బొమ్మ హేమాదేవి కథల్లో మానవ విలువల ప్రతిపాదన…

రచయిత్రి పరిచయం…

రచయిత్రి బొమ్మ హేమాదేవి నిజామాబాద్ జిల్లాకు చెందినవారు. సెప్టెంబర్ 14, 1931లో జన్మించారు. హైదరాబాద్ నారాయణ గూడలోని ఆంధ్ర బాలికల ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. చిన్నప్పటి నుండే హేమాదేవిది బలమైన వ్యక్తిత్వం. కరీంనగర్ జిల్లా మానకొండూరు

గ్రామానికి చెందిన నారాయణ గౌడ్ హేమాదేవికి వివాహం జరిగింది. సంపన్న కుటుంబంలో పుట్టిన ఆమె అంతస్తుల తేడా ఉన్నా కూడా ఏమాత్రం సౌకర్యాలు లేని పల్లెటూరుకు కోడలిగా వెళ్లారు. అనంతరం వారు హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆమె 1960వ సంవత్సరంలో రచనలు చేయడం ప్రారంభించారు. తన రచనా వ్యాసాంగాన్ని అభివృద్ధి చేసుకుంటూ అనేక రచనలు చేసి పాఠకుల ప్రశంసలు అందుకున్న తొలితరం తెలంగాణ రచయిత్రి హేమాదేవి. తొలి రోజుల్లో ఆమె దేవి రమ పేరుతో రచనలు చేశారు. ఆంధ్రజ్యోతి వార పత్రిక 1973లో నిర్వహించిన సినీ కథల పోటీలో తన పెద్ద కోడలు హేమాదేవి పేరున రచించిన కుంకుమ పూలు కథకు ప్రథమ బహుమతి రావడంతో హేమాదేవి పేరుతోనే రచనలు కొనసాగించారు. దాదాపు 35 నవలలు, వందకు పైగా కథలు ఆమె ఖాతాలో జమయ్యాయి. ఆంధ్రభూమి నిర్వహించిన పోటీల్లో ఆమె రచించిన తార నవలకు బహుమతి లభించింది. పొగమంచు అనే రేడియో నాటిక శ్రోతల నుండి ప్రశంసలు పొందింది. 1970-80 మధ్య కాలంలో ఆమె అన్ని పత్రికల్లో కథలు, నవలు రాశారు. సాహిత్యాన్ని, సంగీతాన్ని అమితంగా ఇష్టపడే హేమాదేవి 26 నవంబర్ 1996లో తన 65 వ ఏట కీర్తిశేషులయ్యారు.

హేమాదేవి కథల్లో అన్ని కోణాలు, అన్ని రకాల అంశాలు ఉంటాయి. అందులో కుటుంబ సంబంధాలు ఎక్కువగా కనిపిస్తాయి. కుటుంబ వ్యవస్థలో ఒకరిపై ఒకరికి ఉండే ప్రేమానురాగాలు ఆమె కథల్లో కనిపిస్తాయి. ఆమె కథల్లోని కుటుంబ సంబంధాలను ఓసారి పరిశీలిద్దాం. మానవులు

తండ్రి కొడుకుల మధ్య ఉండే అనుబంధాలను మానవులు అనే కథ ఆవిష్కరిస్తుంది. తన భార్య చనిపోయిన నందనరావు, తన కొడుకు కృష్ణుడినీ, తల్లీ లేని లోటు తెలియకుండా పెంచడం ఈ కథలోని ప్రధానాంశం. ఇంట్లో కొడుకును దగ్గరగా కూర్చోబెట్టుకొని భవిష్యత్ను వివరిస్తూ బుజ్జగించి చదువు చెప్పడం నేటి తరం తల్లితండ్రులకు అనుసరణీయం.

నందనరావుది పెద్ద వయసేమీ కాదు. తన కొడుకు కృష్ణుడికి ఇబ్బందులు ఎదురవుతాయోమోనని తాను మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం ఒక రకంగా త్యాగమనే చెప్పాలి.

