హైదరాబాదు అనేది చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన అంతర్జాతీయ నగరం. దీని చారిత్రక క్రమము 400 ఏండ్ల కిందటనే మొదలైందనడానికి అనేక ఆధారాలున్నవి. లండన్, పారిస్, న్యూయార్క్, జర్మనీలోని బెర్లిన్ నగరాలతో సమానమైన చరిత్ర ఈ హైదరాబాదు మహానగరానిది. శతాబ్దాల తరబడి స్వతంత్ర రాజ్యంగా హైదరాబాదు స్టేట్ పరిఢవిల్లింది. అంతర్జాతీయ నగరాల్లో ఎలాంటి పరిణామాలు జరిగినా దాని ప్రతిఫలనం హైదరాబాదులో కనిపించేది. నాలుగు వందల ఏండ్ల నుంచి పారిశ్రామిక విప్లవం తరువాత వరకు కూడా కులీకుతుబ్ షాల గోల్కొండ సామ్రాజ్యం, హైదరాబాద్ స్టేట్ అనేది అంతర్జాతీయంగా సంబంధాలు కలిగి ఉన్నది. వ్యాపార కేంద్రమేగాక, ఉత్పత్తి కేంద్రం కూడా. అట్లా హైదరాబాద్ అనేది అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతలు గడించి ప్రాధాన్యతను సంతరించుకుని ఉన్నది.

మొదట 1830లో ఫొటో కెమెరాను కనుగొంటే 1840 నాటికే హైదరాబాదుకు కెమెరా వచ్చేసింది. ఈ పరిణామాలతో ప్రపంచ ప్రఖ్యాత ఫొటోగ్రాఫర్‌ హైదరాబాద్ ప్రపంచానికి అందించింది. అతనే దీనదయాల్ (1844-1905). ఈ వెంటనే 1895 సినిమా కెమెరా ఆవిష్కారమైతే, హైదరాబాదులో ఏడాదిలోపునే కాలుమోపింది. అట్లా హైదరాబాద్ శాస్త్ర, సాంకేతికంగా ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూ ఎదిగింది. మన హైదరాబాదు స్టేట్ అప్పట్లో ఫోర్ట్ కారు మార్కెట్లోకి రాగానే నాటి భారతదేశంలో కెల్లా మొదటి కారు కొన్నది నిజాం నవాబు. 1910 లో రైట్ బ్రదర్స్ విమానం కనుగొనగానే, 1920 కల్లా హైదరాబాదులో విమానాశ్రయం ఏర్పాటైంది. నాటి హైదరాబాద్ స్టేట్లో కొల్లాపూర్, మన్ననూర్ వంటి 7 ప్రాంతాల్లోనూ ఎయిర్ పోర్టులు రూపొందినవి.

ఈ పరిణామాల నేపథ్యంలోనే హైదరాబాదు పారశీ థియేటర్, హిందుస్థానీ సంగీతాలకు, భిన్న సంస్కృతులకు కేంద్రమైంది. 1857 తరువాత ఢిల్లీ బ్రిటీష్ వారి చేతుల్లోకి వెళ్లిన సమయంలో భారతీయ కళాకారులకు ఒక ప్రత్యేక కేంద్రమంటూ లేకుండా పోయింది. అటువంటి సమయంలో బ్రిటీష్ ఇండియాలోని అన్ని ప్రాంతాల కళాకారుల దృష్టి హైదరాబాద్ వైపు మళ్లింది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాదు రాజ్యమనేది చాలా శక్తివంతమైన ప్రాంతం. అట్లాంటి పరిస్థితుల్లో హిందుస్తానీ సంగీతానికి హైదరాబాద్ కేంద్రంగా మారింది.. అలా సంగీత కళాకారులందరూ హైదరాబాదును తమ కళా ప్రతిభకు వేదికగా చేసుకున్నారు. అప్పటికే ఉర్దూ కవిపండితులకు హైదరాబాదు ఆలవాలమై ఉన్నది.

