అరొక్క పూలకు రంగు రంగుల

సొగసులు నయనాల నిండా

వెన్నెల వెలుగులు

ప్రకృతి చుట్టూరా

అల్లుకున్న సౌందర్యం

మనసంతా విశాల పరిమళ దృశ్యం

అసలు ఆహార్యమే ఇంపైన

పరపరాగం

మొగ్గల నుంచే మొదలైన

రిక్కల నునుపు వర్ణం

పుష్పాలను పలకరిస్తేనే

మనసుకు వికాసం

పందిరి తీగలన్నీ గాజుల

సప్పుడే వింటాయి

పడతులకూ పద్మాలకు అనేక

అనుబంధాలు

పుడమి సృష్టించిన పురాతన వా

రసత్వం

పూలకు స్త్రీలకూ పూర్వ

పుప్పొడి బంధం

అలంకారం లోనూ పుష్పరాగాల సర్వస్వం

మందార గన్నేరు బంతీ చామంతి

శత పత్రాలన్నీ అచ్చం ఆ

కిలకిల నవ్వుల్లెక్కనే

అరచేతుల్లోని మైదాకు

ఎర్రని పొద్దుపొడుపు

పాదరక్షల గూడల మీద మొగ్గల

అల్లిక

వ్యానిటీ బ్యాగుల మీదా

కనకాంబరాలు

తాళంచెవి గొలుసుకు చిక్కిన

గులాబీ రూపం

సెల్ ఫోన్ కవర్ మీద నవ్వే

తెల్లని లిల్లీ

నొసటి బొట్టు లోనూ మెరిసే

పోక బంతి

గాజుల గలగలలోనూ నందివర్ధనం

శబ్దాలు

గోర్ల పెయింట్ లోనా అంటిన

గోరంటలు

పట్ట గొలుసుల్లో

పట్టుకుచ్చుల మెరుపులు

కాళ్ల మట్టెలకు మామిడి

పిందెలు కాత

పతానపు ఉంగరం, ముక్కు పోగు మీదా

లతలు లతలుగా అల్లుకున్న చెక్కనాలు

సిగపువ్వు ,జడ పువ్వు పేర్ల

లోనే రాజీవం

నడుమున ఒడ్డాలానికి బటాని

తీగల వయ్యారం

విశ్వకర్మ కొలిమి పుత్తడి

పూల కుండి

ఆరు గజాల చీర నక్షత్రాల ఆకాశం

లతలు లతలుగా అల్లుకున్న

అవని చందం చీర అంచుల మీద వన్నె వన్నెల

పిందెల బూటాలు

కొంగు మీదా పసందైన కొంగల

అల్లికలు రైక చేయ్యంచున చిత్ర

చిత్రాల ముద్రలు

మొగ్గం గుంట నుంచే పుష్పాల పుట్టుక

పుష్పక విశ్వమంతా మనుషుల కండ్ల పండుగ

సగం ఆకాశానికి అదొక

ప్రాకృతిక పర్వం

పూల వికాసం ఒక కళాత్మక భావన

నవ్య ఆలోచనలు విరబూసిన సారం

సొగసు మనసు కలిసిపోయిన

తేజస్సు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com