భిన్న జాతులు, మతాలు, సంప్రదాయాలు, సంస్కృతుల సమ్మేళనంగా చెప్పుకునబడే భారతదేశంలో ఏ రంగానికి సంబంధించిన చరిత్రైనా ఒక్కటే విధంగా ఉండదు. దానికి భిన్న పార్శ్వాలుంటాయి. అట్లాగే సినీ చరిత్రకి కూడా భారతీయ సినిమా చరిత్రలో హిందీ సినిమా చరిత్రదే ప్రధాన స్రవంతి గా చెప్పుకుంటారు. దానికి మూకీ చరిత్ర అనుసంధానమై ఉండటం ఒక ప్రధానకారణంగా చెప్పుకోవచ్చు. ఒక శతాబ్దం పాటు నిర్లక్ష్యపు చెదల నడుమ మగ్గిపోయిన తెలంగాణ చారిత్రక దృష్టి తో చూసినప్పుడు హిందీ చిత్ర సీమతో హైదరాబాదు అనుబంధం మూకీల కాలంలోనే వేళ్లూనుకున్నది‌. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ దృష్టి లేకపోవడంతో ఎందరో సినీ ప్రముఖులు తెరమరుగునే కాలగర్భంలో కలిసిపోయారు. అయితే తెలంగాణ ఉద్యమం మూలంగా వారందరినీ దేవులాడుకుని మన వారని చెప్పుకునే సందర్భం ఒకటి వచ్చింది. ఆ పరంపరలోనే హిందీ చిత్రరంగంలో తెలంగాణ నటీమణుల ప్రస్థానం పై ఒక పిట్టచూపు.

మన దేశంలోకి సినిమాలు 1896 జూలై 7 బొంబాయి లోని వాట్సన్ హోటల్ లూమియర్ బ్రదర్స్ ప్రదర్శనతో పరిచయమైతే 1896 సెప్టెంబర్ మొదటి వారంలో సికింద్రాబాదు నుండి చిన్న సినిమాలతో( షార్ట్ మూకీలు) కూడిన సీప్ హోల్ షోస్ మద్రాసుకు వెళ్లినట్లుగా స్టీఫెన్ హ్యూస్ అనే సినీ చరిత్రకారుడు 2010 లో లండన్ నుండి వెలువడే సేజ్ అర్థ వార్షిక సంచిక. “బయో స్కోప్” లో రాశారు. ఇంకా మద్రాసుకు సికిందరాబాదు నుండి ముడి ఫిల్మ్ కూడా సరఫరా ఐనట్లు రాశారీయన. అంతే గాకుండా స్టీవెన్ సన్ అనే ఆంగ్లో సినిమాటోగ్రాఫర్ దక్షిణ భారతదేశం అంతటా పర్యటిస్తూ మద్రాసు మీదుగా హైదరాబాదు వచ్చి జంటనగరాలలో మూకీలను ప్రదర్శించినట్లు స్టీవెన్సన్ రాశారు. When film came to Madras అనే అధ్యాయంలో పై విషయాలను ఉటంకించారు. ఈ ప్రదర్శన వినాలనీ 1896 సెప్టెంబర్ 2, 1897 ఆగష్టు 31 నాటి మద్రాస్ మెయిల్ డైలీలో రిపోర్టు అయినవి కూడా . ఇవి హైదరాబాదులో మూకీల ప్రదర్శనకు ప్రబల నిదర్శనాలు.

ఈ క్రమంలో 1912లో రాజా హరిశ్చంద్ర తొలి భారతీయ మూకీ తీసిన దాదా ఫాల్కే భారతీయ సినిమా పితామహుడైనారు. దాంతో హైదరాబాద్కు మద్రాసు కన్నా బొంబాయి నే ఎక్కువగా ఆకర్షించింది. అది మూకీల కాలంలోనే ప్రారంభమైంది. అది సరోజినీ నాయుడు కుటుంబంతో. అప్పటికే సినిమాల్లో నటించడానికి సంప్రదాయ కుటుంబాలలోని మహిళలెవరూ ముందుకు రాని పరిస్థితి. ఈ పరిస్థితిని చేధించి కమలాబాయి గోఖలే(1914), పెషెన్స్ కూపర్(1918), గౌహర్ జాన్(1919), సుల్తానా సీతాదేవి, ఫాతిమా బేగం, మోహనా(1922), జిల్లో(1924) వంటి వారు సినిమాల్లో నటిస్తున్న కాలం అది. అటువంటి పరిస్థితుల్లో తొలుదొలుత హైదరాబాద్ నుండి వచ్చి కెమెరా ముందు నిలిచిన వారు ఇరువురు సునాళినీ దేవి- మృణాళినీ దేవి. వీరు సరోజినీ దేవి చెల్లెండ్లు కావడం గమనార్హం. వారి తరువాత జుబేదాబేగం, రాం ప్యారీ, టి‌‌‌.లలితాదేవి, నిగార్ సుల్తానా, మాధవి, షబానా అజ్మీ, టాబూ, దియామీర్జా, అదితీరావు, హైదరీకిరణ్ రావు, కీర్తీ రెడ్డి తదితర హైదరాబాదీలు బాలీవుడ్ ను ప్రభావితం చేశారు. తమదైన ముద్ర వేశారు.