నందరావు కొడుకు కోసమే బతుకుతుండడం కుటుంబ సంబంధాల గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఆ కుటుంబంలో కృష్ణుడు ఏదైనా అడగడం, ఆ కోరిక కాదనకుండా తీర్చడం ఆ తండ్రి ప్రేమకు నిదర్శనం. కృష్ణుడి పెద్ద చదువుల కోసం తండ్రి తన భూమిని అమ్మడం కుటుంబంలోని ప్రేమానుబంధాలను తెలియజేస్తుంది. కృష్ణుడు మెడిసిన్ పాసయినా ఆ తండ్రికి చిన్న పిల్లవాడే. దీపావళి పండుగ రోజున నందరావు తన కొడుక్కి తలంటి స్నానం చేయించడం పితృ

ప్రేమకు తార్కాణం. కృష్ణుడు మెడిసి ఇంకా ఉన్నత స్థాయికి చేరుకోవాలని, విదేశాలకు వెళ్లి గొప్ప డాక్టర్ గా తిరిగి రావాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఆరాటపడుతున్న నందన్ రావు లాంటి తండ్రి తమకూ ఉంటే బాగుంటుందని ప్రతి విద్యార్థి కోరుకునే విధంగా ఆ పాత్రను తీర్చిదిద్దారు రచయిత్రి. ఏ రోజైనా తన కొడుకు ఇంటికి రావడం ఆలస్యమైతే ఆందోళన పడిపోయే తండ్రి పాత్ర నందరావుది. చనిపోయిన తన భార్య స్థానాన్ని కొడుకు విషయంలో భర్తీ చేసిన తండ్రి పాత్ర ఈ కథలో అందరికి ఆదర్శప్రాయం. థిత

ఈ కథలో కుటుంబ సంబంధాలతో పాటు నూతనత్వం, ఆదర్శం కూడా కనిపిస్తాయి. శ్రీనివాస్, పద్మ దంపతులు. ఒకానొక రోజు ఉదయం సినిమాకు వెళ్లాలనుకున్నారు. అంతలో ఇంటికి చుట్టాలు వచ్చారు. వాళ్లు వెళ్లిపోయే వరకు ఆగి సెకండ్ షోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇంట్లో పెద్దలు రోజులు బాగోలేవు జాగ్రత్తగా వెళ్లిరమ్మన్నారు.

మధ్య మధ్యలో కరెంటు పోవడంతో సినిమా అయిపోయే సరికి ఒంటి గంట అయింది. బయటికి వస్తే వర్షం. ఆటో ఎక్కక తప్పలేదు. ఆటోవాడు వేరే దారిలో తీసుకువెళ్తూ వాళ్లడిగితే దగ్గరి దారి అని నమ్మించాడు. కొంత దూరం పోయాక ఆటో ఆగిపోయింది. ఏమయిందోనని ఆటోడ్రైవర్ చూస్తున్నాడు. పావుగంట దాటినా ఆటో బాగవలేదు. శ్రీనివాస్ విసుగ్గా కిందికి దిగాడు. అదే అదునుగా

భావించి డ్రైవర్ ఆటో స్టార్ట్ చేసి పద్మను ఎత్తుకుపోయాడు. శ్రీనివాస్ ఆటో వెంట పరిగెత్తాడు. అప్పటికే ఆటో చాలా దూరం వెళ్లిపోవడంతో తన భార్య పద్మను తలుచుకొని కుమిలిపోయాడు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లి రిపోర్టు ఇచ్చాడు. పద్మనే తలచుకుంటూ ఆ అర్ధరాత్రి ఇంటికి ఎలా వెళ్లాడో తెలియదు.

ఇంట్లో అందరికి విషయం తెలియడం, అందరు విపరీతంగా బాధ పడడం కుటుంబ సంబంధాలకు, బాంధవ్యాలకు, వారి మధ్యవున్న అనుబంధాలకు సంకేతం. శ్రీనివాస్ అయితే పద్మనే తలచుకుంటూ నిశ్చేష్టుడయిపోయాడు.