ఇలాంటి తరుణంలో ఉస్తాద్ కరీంఖాన్, ఉస్తాద్ అల్లా ఉద్దీన్, రతన్సన్ వంటి అన్ని ఘరానా సంప్రదాయాలకు చెందిన విద్వాంసులు హైదరాబాదు వైపు దృష్టి సారించారు. అందువల్ల హైదరాబాదుకు ప్రత్యేకంగా సంగీత ఘరానా అంటూ ఏర్పడలేదు. కానీ ఎందరో ఉద్దండులైన హిందూస్తానీ సంగీత కారులను ఆదరించి జాతికి అందించింది. కర్ణాటక సంగీతం కూడా జటప్రోలు, గద్వాల వంటి సంస్థానాలు, కర్ణాటక ప్రాంతాలలో పరిమితంగా ఆదరణకు గురైంది. కాలక్రమంలో నాటి నిజాం ప్రభుత్వం ఏకంగా కళాపోషణకు ఒక డిపార్ట్ మెంట్ నే ఏర్పాటు చేసింది.

హైదరాబాదులో సంగీత, నాటక, సాహిత్య రంగాలకు సంబంధించి తొలినాళ్లలో జరిగిన పరిణామ వికాసాలను ఇంకాస లోతుగా వెళ్లి అధ్యయనం చేస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తాయి. మొగల్ చక్రవరుల శకం భారతదేశంలో పతనమైన తరువాత పెద్దసంఖ్యలో శాస్త్రీయ సంగీతకారులు ఢిల్లీని విడిచి వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారు. వీరిలో లకో. ఆగ్రా, బరోడా, అలహాబాద్, గ్వాల చూర్ ప్రాంతాలలోని సంగీతకారులు హైదరాబాదు స్టేట్ వైపు తమ సంగీత యాత్రను ప్రారంభించారు. వీరిని కవులూ, ఇతర ఆస్థాన నర్తకీ నర్తకులు అనుసరించి తమ మనుగడను హైదరాబాదులో కొనసాగించాలనుకున్నారు. 1800-1920 మధ్యకాలంలో సాంస్కృతిక, కళారంగంలో హైదరాబాదు ‘

స్టేట్లో కొత్త శకం ఏర్పడినట్లైంది. ఆ రోజుల్లో హైదరాబాదు ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ ఎలుబడిలో ఉంది. ఆయన మూడేళ్ల వయసులో 1869లో రాజ కిరీటాన్ని ధరించారు. మీర్జాగాలిబ్ మనవడైన నవాబ్ సర్వర్-ఉల్-ముల్క్ ధిల్లి నుండి వచ్చి నవాబుకు రాజ భవంతుల నడుమనే విద్యాభ్యాసం చేయించేవాడు. అరబిక్, ఉర్దూ భాషలను ఈయన వద్దనే నేర్చుకున్నారు ఆరవ నిజాం. ఈ నవాబు సర్వర్-ఉల్-ముల్ ను | ఆ తరువాత తన ప్రైవేటు సెక్రటరీగా నియమించుకున్నారు. నిజాం కెప్టెన్ క్లార్క్ వద్ద ఇంగ్లీషు ట్యూషన్ చెప్పించుకున్నారాయన. తదనంతరం అప్పటి వరకూ అధికార భాషగా ఉన్న పర్షియన్ స్థానంలో ఉర్దూను ప్రవేశపెట్టారు నిజాం. తన దర్బారులో కచేరీ చేసిన సంగీత విద్వాంసులకు పెద్దమొత్తంలో నజరానాలు ముట్టజెప్పినాడు.

ఆ రోజుల్లో నిజాం దర్బారులో దేశమంతటా పేరు ప్రఖ్యాతులున్న సంగీత విద్వాంసులు కచేరీలు చేసేవారు. వారిలో ఇనాయత్ ఖాన్ చౌమహల్లా పాలేలో కచేరీలు చేసేవారు. బరోడా నుండి వచ్చిన ఈయన గొప్ప గాత్ర సంగీత విద్వాంసుడే గాక వీణావాదకులు కూడా. పలుగాత్ర వీణా కచేరీలు చేసిన ఇనాయత్ ఖాన్ నిజాం ప్రభువు చేత “తాన్ సేన్ ఆఫ్ హైదరాబాద్” అనే బిరుదంతో సత్కరించారు.

