మహంతమ్మ గారి పద్యం

(క్రీ.శ. 1833 ప్రాంతం)

శ్రీ సదాశివచిత్త సరసిజవాస గురు నందీశ్వరా

వాసవాది గీరీశ సన్నుత దాసపాలక శ్రీకరా

వ్యాస భుజయుగ వార్ధి కుంభజ యేశ భువనాధీశ్వరా

బాసుర ప్రద బొరళా చలమందిరా బసవేశ్వరా

సోమరాజు ఇందుమతాబాయిగా పద్యం:-

(1910,1915-1984, రుద్రాక్ష పల్లి, ఖమ్మం జిల్లా)

శా|| ఆచారమ్మలలంకృతమ్మలు స్తుతి వ్యాపారముల్ నేఁటివా

పాచీనంబుల నిండి కొన్నవి సమార్థ వ్రతంబందోన్

హా చైతన్య కలాస్వరూపిణి త్రిలింగోర్వీ సుమారామముల్

బూచెన్ గా మధురాన నేందు మధు సంపూర్ణ ప్రవాహంబునన్

రూప్ఖానుపేట రత్నమ్మ గారి పద్యం:-

(1847-1929, రంగారెడ్డి జిల్లా, పరిగి, ఇప్పటూరు)

కం// తరుణీకృత పాండిత్యము

స్థిరమూ యీ మాటలను ఛేదింపకుడీ

హరియాజ్ఞగాక నాకీ

కరణి యుపన్యాస మొసగు జ్ఞానముగలదే

జ్ఞానాంబ గారి పద్యం:

(1930 వ దశకం, ఖమ్మం)

మ|| నిను బద్యంబులఁ బాటలన్ గృతులతో నిక్కంపు సద్భక్తియై

వినుతిన్ జేపెద నీ కరంబులను హృద్వీధిన్ దగన్ జేర్చి మా

నిని నే నన్ను నమాన మౌ కరుణ నెంతేఁజూచి పోషింపునా

తనువున్ బ్రాణము నీకె యర్పితము నాథా సూర్యనారాయణా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com