ప్రశ్నించే గొంతుకలను కాపాడాలంటున్న రచయిత్రి…

ప్రపంచంలోని ఏ దేశాన్ని పరిశీలించినా అవి వివిధ అసమానతలకు, అణిచివేతలకు అతీతంగా లేవనే చెప్పాలి. వేగంగా దూసుకుపోతున్న ప్రపంచ మానవాళి యొక్క జీవన శైలి ఈ అసమానతలు అణిచివేతలు అనే స్థితిని ఏమరపాటుగా యాది మరిచిపోవచ్చును. కానీ ప్రతి యాడాదిలాగే ఈ ఏడు నిర్వహించుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం అసమానతలను గుర్తుకు తెస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా నెలకొని ఉన్న స్త్రీల సమస్యలను, వారి పోరాటాలను, విజయాలను, వైఫల్యాలను అంతర్జాతీయ మహిళాదినోత్సవం బేరీజు వేస్తుంది కూడ. అంతే కాక ఆయా ప్రజా సమూహాల, ముఖ్యంగా మహిళా సమూహాల ప్రాతినిధ్యాలను, ప్రతీకల ప్రాధాన్యత ఆధునిక సమాజాలలో వాటికి ఆవశ్యకతను తెలియ జెపుతుంది.

మరో వైపు ‘ఒక పక్క అభివృద్ధిమరోపక్క అసమానత ‘ అనే పొసగని స్థితి. ఈ స్థితి మనుషుల మధ్య కావచ్చు, మరియూ మానవాళి ప్రకృతికీ మధ్య కావచ్చు. ఈ ఫలితంగా ప్రపంచంలో వివిధ ప్రతికూలతలకు మరియూ అసమతుల్యతలకు దారి తీసిన గడ్డు స్థితులనుండి ఇంకా బయట పడలేదన్నది అందరికీ అనుభవమే.ఈ నేపథ్యంలో పరిమిత మైన గొంతులే అయినప్పటికీ అవి ముఖ్య మైనవి, సమర్థ వంతమైనవి’ అనే ఉద్దేశంతో ఈ వ్యాసంలో వివరించడమైంది.

ప్రపంచ వ్యాపితంగా ముందుకొచ్చిన రకాల పోరాటాలు, ప్రయత్నాలు అనేకం ఉన్నాయి. అవి సమూహాల నాయకత్వం గానో, వ్యక్తుల నాయకత్వం గానో నిర్వహిస్తూ నిరంతర చలనశీలత స్వభావాన్ని కలిగిన పోరాటాలు చరిత్రలో రాయబడ్డాయి. అవి ఒక వ్యక్తి భద్రత కాడి నుండి సమాజ భద్రత వరకు నడిచిన పోరాటం కావచ్చు, కొత్త రాష్ట్రాన్ని సాధించుకున్న ఉద్యమం కావచ్చు, పర్యావరణ పరిరక్షణ పోరాటం కావచ్చు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణా ఉద్యమం కావచ్చు. రాజ్యాంగం ప్రకారం పాలించే గొప్ప నేతను తమ ఓటు ద్వారా

ఓడించడం కావచ్చు, రాజ్యాంగాన్ని ఉల్లం ఘించే నేతను తమ ఓటు ద్వారా ఓడించే పోరాటాలు కావచ్చు. విద్య,

జ్ఞానం, ఉద్యోగంను ఆర్జించే యుద్ధం లాంటి ప్రయత్నాలు కావచ్చు. దీనమైన కడు పేదరికంలో ఒక వ్యక్తి ఆత్మ గౌరవంతో నిలబడగలిగే వెసులుబాటు ఉండే సమాజం కోసం కావచ్చు. పైన పేర్కొన్న లేమిలతో పుట్టుకొచ్చే వివిధ అసమానతలు సమాజాన్ని వైరస్ ల మాదిరిగా పీడిస్తున్న తీరును చూస్తున్నాం. అవి వర్ల కుల జండరు ప్రాంతం మత అసమానతలు ఇందులో భాగమని చెప్పాలి. ఈ పోరాటాలన్నింటిలో సమాజంలో సగభాగమైన స్త్రీల యొక్క విద్య, విజ్ఞానం, ప్రాతినిధ్యం, సాధికారత అనేవి కచ్చితమైన ప్రాతిపదిక అయినపుడు, ఆయా దేశాల రాజ్యాంగా లలో భాగంగా కొనసాగుతాయి గమనించాలి.

