పసిపిల్లలకు మాటలోచ్చేటప్పుడు

ముందుగా అత్త తాత అంటారట

అత్తంటే ఐశ్వర్యం .. తాతంటే ఆయుష్షు

మరి నేనే పదం ముందన్నానో …..

నాకు మాత్రం తాత అనే పదంతో అనుభంధమెక్కువ

తాతయ్య గురించి ఇరవైఐదేండ్లు

ప్రతిరోజు నాన్నవిప్పిన మాటలమూటల్లోంచి…

తాతయ్యను చూసుకునేదాన్ని

సంతోషంలోను…. విషాదంలోను….

మరి నానేమో వాళ్ళనాన్నరూపాన్ని నాలో చూసుకునే వాడు

ఇదిమా నాన్నకు అమ్మకు తెల్సిన నిజం

తాతయ్య గురించి నల్లగొండ జిల్లాలో

తెల్వనోళ్ళు ఉండరంటే ఆశ్చర్యం లేదు

ఆ రోజుల్లో చాలామంది పెళ్లిళ్లకు నగల్ని చేసింది తాతయ్యే

నల్గొండ… రామగిరి…ఏడెల్లి …నార్కట్ పల్లి…చిట్యాల …

రామన్నపేట.. రాయగిరి.. సిరిపురం ..ఎల్లెంకి.. భోనగిరి.

ఇలా ఏఊరిలో అడిగినా ……..

టక్కున చెప్పేది తాతయ్య పేరే

A నాన్న అనేవారు మనిషి లేకపోయినా…

తన నిజాయితి మాత్రం పచ్చబొట్టులా నిలిచిపోతుందని

నాన్న మాటలకర్ధం మా తాతయ్య గురించేనని

అందరంటుంటే అర్ధమయ్యింది

తాతయ్య పనితనం గురించి అందరు గొప్పగా చెప్పేవాళ్ళు

అసలు అడ్డిగా చేస్తే చేపూరి చెల్లయ్యచారే చేయ్యాలట

ఇప్పటికి అమ్మ అడ్డిగాను చూస్తే!

తాతయ్యను చూసినంత ఆనందపడ్తాన్నేను

ఎన్ని కష్టాలోచ్చినా అమ్మ అడ్డిగాను మాత్రం అమ్మలేదు నాన్న

తాతయ్య కు జ్ఞాపకంగా… ముందు తరాలకు గుర్తుగా…..

ఓ సారి ఓ పెద్దాయన మా తాతయ్య గురించి అన్నాడు

బంగారు నగల్ని చేసే ఆయన మనసు కూడా బంగారం అని

బంగారునగలకు సూర్యరష్మీతో నగిషీలనద్ధి నగల్ని చేసిన ఘనత ఆయనది.

తాతయ్య గురించి విన్నప్పుడల్లా

నేను జీవితం లో ఏమీ సాధించాకున్నా

ఎంతో జయించినట్లు ఫీలవుతా

బంగారు నగల్ని చేయడం ఒకవృత్తే కాదు అదో అద్భుతమైన కళ

మరి ఆ కళ పదికాలాలు నిలవాలంటే!

కళాకారులకు అనుదినం కావలసింది….

Time management …dedication….Perfection….. Good attitude..

(I believe my Grandfather was not only a dedicated worker but also a perfect human being)

కొన్ని కళలు ….కులవృత్తులు ఎప్పటికీ మాసిపోవు

స్వర్ణకారుల వృత్తి అలాంటిదే

స్వర్ణకారులంటే గొప్ప సృజనకారులు

నేను ఈస్వర్ణకారుల కులంలో పుట్టినందుకు గర్విస్తున్నా

ఎన్ని మషిన్లోచ్చినా…..ఎంత ఆటోమాటిక్ అయిపోయినా

కళాకారుని స్థానం కళాకారునిదే

ఏ యంత్రాలఅనకొండలు ఆ కళల్ని మింగలేవు

ఎంత పెద్ద చదువులు చదివినా

మన కులవృత్తుల అవగాహన అవసరం

మనవేళ్ళకున్న కళానిపుణ్యాన్నినిరంతరం సానపెట్టుకోవాలి

అప్పటి రక్తం యిప్పటికి మనలో ప్రవహిస్తే!

మన కులాలకుంపట్లనీ ఆరీపోనీకుండా

మన మూలాల్ని మనం రాజేస్తూ…..

మనకులపురాణాల్ని గానంచేస్తూనే ఉండాలి

మసితో ….బొగ్గులతో… సుత్తెతో…. పట్టేడతో…పట్టుకారుతో…పని అనుకోకుండా

అబ్బా బంగారంతో పని అనుకుంటే ఎంత బాగుణ్ణు

(Not only a coin has two sides but our thinking also should be)

చదువుతోపాటు కులవృత్తుల పాఠాలు పిల్లలకు చెప్పాలి

అప్పుడే ! కులవృత్తులు కొనసాగకపోయినా

చేపూరిచెల్లయ్యాచారి లాంటి కళాకారులు

అజరామరులౌతారు అందరి జ్ఞాపకాల్లో ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com