సునాళినీ దేవి- మృణాళినీ దేవి

హైదరాబాదు నగర సాంస్కృతిక పునరుజ్జీవనోద్యమంలో సరోజినీ దేవి కుటుంబానిది కీలకమైన పాత్ర. కవులు, కళాకారుల నిలయమైన కుటుంబం నుండి వచ్చిన సునాళినీ దేవి, మృణాళినీ దేవి ఇరువురూ సరోజినీ నాయుడు చెల్లెండ్లు. మృణాళినీ దేవి 1883 లో జన్మించగా, సునాళినీ దేవి 1890 లో జన్మించారు. కవిత్వం, ఆంగ్ల నాటకాలతో మమేకమైన వారి కుటుంబంలో సరోజినీతో బాటు, హిరేంద్రనాథ చటోపాధ్యాయ కళారంగంపై పట్టు సాధించి ఉన్నారు. వీటి ప్రభావం చేత సరోజినీ మరో సోదరి లీలామణి, హరీన్, పద్మజనాయుడులతో కలిసి నాటకాలలో పాల్గొనేవారు. హరీన్ కు బొంబాయి తో ఉన్న పరిచయాలు వీరిని సినిమాల వైపు మళ్లించినవి.

మూకీల కాలంలోనే హిమాణ్ రాయ్, దేవికా రాణిలు భారతీయ సినిమా వికాసానికి దోహదపడిన వారిలో ప్రముఖులు. బాంబే టాకీస్ బానర్ పై చాలా చిత్రాలు తీశారు. 1925 లో వారు తీసిన లైట్ ఆఫ్ ఇండియా లో మొదటిసారిగా వీరిరువురూ నటించారు. ఈ చిత్రం తరువాత మృణాళినీ బొంబాయి నుండి మద్రాసు వెళ్లి షమా అంతర్జాతీయ త్రైమాసిన పత్రికకు సంపాదకురాలైంది. కళలు, సంస్కృతి, నాగరికతాంశాలకు అధిక ప్రాధాన్యత నిచ్చే ఈ పత్రిక 1931 వరకు వెలువడింది. ఆ తరువాత మృణాళినీ హరీక్ చటోస్ రచనలకు ముద్రించారు. ‘దమాజాక్ ట్రీ’, ‘పరష్యూమ్ ఆఫ్ ఎర్త్(1922)’, సక్కుబాయి(1924), క్రాస్ రోడ్స్(1934) వంటివి వాటిలో కొన్ని. ఇదిలా ఉండగా ఆ తరువాత హరీకచటోప్ ని పెళ్లాడిన కమలాదేవి చటోపాధ్యాయ బెంగుళూరులో తీసిన ‘వసంత సేవ(1931)’ లో నటించింది.

ఇక మిగిలిన సునాళీని విషయానికి వెళ్దాం. బొంబాయిలోన స్థిరపడిపోయిన సునాళిని టాకీ చిత్రాలు వచ్చాక (1931), వీర్ కునాల్(1932), పూజా(1940), మొహబ్బత్(1943), మహీకవి కాళిదాసు, ఉమంగ్, ముజ్రమ్, గాలీ(1944), ఫిర్ బి అప్నా హై(1946) శాంతి, నౌకాడుబి(1947), షికాయత్, ఆజాద్ కి రామ్ పర్(1946), దిల్ రుబా(1950) నాదాన్, మల్హర్, బుజ్ దిల్(1951), నౌలుహార్, జల్ జలా, తమాషా, కఫీలా(1952), బాప్ బేటీ(1954) వంటి పాత్రిక్ చిత్రాలో కారెక్టర్ రోల్స్ చేసింది. దాంతో హైదరాబాదు స్టేట్ నుండి తొలిసారిగా బాలీవుడ్ వెళ్లిన తారలుగా సునాళినీ, మృణాళినీ చరిత్రతో నిలిచిపోయారు.