కలకత్తాకు చెందిన విక్టర్ కంపెనీ వారు వెలువరించిన ఇనాయత్ ఖాన్ రికార్డులు నిజాం కలెక్షన్స్ లో ఉండేవి. ఇనాయత్ ఖాన్ ఫొటోలు సంగీత ప్రియుల ఇండ్లలో ప్రేముల్లో స్థిరపడిపోయేంత గొప్పగా హైదరబాదు ఆయనను గుండెల్లో దాచుకున్నది. ఆయన రెండేళ్లు హైదరాబాదులో తన సంగీత ప్రభావాన్ని వెలిగింపజేశారు.

ఇనాయత్ ఖాన్ తరువాత హైదరబాదు సంస్థానంలో సంగీత కచేరులు చేసిన వారు పండిట్ మోతీరామ్. ఈయన నిజాం ప్రశంసా పురస్కారం గెలుచుకున్నారు. మేవాడ్ ఘరానాకు చెందిన మోతీరామ్ చాలా ఏండ్లు హైదరాబాదులో నివాసమున్నారు. మోతీరామ్.. హజరత్ అలీని కీర్తిస్తూ పాడుతుంటే సింహాసనం మీద కూర్చున్న నిజాం గౌరవ సూచకంగా దిగి నేలపై కూర్చునేవాడు. హసన్ – హూస్సేన్ల పేరు వినగానే భక్తితో ఆయన నేలదిగేవారు. మోతీరామ్ చిన్న కొడుకే హిందుస్థానీ విద్వాంసుడు పండిత్ జరాజ్. 1999లో పద్మవిభూషణ్ పొందారు ఈయన.

ఉత్తర భారతంలో రాంపూర్ దర్బార్ కవిగా ప్రసిద్ధి గాంచిన దాగ్ దెహల్వీ అక్కడ తన పదవీకాలం ముగిసిపోగానే 1891లో హైదరాబాదు చేరుకున్నాడు. ఈయన స్వయంగా పాడక పోయిన గొప్ప సంగీత ప్రేమికుడు. విచిత్రమేమిటంటే హైదరాబాదు వచ్చాక పదేళ్ల వరకు దెహల్వీకి నిజాం ప్రభువు దర్శనం లభించలేదు. తీరా 1901లో నిజాం దర్బారులో ప్రవేశం లభించాక తన సాండిత్యాన్ని ప్రదర్శించి ఈ అవకాశం కొరకు పదేళ్ల పాటు ఎదురు చూడాల్సి వచ్చిందని చెప్పగానే ఆరవ నిజాం గడచిన పదేళ్లలో ఆయన ఖర్చు చేసిన భత్యానికి లెక్కగట్టి బకాయిలను తక్షణమే చెల్లించేలా ఆదేశాలిచ్చారు. ఆ రోజుల్లో కాగితపు కరెన్సీ లేదు. చెలామణిలో ఉన్న వెండి నాణేలను మూటగట్టి ఎండ్ల బండిలో వేసుకుని ఇంటిలో ముట్టజెప్పారు. దీంతో దేహల్వీ తన శేష జీవితం ఏ చింతా లేకుండా గడిపారు.

“అజబ్ అప్పా హాల్ ఘోతాహై బో విషాల్-ఎ-యారాతా దిగయా తుమ్ నే లియా హమ్ క్యాక” దెహల్వీ గజళలో మచ్చుకు ఒకటి.

ఈ దెహల్వీనే తన మిత్రుడు “అమీర్ మినై”ని హైదరాబాదుకు పిలిపించి చాలా గజళ్లను రాయించగా, వాటిని ఎందరో ఆనాటి విద్వాంసులు గానం చేశారు. వారిలో ఒకరు కె.ఎల్. సైగల్. విశాదమేమిటంటే ఈయన హఠాన్మరణం చెందడం.