ఈ నేపథ్యంలోనే మన భారతదేశ రైతుల పోరాటాన్ని పేర్కొన వచ్చు. మొత్తం దేశంలోనే వివాదస్పదమైన మూడు చట్టాలను కేంద్ర సర్కారు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న రైతుల పోరాటమది. వేలాది మంది రైతులు తమ కుటుంబాలతో సహా దేశ రాజధాని ఢిల్లీలోని రహదారులపై శాంతి పోరాటాన్ని నడుపుతున్నారు. అంతర్జాతీయ మీడియా ఈ పోరాటాన్ని ప్రపంచ ఖ్యాతి గాంచిన పోరాటం అని పేర్కొనడం విశేషం, సముచితం కూడ. కారణం ఈ పోరాటం ఎంతో విలక్షణమైంది, వైవిధ్యమైనది మాత్రమే కాదు అన్ని శ్రేణుల ప్రజా సమూహాలను కలుపుకోగల, కలుపుగోలుతనపు తత్వమున్న పోరాటమిది. ఇప్పటిదాక థి తో R లు వేరు ఇప్పటి రైతులు చేస్తున్న పోరాటం వేరు. వీటి మధ్య అంతగా పోలికలు లేవనే చెప్పాలి. అంతే కాదు, పోరాటం, ఆందోళన అనే పేర్లకు నేటి ఢిల్లీ రైతుల పోరాటం కొత్త నిర్వచనం ఇచ్చిందని చరిత్ర కారులు అభిప్రాయం పడుతున్నారు. ఈ పోరాటంలో ఉన్న వేలాదిమంది రైతు పురుషులతో పాటు వేలాది మంది రైతు స్త్రీలు ఉన్నారు. ఆ రకంగా రైతు కుటుంబ జీవనాన్ని ఢిల్లీ రోడ్లపై పోరాట రూపంలో నెలల తరబడి కొనసాగిస్తున్నారు వారు. ఆ రకంగా వ్యవసాయ కుటుంబ జీవన నాగరికతను కేంద్ర పాలకుల కనుల ముందు దృశ్యీకరిస్తున్నారు.

ఇప్పటి వరకు మనం భారత చరిత్ర పుస్తకాల్లో నదీ నాగరికతని, పట్టణ నాగరికతలను చదువుకున్నాం. ఇపుడు మాత్రం వ్యవసాయనాగరికతని చదువు కోవాల్సి వస్తుంది అని కూడా సూచిస్తు న్నారు. ఇక ప్రతీకలు విషయానికొస్తే, ఈ పోరాటం లోని వేలాది మంది రైతు స్త్రీలు దేశంలోని కోట్లాది మంది స్త్రీలకు ప్రతీకలుగా నిలిచారనే చెప్పాలి. ఈ కుటుంబాలని స్త్రీలని కులానికి మతానికి ప్రాంతానికి అతీతంగా తమలోని వారిగా భావిస్తున్న అనేక మంది నేటి యువత దిశారవి, నవదీప్ కౌర్ వంటి వారు తమ గొంతెత్తి ఈ ఉద్యమానికి తోడ్పడడం ఇందులో భాగమే. ఇది నేటి విషయం ఐతే రాజకీయ ప్రాతినిధ్యం వహిస్తున్న యువ మహిళ నేతల పాత్ర ఈ ఉద్యమానికి ఎంతో తోడ్పడుతున్న విధానం ఎంతో ముఖ్యమైంది. వ్యవసాయ వ్యతిరేక చట్టాలకు విరుగుడు అయ్యే అంశాలను నాలుగు సంవత్సరాల క్రితమే తన ప్రసంగంలో లేవనెత్తిన నేటి తరం నేత కల్వకుంట్ల కవితగారు. తాను యంపీగా పార్లమెంటులో చేసిన ప్రసంగంలో వ్యవసాయ వృద్ధికోసం, రైతుల మద్దతు ధరను ప్రాముఖ్యతనిస్తూ నిధులు కేటాయించాలని ప్రతిపాదించారు. వీటితో పాటు తెలంగాణలో రైతులకు పసుపు బోర్డు, భారీనీటి ప్రాజెక్టులకు, నదుల పరిరక్షణకు ప్రాధాన్యత నివ్వాలనే అంశాలను లేవనెత్తారు కవిత గారు. వ్యవసాయానికి కావాల్సిన సానుకూల విధానాలను నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ రోజు అన్నదాతల కుటుంబాలు రోడ్డుమీద కాపురాలు చేయాల్సిన దుస్థితి.