ర్యాంపారీ

ముంబాయి మూకీలలో నటించిన మలి తార ర్యాంపారీ. చాలా కొత్తగా వినిపిస్తుంది ఈ పేరు. అసలు ఎవరీ ర్యాంపారీ. హైదరాబాదుకు చెందిన అచ్చ తెలుగు కుటుంబానికి చెందిన నర్తకి ర్యాంపారీ. ఆమె కుటుంబమంతా సంగీత, నాటక రంగాలలో కలిగి ఉండేది. వారంతా కళావంతుల సామాజిక వర్గానికి చెందిన వారు. వారి ముందు తరాల వారంతా తారామతి ప్రేమనూతికి చెందిన వారు. వీరంతా గోలకొండ తనాషా తమ అతిధులు వచ్చినప్పుడు ఆ స్థానంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆహ్వానింపబడేవారు. నిజాం సంస్థానం నుండే గాక ఇతర రాజస్థానాల నుండి కూడా సంగీత, నృత్య కార్యక్రమాలు ప్రదర్శనలు చేయడానికి వీరికి ఆహ్వానం అందేది అయితే గోలకొండ ప్రభుత్వం పాలన అంతమైన తర్వాత ఈ కుటుంబాలన్నీ చెట్టుకొకరు, పుట్టకొకరుగా చెల్లాచెదురై పోయినవి. అలా విడిపోయిన వారంతా మాదన్నపేట, హయత్ నగర్ వంటి ప్రాంతాలకు వెళ్లగా మరికొందరు మద్రాసు ప్రెసిడెన్సీ ప్రాంతానికి వలస వెళ్లారు. వీటిలో కొన్ని కుటుంబాల సమూహం హైదరాబాదు పాత నగరంలోని వాగుల చింతకు వెళ్లి అక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇక్కడంతా చింత తో పూలతో నిండి నాగుపాముల నిలయంగా ఉండేది. అందుకే ఈ ప్రాంతానికి నాగుల చింత అనే పేరు వచ్చింది. ఈ నాగుల చింతలోనే ర్యాంపారీ పుట్టింది. అది 1908 డిసెంబరులో. ఇదే సంవత్సరం హైదరాబాదు నగరానికి భారీ వరదలు వచ్చినవి. ఈ వరద బీభత్సాన్ని అకాలంలో బొంబాయి నుండి జె.ఫ్.మదన్ తన బృందాన్ని డాంక్యుమెంటరీగా చిత్రీకరించారు.

ఇదంతా వుంచితే ర్యాంపారీ తెలుగు, ఉర్ధూ, హిందీ, ఆంగ్ల, మరాఠీ, కన్నడ భాషల్లో మంచి ప్రవేశం కలిగి వుండి పాడటమే గాదు నాట్యం కూడా నేర్చుకున్నది. 1918 లో పదేళ్ల వయసులో తమ బంధువుల ఇంటికి మద్రాసు వెళ్లింది. అక్కడ తన పెద్ద తల్లి పెంపకంలో నాలుగేళ్ల పాలు భరతత నాట్యం నేర్చుకుని మద్రాసులో పేరున్న నాట్యకారిణిగా ఎదిగింది. 1926 లో మద్రాసులో ఒక నాట్య ప్రదర్శన ఇస్తుండగా చూసిన బొంబాయికి చెందిన కోహినూర్ ఫిలిం కంపెనీకి చెందిన నిర్మాత ఒకరు చూసి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని బొంబాయికి ఆహ్వానించాడు.ఆకాలంలో బొంబాయిలో పెద్ద సంఖ్యలో మూకీ చిత్రాలు తయారవుతున్నవి. వెంటనే అవకాశం వరించి చందూ లాల్ షా తీసిన గుణ సుందరి (1927) మూకీలలో తొలిసారిగా ఒక సపోర్టింగ్ రోల్ చేసి వెండి తెరకు పరిచయమైంది. రెండో చిత్రం వైల్ విమెన్(1928) లో కూడా చిన్న పాత్ర పోషించిన ర్యాంపారీ ఆ తరువాత మరో 20 చిత్రాల్లో (మూకీ) హీరోయిన్ గా నటించింది. 1930నాటికి బొంబాయిలో అత్యధిక జనాధరణ పొందిన హీరోయిన్ గా ఎదిగింది. ఆ తరువాత సిల్వర్ క్లౌడ్, నీలం మవేక్, కుంజ్ కిషోరీ, హామ్లెట్, డ్రీమ్ లాండ్, డిటెక్టల్ కుమార్(1928), రెవల్యూషన్, రాజ్ హంస, మిస్ డాలీ, జై సోమనాథ్, హతీం తాయి, ఫిమేల్ ఫీల్, ఫ్రెండ్ ఆర్ ఫెయిండ్(సన్మిత్ కి శైతానీ), డేరింగ్ రాథోడ్(11929), మస్మినా ది వాయిలెంట్, డేర్ డెవిల్, ఇమ్మోర్టల్ గ్లోరి(1930), లయనెస్, డాషింగ్ యూత్(1931) ఆమె నటించిన మూకీ చిత్రాలు.

