భైరవ కవి- శ్రీరంగ మహాత్మ్యం

భైరవ కవి ప్రసిద్ధకవి గౌరన కుమారుడు. నూతనకవి సూరనకు సమకాలికుడు.కవిగజాంకశం అనే ఛందశ్శాస్త్ర గ్రంథం రాశాడు.రుతుపరీక్ష పేరుతో నవరత్నాలను గురించి వాటిలో ఉత్తమత్వాలనుగురించి రాశాడు. ఇది ఒకవిధంగా శాస్త్ర గ్రంథము. ఛందశ్శాస్త్రము కూడా శాస్త్రగ్రంథము. ఇవి కాక శ్రీరంగమాహాత్మ్యము అనే పేరుతో శ్రీరంగ క్షేత్రమువెలసిన కథను గరుడ పురాణం నుండి తీసుకొనికావ్యంగా రాశాడు. చిత్రకవిత్వము కూడాప్రవేశపెట్టినాడు. చక్రబంధం, నాగబంధం వంటి బంధ కవిత్వాలనురాశాడు. లఘువులలో వచనం రాశాడు. భైరవ కవప్రయోగదక్షుడుగా కనపడుతున్నాడు.

హరిదివ్యనామధేయామృతంబింపార

జెలగి యాస్వాదించు జిహ్వజిహ్వ

గోవింద కల్యాణగుణ విశేషంబులు

పలుమారు తలపోయు తలపు తలపు

కమలాక్షు నిత్యమంగళమూర్తి విభవంబు

సొంపారవీక్షించు చూపు చూపు

ఫణిరాజతల్ప శ్రీపాదపద్మంబులు

చేరి యర్చన సేయు సేత సేత

వాసుదేవ ప్రియంబైన వ్రతము వ్రతము

దైత్యభేది నుపాసించు తపము తపము

శౌరి నారాధనము సేయు జపము జపము

విష్ణు పదభక్తి సమకొల్చు వినికి వినికి

మాకందము కడునిది ర

మ్మా కందము డాయబోయి మంజీరులకన్

మాకందగ వెరగవిసిన

మాకందముగాదె మగువ మాకందమిలన్

వారములకు నతమని వరి

వారములకు నెలవుటలగుచు వాలెడి సమ్య

గ్వారము వారము తనకు

వారము లొనరింపసింధువారములతివా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com