డాక్టర్ బాణాల శ్రీనివాస్ రావు

మానవ కుటుంబంలోని భేదాల్ని

నేను సుస్పష్టంగా గమనించాను

మనలో కొంతమంది

గంభీరంగా ఉంటారు

ఇంకొందరు హాస్యాన్ని ఇష్టపడతారు

ఇంకొంతమంది చెబుతుంటారు

తాము జీవితాన్ని ఉదాత్తంగా జీవించామని

మరికొంతమందేమో వాస్తవానికి

దగ్గరగా బతికామని వాదిస్తారు

రకరకాలైన మన శరీరాల రంగులు

మనల్ని కలవరపరుస్తూ,

విస్మయానికి గురిచేస్తూ ఆనందపరుస్తాయి.

గోధుమ,గులాబి, ఊదా,నీలం మరియు తెలుపు

నేనిప్పటిదాకా అన్ని చోట్ల ఆగుతూ

ఏడు సముద్రాలమీదుగా ప్రయాణించాను

ప్రపంచ వింతలన్నీ చూశాను కానీ,

ఒక్క సామాన్య మానవుణ్ణి చూడలేదు

నాకు పదివేలమంది స్త్రీలు తెలుసు

జేన్ మరియు మేరీ జేన్ అని పిలవబడే

కానీ నిజంగా ఒకేరకంగా ఉన్న

ఏ ఇద్దరు స్త్రీలని చూడలేదు

వాళ్ళ ముఖకవళికలు ఒకేలా ఉన్నప్పటికి

కవల పిల్లలు కూడా ఒకేలా ఉండరు

ప్రేమికులు పక్కపక్కన ఉన్నప్పటికీ

వాళ్ళ ఆలోచనల్లో తేడా ఉంటుంది

మనం చైనాను ప్రేమిస్తామూ

అందులోనే పోగొట్టుకుంటాం

ఇంగ్లాండ్ బంజరు భూములమీద దుక్కిస్తాం

జనీవాలో నవ్వుతుంటాం వేదనపడుతుంటాం

స్పెయిన్ తీరాల్లో అభివృద్ధి చెందుతుంటాం

మైనేలో పుట్టి చనిపోయినప్పటికి

ఫిన్ ల్యాండ్ లో విజయులమౌతాం

చిన్న చిన్న విషయాల్లో విరోధించినప్పటికీ

చాలా విషయాల్లో ఒకేలా ఉంటాం

నేను స్పష్టంగా తేడాల్ని గమనించాను

రకారాకాలైన విధాలైన వారి మధ్య

మనమంతా ఒకేరకంగా ఉన్నాం మిత్రులారా

విరుద్ధంగా లేము

మనమంతా ఒకేరకంగా ఉన్నాం మిత్రులారా

విరుద్ధంగా లేము

మనమంతా ఒకేరకంగా ఉన్నం మిత్రులారా

విరుద్ధంగాలేము

మాయా యాంజిలో అమెరికన్ కవయిత్రి ఆంగ్ల కవిత Human Family కి స్వేచ్చానువాదం మాయా యాంజిలో అమెరికన్ ఆంగ్ల సాహిత్యంలో ప్రసిద్ధ కవయిత్రి, రచయిత్రి, చరిత్రకారిణి, నాటక రచయిత,పాటల రచయిత,బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నింటికీ మించి పౌరహక్కుల ఉద్యమకారిణి, ఆమె మూడు వ్యాస సంకలనాలు, ఏడు ఆత్మకథలు మరెన్నో కవత్వగ్రంధాలను వెలువరించారు. 1928 పుట్టి 2014 చనిపోయారు.1969 ఆమె రాసిన I know why the caged bird sings అనే ఆత్మకథ ఆమె రచనల్లోకేల్ల ప్రసిద్ధమైనది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com