టూకీలు వచ్చిన 1931 లో మూడు చిత్రాల్లో నటించిందంటే రామ్ ప్యారీకి ఉన్న జనాదరణ ఏపాటిదో తెలిసిపోతుంది. అవి పాక్ రామన్,లైలా మజ్నూ, ఘర్ కీ లక్ష్మీ. ఈ నెపథ్యంలో ఆమె గుణ సుందరి(1934), మఠీనజర్, జీవన్ నాటక్, ఆజాద్ అబల, అపరాధి(1935), సునెషరా సంసార్, జాన్ బాజ్ బాలిక్(1936), మిలాప్, సముందీశ్వరి(తమిళ), ఖుదాయి, భార్మూత్ దార్( 1937) ప్రేమ్ సాగర్(1939), బారాత్(1942), ఆశీర్వాద్(1943), ఘజల్(1945), గీత గోవింద్, కౌన్ పరదేశి(1947) వంటి టాకీల్లో పృథ్వీరాజ్, మాధర్ కాలే, జైరాజ్ వంటి అగ్రశ్రేణి హీరోలతో కలిసి నటించిందామె. హైదరాబాదులో పుట్టి బొంబాయి చిత్రసీమలో నాయికగా ఎదిగిన రామ్ ప్యారీ బొంబాయిలోనే చివరి రోజులు గడిపింది. హైదరాబాదు నుండి ఎవరైనా అభిమానులు వెళితే స్వచ్ఛమైన తెలంగాణ యాసలో తెలుగులో మాట్లాడేవారామె. ఇంకా దఖనా ఉర్దూ ఆమె స్పష్టంగా పలికే వారు. మూకీల కాలంలో తెలుగు నటనే గాకుండా దేశమంతా పర్యటించి నృత్య ప్రదర్శనలు ఇచ్చిన రామ్ ప్యారీ సిలోన్ లో కూడా పర్యటించింది. సిలోన్ లేబర్ యూనియన్ ఆమెను బంగారు జ్ఞాపికతో సత్కరించింది. ఆమె చివరికి బొంబాయిలోనే కాలధర్మం చెందింది.టూకీలు వచ్చిన 1931 లో మూడు చిత్రాల్లో నటించిందంటే రామ్ ప్యారీకి ఉన్న జనాదరణ ఏపాటిదో తెలిసిపోతుంది. అవి పాక్ రామన్,లైలా మజ్నూ, ఘర్ కీ లక్ష్మీ. ఈ నెపథ్యంలో ఆమె గుణ సుందరి(1934), మఠీనజర్, జీవన్ నాటక్, ఆజాద్ అబల, అపరాధి(1935), సునెషరా సంసార్, జాన్ బాజ్ బాలిక్(1936), మిలాప్, సముందీశ్వరి(తమిళ), ఖుదాయి, భార్మూత్ దార్( 1937) ప్రేమ్ సాగర్(1939), బారాత్(1942), ఆశీర్వాద్(1943), ఘజల్(1945), గీత గోవింద్, కౌన్ పరదేశి(1947) వంటి టాకీల్లో పృథ్వీరాజ్, మాధర్ కాలే, జైరాజ్ వంటి అగ్రశ్రేణి హీరోలతో కలిసి నటించిందామె. హైదరాబాదులో పుట్టి బొంబాయి చిత్రసీమలో నాయికగా ఎదిగిన రామ్ ప్యారీ బొంబాయిలోనే చివరి రోజులు గడిపింది. హైదరాబాదు నుండి ఎవరైనా అభిమానులు వెళితే స్వచ్ఛమైన తెలంగాణ యాసలో తెలుగులో మాట్లాడేవారామె. ఇంకా దఖనా ఉర్దూ ఆమె స్పష్టంగా పలికే వారు. మూకీల కాలంలో తెలుగు నటనే గాకుండా దేశమంతా పర్యటించి నృత్య ప్రదర్శనలు ఇచ్చిన రామ్ ప్యారీ సిలోన్ లో కూడా పర్యటించింది. సిలోన్ లేబర్ యూనియన్ ఆమెను బంగారు జ్ఞాపికతో సత్కరించింది. ఆమె చివరికి బొంబాయిలోనే కాలధర్మం చెందింది.

తొలి టూకీ నాయిక జుబేదా బేగం

భారతీయ సినిమా చరిత్ర మొదటి రోజుల నుండీ సినిమా వ్యాపార రీత్యా హైదరాబాదు స్టేట్ ప్రాంతమంతా కూడా బొంబాయి రీజియన్ లోనే ఉంటున్నది. బొంబాయిలో ఎంత సినిమా వ్యాపారం జరిగేదో హైదరాబాదు స్టేటు(నైజాం) కూడా ఇంచు మించి అంతే వసూళ్లు చేసేది. ఈ అనుబంధమే జుబేదా బేగంని హైదరాబాదుకు చేరువ చేసింది.

ఇంతకీ ఈ జుబేదా బేగంకి మన హైదరాబాదుకు ఏమిటీ సంబంధం అనే అనుమానం రావచ్చు. అది తెలుసుకోవాలంటే 110 ఏండ్ల వెనక్కి వెళ్లాలి. బాంబే ప్రెసిడెన్షీలోని సూరత్ లో 1911 లో జన్మించిన జుబేదా బేగం తల్లి ఫాతిమా బేగం మూకీల కాలంలోని నటి, నిర్మాత, దర్శకురాలు. తండ్రి ఇబ్రహీం ముకూత్ ఖాన్. సంప్రదాయ ముస్లిం కుటుంబమే అయినా కళాభిమానం గల కుటుంబం కావడం తల్లి ప్రొత్సాహంతో సినిమాల్లోకి ప్రవేశించి 1924 లో ‘గులేబ కావళి’ చిత్రం ఆమె నటించిన తొలి మూకీ. ఆ తరువాత 1933 వరకు సాగిన మూకీల నిర్మాణ సమయంలో 37 మూకీలలో నటించిన నటి జుబేదా. మనోరమ, పృథ్వీ వల్లభ్, కళ్యాణ్ ఖజేనా(1924), దేవదాసి, దేశ్ కా దుష్మన్, ఇంద్ర సభ(1925), కాశీ రా బుల్ బులే ఫరిస్తా, సతీమహీదేవి(1926), లైలా మజ్ను, ననంద భోజై(1927), షీర్ రాంఝూ, చమక్తీ చందా(1928), కనక్ తార్, మిలాన్ దినార్(1929), నూర్ ఏ పంజాబ్, దేవదాసి, వీర్ రాజ్ పుత్( 1930), రొమాంటిక్ ప్రిన్స్(1931) వాటిలో కొన్ని.