ఇవన్నీ ఇలా ఉండగా 1920ల నాటికి ఉత్తర భారతదేశం నుండి సిద్ధ కళావంతుల బృందం ఒకటి హైదరాబాదు వచ్చి చార్మినార్ పరిసర ప్రాంతాల్లో నివాసమేర్పరచుకున్నారు. వీరిలో బేకన్ జాన్, బన్నీజాన్, కాలీజాన్ అనే దర్బారు నృత్యకారిణిలు ఆ రోజుల్లో హైదరాబాదు నగరంలో పెద్ద పేరు పొందినవారు. కాలీజాన్ కూతురు మెహమ్మదీ చేసే ముజ్రాలకు జనం ఎగబడి వచ్చేవారు. ఆమె అందాన్ని క్షణమాత్రం చూస్తే చాలనేవారు. కాలేజాస్ కూడా గొప్ప విద్వాంసురాలు. ఘజల్, టుమ్రి, దాద్రాలు పాడటంలో ఆమెను మించిన వారు లేరు. పెళ్లిళ్లు, విందులు, వినోదాల్లో ఆమె చేసిన కచేరీలకు భారీ మొత్తంలో పారితోషికాలు ముట్టేవి. మెహమ్మదీ అందం, గానం రెండూ హైదరాబాదీలను ఓలలాడించినవి.

మరొక ఆసక్తికరమైన విషయమేమిటంటే దేశంలో ఎక్కడా లేని విధంగా “ఖదాముజ్రా” ప్రదర్శనలు హైదరాబాదులో జరిగినవి. సాధారణంగా ముజ్రా ప్రదర్శనలు భవంతుల్లో నాలుగు గోడల నడుమ జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా వీధుల్లో పెళ్లి ఊరేగింపుల్లో నిలబడి ముజ్రా గీతాలాపన చేస్తే ప్రదర్శనలు నగరం నడి వీధుల్లో జరిగినవి. ఈ విషయం నాటి చరిత్ర పుస్తకాలలో కూడా ప్రస్తావించారు. పెద్ద సైజు చెక్కబల్లాను వీధి వడును ఉంచి ఊరేగింపు ముందులో ముబ్రా ప్రదర్శనలిచ్చేవారు. ఈ ప్రక్రియ హైదరాబాదులోనే

మొదటిసారిగా మొదలైంది. ఇలాంటి ప్రదర్శనలిచ్చిన వారిలో కాలీజాన్, మొహమ్మదీలున్నారు. వీరినంతా ఆ రోజుల్లో తవాయిస్, నాగర్స్ గా పిలిచేవారు.

మహారాజా చందూలాల్ ప్రధానిగా ఉన్న 1829-1857 మధ్యకాలంలో అధిక సంఖ్యలో కళావంతుల కుటుంబాలు రాజస్థాన్ నుండి తరలివచ్చి ఆ తరువాత “చందులాల్ లా”గా పేరొందిన ప్రాంతంలో సిరపడారు. ఇది చార్మినారకు ఐదు కిలో మీటర్ల దూరంలో ఉంది. మహారాజా చందూలాల్ కూడా ఇదే ప్రాంతంలో నివసించేవారు. ఈ కళావంతులంతా సంగీత, నాట్యాల్లో నిష్ణాతులై ఉండేవారు. వీరిలో ఎక్కువగా హిందువులే ఉండేవారు. వీరి సంగీత నృత్యాలన్నీ జానపదాల ఆధారితమై ఉండేవి. వీరంతా హిందూ సంప్రదాయ పద్ధతిలో భజన్స్, కీర్తనలు పలు ఉత్సవాల్లో పాడేవారు. శ్రీరామనవమి, రాఖీపండుగ, వినాయక చవితి, దసరా నవరాత్రుల్లో వీరి నృత్యగానాలను ప్రదర్శించేవారు. ఈ కళావంతులు అలనాటి హెలీ పండుగ సందరాల్లో కూడా పాల్గొని, పాడుతూ, నాట్యం చేస్తూ రంగులు జల్లుకునే వారు. ఈ సందర్భంగా రాజస్థానీకి చెందిన

“హెలీకె దిన్ హెలీ ఆయీరే జరా బాజే బాంసూరీ మత్ మారో పిచికారీ

నాచే నందలాలా” పాట, “హెలీ ఆయీరే కన్హయ్యా హెలీ ఆయీరే” మరోపాటను హెలీ సందర్భంగా ఏర్పాటు చేసే కార్యక్రమాలలో, విందుల్లో వీరంతా పాడుతూ నాట్యం చేసేవారు. అంతేగాక బ్రిటీష్ ఆర్మీ క్యాంపుల్లో ఉన్నతాధికారులు వచ్చినపుడు వారి నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసే వినోద కార్యక్రమాల్లో వీరే ప్రత్యేక ఆకర్షణ.