అటు పోలీసులు, ఇటు కుటుంబ సభ్యులు పద్మ గురించి వెతుకుతున్నారు. పద్మను వెతుక్కుంటూ సైకిల్ మీద బయలుదేరిన శ్రీనివాస్ కు దారిలో ఎదురైన పోలీసు జీపులో పద్మ కనిపించడంతో జీపును ఆపమన్నట్టుగా చేయి చూపించాడు. పద్మ దొరికిందన్న ఆనందంలో సైకిల్ వదిలేసి గబాలున జీపు ఎక్కి పద్మను కౌగిలించుకున్నాడు. చుట్టు పోలీసులు ఉన్నారన్న విషయాన్ని కూడా మరిచిపోవడం వారిద్దరి మధ్య ఉన్న అనుబంధానికి నిదర్శనం.

పద్మ వాలకం చూసి విస్తుపోయాడు శ్రీనివాస్. చెదిరిపోయిన జుత్తు, చితికిపోయిన పెదవినుండి కారుతున్న రక్తం, చిరిగిపోయిన జాకెట్టు చూస్తే పద్మకు ఏం జరిగిందో అర్థమైపోయింది. అయినా తాను పద్మను కావాలనుకోవడం, కాపాడుకోవాలనుకొని ఆసుపత్రికి తీసుకు వెళ్లడం అతనిలోని

ప్రేమకు తార్కాణం. పద్మ కోలుకునే వరకు ఆమెను అంటి పెట్టుకొని ఉండి

సేవలందించిన శ్రీనివాస్ భర్తగా తన బాధ్యతను నిర్వర్తించడం కుటుంబ సంబంధాలను ఎంతో ఎత్తుకు తీసుకువెళ్లాయి. నవతరం ఆలోచనలు, ఆదర్శాలు, అనుబంధాలు, కుటుంబ సంబంధాలు ఈ కథలో చక్కగా పొందుపరిచారు. సంఘటన జరిగిన తర్వాత స్పందించే తీరు కన్నా ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని నవతరానికి సందేశమిచ్చారు రచయిత్రి. అన్నపూర్ణ….

అన్నపూర్ణకు పెళ్లయింది. తనకు ఇంకా పిల్లలు పుట్టకముందే తల్లయింది. తన మరిది రవి, ఆడపడుచు పద్మ తనకు పిల్లలయ్యారు. అత్త, మామా చనిపోవడంతో వారికి తనే అమ్మయింది.

అన్నపూర్ణ పేరులోనే ఓ పవిత్రత ఉంది. అంత చక్కటి పేరుకు తగ్గట్టుగానే ఆ పాత్రను తీర్చిదిద్దారు. మరిది, ఆడపడుచు తనను అమ్మ అని పిలవడం అందరినీ ఆకట్టుకునే అంశం. మరిది, ఆడపడుచును తల్లిలా ఆదరించడం చాలా గొప్ప విషయం. అన్నపూర్ణ ఆ పిల్లల చదువుల విషయంలో

ఆరాటపడడం, వాళ్లను కూర్చోబెట్టి చదివించడం, భర్తకు,

పిల్లలకు పెట్టిన తర్వాతే తను తినడం, అన్ని విషయాల్లో కూడా అన్నపూర్ణ ప్రవర్తన కుటుంబ సంబంధాల గొప్పతనాన్ని తెలియజేస్తాయి.

బడికి వెళ్తున్న పిల్లలకు టిఫిన్లు, భోజనాలు ఏర్పాటు చేయడం, సమయానికి వాళ్లను తయారు చేసి బడికి పంపడం, వాళ్ల బట్టలు ఉతకడం ఇలా తల్లికన్నా మిన్నగా సేవలందించడం అన్నపూర్ణ లాంటి అమ్మకే సాధ్యం.