1931 లో టాకీల నిర్మాణం మొదలైనపుడు తొలి భారతీయ టాకీ చిత్రం ఆలంఆరాలో నాయికగా జుబేదా బేగంని ఎంపిక చేయడంతో ఆమె తొలి భారతీయ టాకీ నాయికగా సినీ చరిత్రకెక్కింది. ఆ తరువాత ఆమె వీర్ అభిమన్యు(1931), జరీనా, బుల్ బులే పంజాబ్(1932), మహాభారత్, ది అన్ టచ్ బుల్ (1933), సేవా సదన్, ననంద బోజై, బీర్బల్ కీ బేటీ(1934), గుల్షన్- ఏ- ఆలం, మా(1936), దేవదాస్, జేరత్ కీ జిందగీ, కిస్ కీ ప్యార్(1937) వంటి టాకీలలో నటించారామె. ఆమె చివరగా నటించిన చిత్రం నిర్దోష్ ఆబల(1949).

ఇవన్నీ సరే జుబేదాకి హైదరాబాద్ కి ఉన్న సంబంధం ఏమిటంటే ఆమె హైదరాబాదు కి చెందిన మహారాజ్ నర్సింగ్ ధన్ రాజ్ గిర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆయన హైదరాబాదులో థియేటర్లు ఏర్పాటు చేయడమే గాక హిందీ చిత్ర నిర్మాణంలో పెట్టుబడులు పెట్టేవారు. నానూ భాయ్ వకీల్ తో కలిసి “మహలక్ష్మీ సినిటోన్” సంస్థ సంస్థను నెలకొల్పి 1934 నుండి సినిమాలు తీశారు . జుబేదా హిందీలో తీసిన పౌరాణికాలలో ద్రౌపది, ఉత్తర, సుభద్ర పాత్రలకు పెట్టింది పేరుగా కీర్తిగడించారు .పృథ్వీరాజ్ కపూర్ ,మాస్టర్ విఠల్ వంటి తొలితరం హీరోలతో ఆమెది హిట్ కాంబినేషన్ .బొంబాయిలోని ధనరాజ్ మహల్ ప్యాలస్ లో తన చివరి రోజులను గడుపుతూ 1988 సెప్టెంబర్ 20 న కన్నుమూసిన జుబేదా తొలి భారతీయ టాకీ ‘ఆలం అరా ‘ లో నటించిన హైదరాబాదీ కోడలుగా తెలంగాణ సినీచరిత్రలో సమున్నతస్థానాన్ని పొందిన తార .

18) లలితా దేవి

భారతీయ టాకీల తొలిరోజుల్లో హిందీ చిత్రాలలో నటించిన మరో తార టి.లలితాదేవి.ఈమె హిందిలో సరితాదేవిగా ప్రసిద్ధురాలు.1916 లో హైదరాబాదు నగరంలో ఒక కళావంతుల కుటుంబంలో పుట్టారామె .బాల్యంలోనే సంగీతనాట్యాలు నేర్చుకున్న ఆమె తండ్రి బొంబాయిలో ధనవంతుడు కావడంతో ఆమెకు సినిమా ప్రవేశం సులభంగానే జరిగింది . ఈమె తల్లి సోదరి వీణాధను , ఈమెకూతురు బాలసరస్వతి కూడా సంగీత ,నృత్యకారిణిలు .సరితదేవిగా సినిమాల్లో కాలుమోపిన లలితాదేవి సాగర్ ఫిలిమ్స్ ,ఇంపీరియల్ ఫిలింస్ వారి స్టంట్ చిత్రాలలో ఎక్కువగా నటించింది .1935 లో వచ్చిన పంజాబ్ మెయిల్ , 1940 లో వచ్చిన విజయకుమార్ చిత్రాల్లో ఈమెనే హీరోయిన్ .

మూకీల కాలంలోనే బొంబాయి వచ్చిన ఎం .ఏ .రెహమాన్ అనే కెమరామెన్ (ఔరంగాబాద్) తో ఏర్పడిన పరిచయం ఆమె జీవితం మలుపు తిప్పింది .ఆయనను వెంటబెట్టుకొని మద్రాసువచ్చి అతన్ని వివాహమాడి ఇక్కడే స్థిరపడిపోయారు .తెలుగులో రఘుపతి ప్రకాశ్ తీసిన ‘చండిక ‘ లో మంత్రిభార్య వీరపత్నిగా నటించి పరిచయమయ్యారు .అదే ఏడాది వై .వి .రావు “విశ్వమోహిని”లో లలితదేవి హీరొయిన్ గా నటించింది .దీనితర్వాత నాలుగేళ్లు తిరిగి బొంబాయిలో హిందీచిత్రాల్లో చేసిన లలితదేవి 1944