పార్లమెంటులో అనేక వర్తమాన అంశాలను హేతుబద్ద తర్కంతో నికార్బైన వ్యక్తీకరణ చేస్తూ కనిపించే నేటి మరో నేత మోహువా మొయి . షాహిన్ బాగ్ మహిళల, ఢీల్లి రైతు మహిళల గొంతుకై పార్లమెంటులో ఇప్పటికీ సింహా ధ్వనులు వినిపిస్తూనే ఉన్నారు మోహిత్ర. తెలంగాణలో కరోనా మహమ్మారి గడ్డు సమయంలో అడవుల్లో ఆదివాసీ మహిళల గొంతుగా ములుగు ఎమ్మెల్యే సీతక్క విజయవంతంగా నిలిచారు.

మరో వైపు ఆసక్తి కరమైన అంతర్జాతీయ యువ కవయిత్రి గొంతును మనం వింటున్నాం. ఈ మధ్యనే గెలిచిన అమెరికా అధ్యక్షుడిని సన్మానించుకోవడంలో భాగంగా జరిగిన మహాసభలో అమండా గోర్డాన్ వ్యక్తి కరించిన మాటలివి ‘నాకు నేటి ప్రెసిడెంట్ డే గొప్ప రోజు. నేను ఈ సమయం కోసం ఎప్పటినుండో ఎదిరి చూస్తున్నాను. ఇప్పుడు వచ్చింది. మేం ఈ దేశ వాసులం. ఒక సన్నగా ఉన్న నల్లజాతి అమ్మాయి. బానిసల నుండి వచ్చిన వంటరి తల్లి చేత పెరిగిన నాలాంటి అమ్మాయి, ఈ దేశ అధ్యక్షురాలు కావాలని కలలు కంటుంది’. అని చెప్పిన ఈమె మాటలు అమెరికాతో సహా అనేక దేశాల్లోని తల్లులు వారి పిల్లలకు గొంతుకగా నిలిచింది.

చదువు ఉద్యమానికి గొంతుకగా స్థిరపడిన మలాల యూసఫ్తాయి. ‘ఒక

పెన్ను ఒక పుస్తకం ప్రపంచాన్ని మార్చేస్తుంది’ కనుక ప్రతి బాలిక ప్రతి బాలుడు తప్పకుండా చదువుకోవాలి’ అని నినదిస్తున్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాల యుసష్టాయ్ ప్రపంచ వ్యాపితంగా విస్తరించి ఉన్న చదువుకు దూరంగా విసిరేయబడి విద్య విజ్ఞానం కోసం తపించే యువ ప్రపంచానికి ప్రతీకగా నిలిచింది మలాల.

ప్రపంచ వ్యాపితంగా, గ్లోబల్ స్థాయి నుండి లోకల్ కుగ్రామం స్థాయి వరకు ప్రతి రంగంలో అవసరమైన ప్రతి సందర్భంలో, సర్వ రంగాలలో, సర్వ వృత్తుల లో మహిళలు సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్నారు. ఇక పోతే ప్రజల, యువత, మహిళల ప్రతీకలుగా నిలుస్తున్న ప్రాతినిధ్యపు గొంతుకలను రోజు రోజుకు పెంచుకోవడం, వాటిని కాపాడుకోవడం అనే ఆవశ్యకతను యాదికి చేస్తుంది నేటి అంతర్జాతీయ మహిళా దినోత్సవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com