ్లు పెడ్తూ నడుస్తున్నాడు ఆ వృద్ధుడు.

” పెదనాయనా! అంత డబ్బు నీకు సర్దలేను. ఒక వెయ్యి అయితే ఇవ్వగలను. అంతకన్నా ఒక్క పైసా ఎక్కువ ఇచ్చుకోలేను”. ఖచ్చితంగా, ఖరాఖండీగా అనేసింది. “నాకు నీ బిచ్చం వద్దు తల్లీ! నా బిడ్డ కాడికి వచ్చాను అనుకున్నాను కానీ ముష్టివాడికి విదిల్చనట్లు నన్ను పురుగులా వదిలిస్తావని అనుకోలేదమ్మా” అని అంటూనే, వెనక్కి తిరిగి చూడకుండా ఆ అభిమాన ధనుడు నీరసంగా అడుగులేస్తూ ముందుకి సాగాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com