లోవచ్చిన ‘భీష్మ’ లో నటించిన లలితాదేవి నాగయ్య గారి ‘త్యాగయ్య'(1946) లో చాపల వేషంతో మరోసారి ప్రేక్షకులకు చేరువయ్యారు .పిమ్మట మరో మూడు తెలుగు తమిళ చిత్రాల్లో చేశారు .తెలుగు సినీరంగంలో “బొంబాయి లలిత” గా పిలుచుకునే ఈమె 1948 వరకు హిందీలో దాదాపు డజను చిత్రాలలో నాయికగా నటించినట్లు 1948 లో వచ్చిన చిత్రకళ అనే గ్రంధంలో ప్రస్తావించారు .అనంతరం ఆమె ధోబీగా జమీన్ (1958) , బిరాజ్ బహు (1954) , దేవదాస్ (1955) ,సోనే కి చిడియా (1958) , కిసీనే కహతా (1960) ,ప్రేమపత్ర (1962) , గబన్ ఆయేదిన్ బహార్ కే (1971) పావేజా , పియాకఘర్ (1972) హర హర మహదేవ (1974) ఆంచల్ (1980) తదితర హిందీ చిత్రాలలో క్యారెక్టర్ రోల్స్ వేసారు .

లలితాదేవి ఎక్కువకాలం బొంబాయిలో చిత్రరంగంలో ఉండటంవల్ల ఆమె కడపటి రోజులేవి తెలిసిరావడంలేదు.

నిగార్ సుల్తానా

హిందీ చిత్రరంగాన్ని తొలితరంలో ఏలిన తారల్లో ఒకరయిన హైదరాబాదుకు చెందిన నిగార్ సుల్తానా .1932 జూన్ 21 న హైదరబాదు గన్ ఫౌండ్రి లోని సాంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన నిగార్ సుల్తానా బాల్యంలోనే ఉర్దూ ఆంగ్లబాషలను ప్రయివేటుగా నేర్చుకుంది .వీటితో బాటు సంగీత నృత్యాలలో శిక్షణపొందింది .ఇంట్లో సినిమాలపై తన ఆసక్తిని తెలుపగానే అంతా ససేమిరా అన్నారు .అయితే ముంబైలోని బంధువుల్లో ఒకరు ఆమెను ప్రోత్సహించి తల్లితండ్రులను ఒప్పించి అక్కడికి రప్పించుకుంది .

1946 లో”రంగభూమి”ఆమె నటించిన తొలిచిత్రం .ఆ తరువాత బేలా , నావ్ , షికాయత్ చిత్రాల్లో నటించి హిందిలో స్థిరపడిన నిగార్ సినీ జీవితం స్థిరపడింది రాజకపూర్ “ఆగ్ “తో .అందులోని ముగ్గురు నాయికల్లో ఒకరు నిగార్ కూడా .తరువాత వచ్చిన ‘పతంగా ‘ కూడా మంచిపేరు తెచ్చింది . ఈ సినిమాలో “మై పియా గయే రంగూన్ ” పాపులర్ పాట నిగార్ పైనే చిత్రీకరించారు .ఆ తరువాత దిలీప్ కుమార్ సరసన ‘ యహూది ‘(1958) ,ప్రాణ్ తో శీష్ మహత్ (1950) హైదరాబాద్ హీరో అజీత్ తో “పతంగా” (1949) ‘దామన్’ ‘దుర్గేశ్ నందిని ‘ , భరత్ భూషణ్ తో ” మీర్జా గాలీబ్ ” శ్యామ్ తో ‘సంగీత్ ‘ (1950) , చిత్రాలలో నటించిందామె. ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చి వెంటనే మనకు గుర్తుకు వచ్చే చిత్రం ‘మొగల్- ఎ- ఆజం’. నర్తకి బహార్ పాత్రలో నిగార్ నటన శిఖర స్థాయి కి చేరుకుంది. ఆ పాత్రలో నేటికీ మరొకరిని ఊహించుకోలేము. అనార్కలి సలీం ల ప్రేమను విచ్ఛిన్నం చేయడానికి అసూయతో కూడిన నటన నిగార్ కి గొప్ప పేరు తెచ్చిపెట్టింది.

అనంతరం షాన్- ఎ- హింద్, సాయం(1961), నూర్జహాన్ (1967), దోక్ లియా,మేరే హమ్ దమ్ మేరే దోస్త్(1968), బన్సీ బిర్జూ (1972) వంటి చిత్రాలలో నటించారామె. అలనాటి ప్రముఖ దర్శకుడు కె.ఎ‌.అసిఫ్ ను వివాహం చేసుకున్నారామె. అయితే నటి హీనా కీసర్ ఆమె కుమార్తెనే. తన 68 వ ఏట 2000 ఏప్రిల్ 23 న బొంబాయిలో తనువు చాలించింది నిగార్. హిందీ తెరపై మూడు తరాల పాటు నటిగా వెలిగిన నిగార్ “హైదరాబాద్ కీ నాజ్నీన్” గా, బాలీవుడ్ లో భాగ్యనగర సౌందర్య శిఖరం గా నిలిచిపోయింది.

