కొడుకనిమదినెంత గుందువోతల్లి

ననుగన్నతల్లికి నారామిజెప్పి

యనుమానిపడియెంత యడలునోతండ్రి

యాటలమరిగి రాడనిచూతురొక్క

నీటికందువలేమి నిలిచినాడొక్కొ

యేమనివగతురో యీచావువిన్న

నేమిగాఁగలవారొ యిటమిఁదవారు

ఎవ్వరునుదకంబు నిచ్చెదరింక

నెవ్వరు ప్రోచెద రిటమిదవారి

గడగియీబాణ మొక్కటనెమువ్వురుము

బడితినిం కేమని పలవింతువిధికి

ననివిలాపించుచో నావిలాపములు

వినయెప్పుడెప్పుడు విరియునోతమము

ఎప్పుడు చూతునో యిమ్మహాపురషు

నిప్పాటుపాటిల్లె నే నేడునాకు

ననుచుండనుదయించె నఁతచందురుడు

వనధిలోనాశోక వనధియుప్పొంగ

చందురుడుదయింప సరయువుదాటి

యందు నత్తీరంబు నందునువెదక

తనచేతికలశంబు ధరిణి పై వైచి

తనచెక్కుకలశ మస్తకమున జేర్చి

యురమునవీపున నొఁడొండవెడలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com