పిల్లలు కూడా అమ్మకు ఏ ఇబ్బంది – కలగకూడదని, తమ కోసం అమ్మను కష్టపెట్టకూడదని ఆలోచించడం పాఠకుల హృదయాలను కదిలిస్తుంది. అన్నపూర్ణ భర్త మోహన్ తన తమ్ముడిని, చెల్లెలిని అమ్మలా చూసుకుంటున్నందుకు ఆమెను అభినందించడం కూడా కుటుంబ సంబంధాల్లో నిజాయితీని వ్యక్తం చేస్తుంది.

కాలక్రమంలో అన్నపూర్ణ తల్లయింది. కవల పిల్లలను ప్రసవించింది. అయినప్పటికి భర్త తమ్ముడిని, చెల్లెలిని తన పిల్లలుగా చూసుకునే అన్నపూర్ణ పాత్ర ఎంతో ఎత్తుకు ఎదిగిపోయింది. ఇలా జీవన గమనంలో అన్ని ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కుంటూ కుటుంబ బాంధవ్యాల కోసం ఎన్నో త్యాగాలు చేసిన అన్నపూర్ణ పాత్ర చరిత్రలో నిలిచిపోతుంది. శాంతినిలయం…

దుర్గ, కైలాసనాథ్ ది పెద్ద కుటుంబం. ఒక రకంగా ఉమ్మడి కుటుంబమనే చెప్పాలి. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగై ఎవరికి వారే జీవనం సాగిస్తున్న ఈ రోజుల్లో వీరి కుటుంబం ఎందరికో ఆదర్శప్రాయం. దుర్గ, కైలాస్ నాకు ఐదుగురు కొడుకులు, నలుగురు కూతుళ్లు. ఇద్దరబ్బాయిలకు పెళ్లిళ్లు అయి ఇద్దరు కోడళ్లు వచ్చారు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్లు కావడంతో ఇద్దరు అల్లుళ్లు వచ్చారు. మనవలు, మనవరాళ్లతో అందరు ఒకే ఇంట్లో ఉండడం ఈ తరం వారికి మార్గదర్శకంగా చెప్పుకోవచ్చు. ఎవరి గదుల్లో వారు ఉంటారు. కాని వంట మాత్రం ఒక్కచోటే. ఖర్చులు పంచుకునే విధానం, పని విభజన, బంధువులు వస్తే చూసుకోవడం ఇలాంటి అన్ని విషయాల్లో వివాదాలకు, విమర్శలకు తావులేకుండా నడుస్తున్న ఈ కుటుంబాన్ని చూసి చాలామంది నేర్చుకోవలసిందే. ఆ ఇంటి పేరు శాంతినిలయం. కథ పేరు కూడా శాంతి నిలయం. ఈ కథకు ఈ పేరు చక్కగా సరిపోయింది.

ఆ కుటుంబంనుండి దుర్గ, కైలాస్ నార్లు తిరుపతి వెళ్లాలనుకున్నారు. వాళ్లతో పాటు ఓ కూతురు, మనవరాలు కూడా వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఇంటి బాధ్యతలు, వంట పనులు, చుట్టాలొస్తే ఎలా అనే విషయాల్లో పరిపరి విధాలుగా ఆలోచించారు. ఇంట్లో ఉన్న మిగతావారు బాధ్యత తీసుకుంటామని చెప్పడం, కుటుంబంలో సమస్యలేమి ఉండవని భావించిన తర్వాతే వారు తిరుపతికి బయలుదేరారు. ఇది కుటుంబ సంబంధాల విలువలను ఆవిష్కరిస్తుంది.