మాధవి:-

మాధవి అనగానే చాలామందికి ఖైదీ చిత్రం గుర్తుకు వస్తుంది. అందులోని స్నేక్ డాన్స్ గుర్తుకు వస్తుంది. “తూర్పు పడమర” ఆమె తొలి చిత్రం. ఆ తరువాత “ఈ ఉమ్మడి బతుకులు”, మరో చరిత్ర, తరువాత ‘ ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’, అమావాస్య చంద్రుడు వంటి చాలా కమర్షియల్ చిత్రాలు తెలుగు లో చేశారు. ఇంఅక మలయాళ, కన్నడ, తమిళ భాషలన్నింటిలోనూ నటించిన మాధవి ఏక్ దూజేకి లియే, తో హిందీ రంగంలోకి ప్రవేశించింది. ఆ వెంటనే అమితాబ్ తో అంధకామాన్ నటించే అవకాశం వచ్చింది. మళ్లీ అమితాబ్ తోనే గిర్ ఫ్తార్ లో నటించిన మాధవి, మషాల్, జ్వాలా, లోహా, ప్యార్ కీ మందిర్, జఖ్మ్, శేష్ నాగ్ వంటి చిత్రాల్లో జితేంద్ర, ధర్మేంద్ర, రాజేష్ ఖన్నాలతో కలిసి నాయికగా చేసింది. ఆ తరువాత తెలుగు ‘మాతృదేవోభవ’ చిత్రం తో తన నట జీవితంలో మరపురాని నటనను ఆవిష్కరించి సినిమాలకు దూరంగా విదేశాల్లో స్థిరపడింది మాధవి.

షౌకత్ అజ్మీ

షౌకత్ అజ్మీ హిందీ సినిమా, నాటక రంగాలలో ప్రసిద్ధురాలు. ప్రఖ్యాత సినిమా నాయిక షౌకత్ అజ్మీ ఈమె కూతురే. ప్రగతిశీల భావాలున్న కుటుంబంలో హైదరాబాదులో 1928 అక్టోబర్ 20న జన్మించారామె. తండ్రి యహ్స ఖాన్ నిజాం సర్కారులో ఎక్సైజ్ అధికారి గా పనిచేసేవారు. అరబిక్, ఉర్దూ, ఆంగ్లం తో బాటు తెలుగు భాషను కూడా నేర్చుకున్న షౌకత్ కైఫీ అజ్మీని ప్రేమించి పెళ్లి చేసుకుని బొంబాయి వెళ్లి పోయింది. అక్కడ పృథ్వీ, ఇష్టా సంస్థలలో నాటకాలు వేసింది. గదర్, ఆహుతి, శకుంతల, దీవార్, పఠాన్, కిసాన్, కళాంకార్, పైసా నాటకాల్లో ప్రధాన భూమికలు పోషించారు. ఆమె 1970ల్లో సినిమాల్లో చేరి ఎం.ఎస్ సత్యు “గరంహవా” లో తొలిసారి నటించారు. దీని నిర్మాత, కెమెరామెన్ ఇషాన్ ఆర్య హైదరాబాదీ వాడే. అయితే షౌకత్ కి గుర్తింపు తెచ్చిన చిత్రం ‘ఉమ్రాల్ జాన్’ లోని ఖానమ్ జాన్ పాత్ర. స్వతంత్ర భావాలున్న ఖానమ్ జాన్ లక్నోలో నాట్య కత్తల నివాసాన్ని నిర్వహించే లోకంపోకడ తెలిసిన స్త్రీ ‌పాత్ర. హైదరాబాదులో వేశ్యావాటికల్లో స్త్రీల జీవన స్థితి గతులకు దర్పణం పట్ఏ ‘బాజార్(1982) లోనూ నటించిన షౌకత్ ఆ తరువాత ‘లోరీ’ (1984), అంజుమన్(1986) చిత్రాలలో నటించింది. మిరా నాయర్ ‘సలాంబాంబే’లో వేశ్యమాతగా షౌకత్ ని తప్ప మరొకరిని ఊహించలేము. ఇంకా ప్రిన్స్(1969), షీర్ రాంఝూ(1970), ఓ మైనహీ, జుర్మ్ బేర్ సజూ, ఫాస్లా(1974), ధూప్ చావ్(1977) లతో బాటు చివరిగా “సాథియా” (2002) లో నటించిన షౌకత్ ‘కైఫీ అండ్ ఐ’ పేర ఆత్మకథ రాసుకున్నారు. ఆ మహానటి 2019 నవంబరు 22 న బొంబాయిలో కాలం చేశారు.

