ఎదుట లేని వారిని

ఊహతో చూస్తున్నట్టే లెక్క

వారి మాటలను

రోమాంటిసైజ్ చేసుకొని వింటున్నాం

పక్క వీధికి కూడా

నడక మర్చిపోతున్నాం

ఏదైనా ఫోన్ లోనే

తేల్చుకుంటున్నాం

ఎటు చూసినా పరుగులే పరుగులు

వేగానికి గమ్యం వేగమే అయినట్టు

సూరుమైళ్ల స్పీడ్

ఇంటి ముందు పార్క్ చెయ్యడానికే.

నలుగురు కూర్చొని

హృదయాలను వొంపుకొని ఎన్నాళ్లింది!

సావధానంలో వున్న సౌందర్యం

సంరంభంలో ఉంటుందా!

గడియారం

కాలాన్ని ఒరుసుకుంటూ సాగిపోతుంది.

ట్యూబ్ లైట్ స్టార్టర్

నిరర్థకంగా గర్జించినట్టు

ఎవరికీ స్థిమితంగా ఉండదు.

‘అమ్మా నువ్వు లేవు

కాబట్టి ఏదీ రుచించదు’

అని పిల్లలు అనరు

అంతా ప్లానింగ్ ప్రకారమే జరుగుతుంది.

ఎండ కూడా అందమైందే!

దూరంగా

గాజు పలకలు మెరుస్తుంటాయి.

సంధ్య కాస్సేపే,

నేపథ్యంలో చీకటి

కిందికి దిగుతుంది.

గమనించడానికి సమయమే లేదు.

స్పందనలు లుప్తమని కాదు

అవన్నీ బంద్, కమ్ రే మే బంద్.

ఏది ప్రాధాన్యమో

ఏది వెనకో మర్చిపోతున్నాం

పైకి పద్దతిగా కనిపించినా

లోపలంతా కెయాస్!

ఇక ఆపేస్తాను

ఇది కవిత్వం కాకపోవచ్చు

ఎక్కడెక్కడో

మనఃపంజరంలో ఖైదీ అయిన

శబ్దాలను విడిపించి

ఎగరేస్తున్నానంతే!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com