లౌకిక ,వేదాంత విషయాలు మేళవించి రచించిన గాధ కుచేలోపాఖ్యానం .ఇది ఆంద్ర మహభాగవతం దశమ స్కంధం లో ఉంది .బాల్యమిత్రుడైన కుచేలున్ని కృష్ణుడు ఆదరించిన సందర్భం లోనిది .భాగవతం 15 వ శతాబ్ది పూర్వ భాగం లో జీవించిన పోతనామాత్య విరచితం .పోతన వరంగల్లు జిల్లాలోని బమ్మెర గ్రామ వాసి . పోతన పద్య కవిత్వం లోని ప్రాసాద గుణం ,పదగుంఫనం ,శైలీ నైగనిగ్యం ,ఈ నాటికీ నిత్య నూతనం .తెలంగాణ గర్వించదగ్గ ఈ మహాకవి ఒక చిరు ఖండిక ఈ తరం పాఠకుల కోసం …….
ఎడిటర్ .
మ. కని డాయం జనునంతఁ గృష్ణుఁడు దళత్కంజాక్షుఁ డప్పేదవి
ప్రుని నశ్రాంతదరిద్రపీడితుఁ గృశీభూతాంగు జీర్ణాంబరున్
ఘన తృష్ణాతురచిత్తు హాస్యనిలయున్ ఖండోత్తరీయున్ గుచే
లుని నల్లంతనె చూచి సంభ్రమవిలోలుం డై దిగెన్ దల్పమున్..
కరమర్థి నెదురుగాఁ జని
పరిరంభణ మాచరించి బంధు స్నేహ
స్ఫురణన్ దోడ్తెచ్చి సమా
దరమునఁ గూర్చుండఁ బెట్టెఁ దన తల్పమునన్..
అట్లు గూర్చుండఁబెట్టి నెయ్యమునఁ గనక
కలశసలిలంబుచేఁ గాళ్లు గడిగి భక్తిఁ
దజ్జలంబులు దనదు మస్తమునఁ దాల్చి
లలిత మృగమద ఘనసార మిళితమైన.
తే. మలయజము మేన జొబ్బిల్ల నలఁది యంత
శ్రమము వాయంగఁ దాళవృంతముల విసరి
బంధు రామోద కలిత ధూపంబు లొసంగి
మించు మణిదీపముల నివాళించి మఱియు.
ఉ. ఏమితపంబు చేసె నొకొ యీ ధరణీ దివిజోత్తముండు దొల్
బామున యోగివిస్ఫురదుపాస్యకుఁడై తనరారు నీ జగత్
స్వామి రమాధినాథు నిజతల్పమునన్ వసియించియున్న వాఁ
డీ మహనీయమూర్తి కెనయే మునిపుంగవు లెంతవారలున్.
* చ. తన మృదుతల్పమందు వనితామణి యైన రమాలలామ పొం
దును నెడగాఁ దలంపక యదుప్రవరుం డెదురేఁగి మోదమున్
దనుకఁగఁ గౌఁగిలించి యుచితక్రియలన్ బరితుష్ఠుఁ జేయుచున్
వినయమునన్ భజించే ధరణీసురుఁ డెంతటి భాగ్యవంతుఁడో.
చేదుపాట
—- చేదుపాట —-
క్షమించండి
నేనిప్పుడు శైశవగీతాన్ని ఆలపించబోవడం లేదు
పిల్లలపై ,పువ్వులపై
మెరుపు మెరిస్తే ,వాన కురిస్తే
ఆనందించే కూనలపై
ఈలలు వేస్తు ఎగురుతుపోయే
పిట్టలగురించి పిల్లల గురించి
పాడబోవడం లేదు
నిజానికి మనమిపుడు
రేపటి వెలుతురు మొగ్గల్ని చిదిమేస్తున్న
స్మశానాల్లో బతుకుతున్నాం
ఆడపిల్లగా పుట్టడమే నేరమైన
బీడునేలపై గాలి పీలుస్తున్నాం
వికసిస్తున్న యవ్వనపుష్పాలను
కాలరాస్తున్న కత్తులవంతెనపై
కదలాడుతున్నాం
కళ్ళనిండా మెరిసే కలల్తో
అమాయకంగా రైళ్ళెక్కే
కౌమార సొగసుల్ని, కామాటిపురాకి
రవాణా చేసే రాస్తాల్లో
మొద్దుబారిన మనసుల్తో
నడుస్తున్నాం
కత్తిరింపుల్లేని పచ్చిబూతు తప్ప
మరో అర్థం లేని LED తెరలు
గుమ్మరించే వెకిలి వికారాల ముందు
నిస్సహాయులమై ,నిర్వికారంగా
కూర్చుంటున్నాం
నూరు రూపాయల నోటు
కడుపు నింపదేమోగానీ
కారుచౌక ఇంటర్నెట్టు డేటా
నీలిస్వప్నతరంగాలు రోజంతా చేసే
కలుషితప్రసారాలు మెదళ్ళలో
నింపుకుంటున్నాం
తల్లి పక్కలోని నెలల పసికందు
ఏ నేరం చేసిందిరా దౌర్భాగ్యుడా ?
కళ్ళైనా పూర్తిగా తెరవని పసికూన
నిన్నెలా రెచ్చగొట్టిందిరా మదమృగమా ?
తాతవో ,మామవో ,అంకుల్ వో ,అన్నవో
చిన్నాన్నవో ,చివరికి నాన్నవో
నువ్వెవడివైనా కానీ –
నిన్ను సంబోధించడానికి
మేమిప్పుడు సరికొత్త. నిఘంటువు
సిద్ధం చేసుకోవాలి
ఇప్పుడిక –
బాలింతరాలు సైతం
బరిసె చేతబట్టుకొని
పురిటిమంచానికి
కాపలా కాయాల్సిన
దౌర్భాగ్యకాలమొకటి దాపురించింది !!

9441492737