షౌకత్ అజ్మీ

భారతదేశం గర్వించదగిన నటి షబానా. హైదరాబాద్ లోనే పుట్టిందామే. అమ్మమ్మ గారింట్లోనే బాల్యమంతా గడిచింది. పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటనలో శిక్షణ పొంది రాగానే శ్యాం బెనగళ్ “అంకూర్” లో నాయికగా ఎంపికైంది. అదీ హైదరాబాదీ కథ. “అంకూర్” లో మూగవాడి భార్యగా షబానా నటనకు జాతీయ అవార్డు వచ్చింది. ఆ తరువాత రే, మృణాల్ సేన్, బాను చటర్జీ, దీపా మెహతా, గౌతమ్ ఘోష్, అపర్నా సేన్ వంటి ప్రఖ్యాత దర్శకుల 120 పైగా చిత్రాల్లో నటించారామె. షత్రంజ్ కి ఖిలాడి, ఏక్ దిన్ అబానక్, సతి, అర్థ్, గాడ్ మదర్, ఫైర్, ధారవి, సాజ్ వంటివి వాటిలో కొన్ని. ‘అర్థ్’ , కాందహార్, పార్, గాడ్ మదర్ చిత్రాలకు వరుసగా జాతీయ ఉత్తమ నటి తో బాటు, ఫిల్మ్ ఫేర్, విదేశీ ఫిల్మోత్సవాల సత్కారాలు, పద్మశ్రీ, పద్మభూషణ్, అక్కినేని పురస్కారం, గాంధీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డులు ఆమెను వరించి తమ గౌరవాన్ని పెంచుకున్నది. ఒక రకంగా చెప్పాలంటే మన కాలపు మహా నటి షబానా అజ్మీ.

ఫర్హా- టాబూ సిస్టర్స్:-

హైదరాబాద్ లో పుట్టారు. ఫరా తెలుగులో విజేత, విక్రమ్ చిత్రంలో నాయిక. హిందీ లో ఫాస్లే మొదలుకొని ఇమాందార్, నకబ్, మతీమ్ వంటి చిత్రాల్లో అనిల్ కపూర్, అమీర్ ఖాన్, సన్ని డియోల్ వంటి హీరోలతో కలిసి 70 చిత్రాల్లో నటించింది ఫరా. ఇక ఆమె చెల్లి టాబూ తెలుగులో చాలా చిత్రాల్లోనే నటించింది. నిన్నే పెళ్లాడతా, ఆవిడా మా ఆవిడే, అందరివాడు, షాక్, పాండురంగడు, మొన్నటి అల వైకుంఠపురం వరకు. అయితే హిందీలో ఆమె విభిన్న నటిగా మూబిస్, చాంద్ నీ బార్ చిత్రాల్లో నటించి జాతీయ అవార్డు అందుకున్న ది. విరాసత్, హుతూంతూ అస్థిత్వ వంటి హిందీ, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాల్లో పేరున్న నటి టాబూ.

అదితీరావు హైదరీ- కిరణ్ రావు

వనపర్తి సంస్థానం రాజారామేశ్వర రావు కుటుంబీకులు కిరణ్ రావు టెక్నీషియన్ గా పేరొందారు. ఆమె ప్రముఖ హీరో అమిర్ ఖాన్ ని ప్రేమించి పెళ్ళి చేసుకుంది. దర్శకురాలిగా, నిర్మాతగా, స్క్రిప్టు రైటర్ గా తనదైన ముద్రతో 2011 లో ధోబీ ఘాట్ చిత్రాన్ని తీశారు. నిర్మాతగా జానే తూ పజానేనా, పీప్లి లివ్, డెల్లీ బెల్లీ, తలాష్, దంగల్, సీక్రెట్ సూపర్ స్టార్ చిత్రాలనే గాక ‘రూబరూ రోష్ని’ అనే టివి డాక్యుమెంటరీని కూడా తీశారు.

రాజారామేశ్వరరావు మనవలు అతిదీరావు హైదరీ. కిరణ్ రావు ఈమెకు మేనమామ కూతురు. తండ్రి ఇషాన్ హైదరీ. తల్లి

విద్యారావు. తండ్రి తరపు వారు నిజాం కాలంలో ప్రధానమంత్రిగా పనిచేసి ఉన్నారు. తొలుత ఢిల్లీలో తరువాత ముంబైలో చదువుకున్న అదితి 2006 లో ‘ప్రజాపతి’ మలయాళ చిత్రంతో తెరకు పరిచయమైంది. ఆ తరువాత “ఢిల్లీ 6” చిత్రంతో మొదలుకొని “ఏసాలీ జిందగీ”, ” లండన్ పారిస్ న్యూయార్క్ “, రాక్ స్టార్, మర్డర్ 3, బాస్, ఖూబ్ సూరత్, గుడ్డు రంగీలా, వజీర్ హిందీ చిత్రాల్ గానీ ‘శ్రీరంగం’ తమిళం చిత్రంలో కార్తీతో నటించింది అదితి. హిందీ ‘పద్మావతి’ లో మొహమన్నీ సాగా తెరపై మెరిసిందీమె. అమితాబ్, రేఖ, జయాబచ్చన్ ల ప్రశంసలందుకున్న అదితి తెలుగులో ఇంద్రగంటి మోహనకృష్ణ ‘సమ్మోహనం’ పరిచయమై తరువాత ‘అంతరిక్షం’, ‘వి’ చిత్రాల్లో నటించిందీమె.

ఈ నేపథ్యంలో హైదరాబాదీయులైన డయానా హైడెన్, దియా మిర్జా, పాయల్ రోహట్గి, కీర్తి రెడ్డి, మధుషాలిని, షెర్లిన్ చోప్రా వంటి హీరోయిన్లు బాలీవుడ్ తెరపై తెలంగాణ తారాతోరణంగా వెలుగొందుతున్నారు. వీరంతా బాలీవుడ్ సినీ సౌదానికి భాగ్యనగర్ చెక్కిన నగీషీలుగా మనం గర్వించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com