ఎన్ని సమస్యలొచ్చినా కుటుంబ సంబంధాలే వాటికి పరిష్కారమని చెప్పిన ఈ కథ అందరికి దారి చూపిస్తుంది. ఇజాజత్ హై…

భర్తను వదిలి పెట్టి వెళ్లిన విజయ తన నిర్ణయం సరైంది కాదని తెలుసుకొని తిరిగి భర్త దగ్గరకు వచ్చింది. ఎప్పటికైనా, ఎప్పుడైనా కుటుంబ సంబంధాలే శాశ్వతమని గ్రహించడం ఈ కథలో

ప్రధానాంశం. కుటుంబ సంబంధాల థిKBOUT యు తన అమ్ము చెప్పిన ఉపదేశాలు తనకు ఎంతగానో ఉపకరించాయి. మగవాడి బలం, బలహీనతలు వివరించింది విజయకు వాళ్ల అమ్మ. కుటుంబ బంధాలు తెగిపోకుండా ఉండాలంటే ఎలా ప్రవర్తించాలో, ఎలా మసలుకోవాలో విజయకు నేర్పించింది వాళ్ల అమ్మ. భర్త ఎలాంటి వాడైనా అతనితో ఎలా ఉండాలో విజయకు తన తల్లి ద్వారా అర్థం అయింది. అందుకే తిరిగి భర్త దగ్గరికి వచ్చింది. భర్తకు అనుగుణంగా ప్రవర్తించింది. తన జీవితం సుఖంగా సాగిపోయింది. ఇది కుటుంబ సంబంధాల గురించి విభిన్నంగా వివరించిన కథ.

కమ్ లీ…

కమల, శాంతి బాబు దంపతులు. భార్య భర్తల మధ్య ఉన్న అనుబంధాలకు ఈ కథ అద్దం పడుతుంది. వారికి బాబు పుట్టిన తర్వాత దాంపత్య జీవితంలో జరిగే సన్నివేశాలను చక్కగా చిత్రించారు. బాబును సవరించుకుంటూనే భర్తకు

సంబంధించిన పనులు చేస్తుంది కమల. బాబు పుట్టిన తర్వాత కూడా వారిద్దరి మధ్య ఏ మాత్రం ప్రేమానురాగాలు తగ్గకపోవడం, సినిమాలు, షికార్లు చేస్తూ సరదాగా జీవనం గడపడం ఈ కథలో ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు.

బాబు పుట్టినప్పటినుండి కమల తనను సరిగ్గా పట్టించుకోవడం లేదని భర్త

భావించడం, బాధ పడడం సహజంగా ఉంది. ఈ కథలోనే కాదు దాదాపుగా అన్ని కుటుంబాల్లో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి సహజ సన్నివేశాలను అందించడం పాఠకులను రంజింపజేస్తుంది. భర్తను ఆనంద పరచడం కోసం బాబును తన తల్లి దగ్గర వదిలి పెట్టి రావడం అనేది భార్య చేసిన త్యాగంగానే చెప్పుకోవచ్చు. భర్త ఆఫీసు పనిలోనే లీనమవడం, భార్య కొడుకు ఆలనా పాలనలోనే గడపడం ఎంత సహజమో ఈ కథలో వివిరించారు.

మేఘనా

ఈ కథ మేఘనా, అమిత్ మధ్య నడుస్తుంది. వారి ప్రేమానుబంధాలు, కటుంబ సంబంధాలను ఈ కథ ఆవిష్కరిస్తుంది. మేఘన వృద్ధాప్యంలో ఉన్న తన తల్లి తండ్రులను ప్రేమగా చూసుకోవడం కుటుంబ సంబంధాల ప్రాధాన్యతను తేటతెల్లం చేస్తుంది. తన గురించే కాదు.తన బంధు వర్గాల గురించి కూడా పట్టించుకోవడం మేఘనా వ్యక్తిత్వం. మేఘనా అమిత్ గురించి చాలా తపన పడుతుంది. అమిత్ కూడా మేఘనా లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండలేక పోవడం ఈ కథలో ప్రత్యేకత. మేఘనా ఉద్యోగం వదిలేసి తనతోనే ఉండిపోవాలని అమిత్ కోరుకోవడం కుటుంబ సంబంధాలను తెలియజేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com