“కేసరియాబాలమ్ పధారో హమారో దేశ్” అంటూ పాడే వీరిపాట చాలా మంది బ్రిటీషర్లను విశేషంగా ఆకట్టుకునేది. ఇందుకుగాను వీరికి అధికమొత్తం ధనం ముట్టేది.

ఈ క్రమంలో మహారాజా కిషన్ పెర్హాద్ హైదరాబాదు ప్రధానిగా పని చేసిన (1902-1912, 1926-1937) కాలంలోనూ కళారంగాలకు ఎనలేని ప్రాధాన్యత, ప్రోత్సాహం లభించింది. ఆయన స్వతహాగా సంగీత, నాట్యాలను అభిరుచి గలవారు. ఉర్దూ పర్షియన్, ఇంగ్లీషు, హిందీ భాషల్లో గొప్ప పండితుడు. ఎన్నో పుస్తకాలు రాసిన స్కాలర్. ఆయన నిజాం కుటుంబాల్లో జరిగే “ సారా”(బర్త్ డే) లకు, పండుగలకు, అధికారిక పార్టీలకు, వ్యక్తిగత బంధువుల కోసం ఈ నృత్యబృందాలను రప్పించి సాంస్కృతిక కార్యక్రమాలిప్పించేవారు. మహారాజా చందూలాల్ షా, కిషన్ పెరాడు కృష్ణ భక్తులు కావడంతో కృష్ణాష్టమి సందర్భంగా ఏర్పాటుచేసే వేడుకల్లో ఈ కళావంతుల ఆట పాటలే పెద్ద ఆకర్షణ. కిషన్ పెర్హాద్ కృష్ణ భక్తుడిగా కృష్ణుడిపై రాసిన భజన్లను “ప్రేమ్ దర్పణ్” పుస్తకంగా అచ్చువేశారు. ఈ కవితల్లో కొన్నింటికి ఎం.ఎ. రవూఫ్ అనే ప్రసిద్ధ ఘజల్ గాయకుడు వాటికి ట్యూన్లు కట్టి స్వరపరిచారు. ఈయన హైదరాబాదు లోని దక్కన్ రేడియోకు స్టేషన్ డైరెక్టర్‌గా ఉండేవారు. కిషన్ పెర్హాద్ ఈ కళావంతుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి దాన్ని తన ఆధీనంలో ఉంచుకుని వారి బాగోగులకు సరిపడ ధనాన్ని అందజేసేవారు. దీని వల్ల ఆ రోజుల్లో ఈ కుటుంబాలు హైదరాబాదులో మనగలిగినవి. ఆ తరువాత కాలంలో బేలా ప్రాంతం నుండి వీరంతా తరలివెళ్లి నాగులచింతలో స్థిరపడిపోయారు. ఇక్కడి నుండే హైదరాబాదు నుండి బొంబాయి వెళ్లి మూకిల్లో నటించిన తొలినటి రాంప్యారీ వెలుగులోకి వచ్చింది.

హైదరాబాదు కవులు, కళాకారులకు, కళావంతులకు ఆలంబనగా నిలుస్తున్న సంగతి ఆ రోజుల్లో భారతదేశమంతటా మారుమోగిపోయింది. దాంతో లక్నో, ఆగ్రా, మీరట్ వంటి ప్రాంతాల నుండి చాలా మంది హైదరాబాదుకు తరలివచ్చి చార్మినార్ సమీపంలోని మొఘల్‌పూర్‌లో స్థిరపడ్డారు. వీరంతా గోల్ బంగ్లాలో ప్రదర్శనలిచ్చేవారు. ఈ బృందాల్లో వారికి స్వంత మ్యూజికల్ ట్రూన్లు ఉండేవి. హార్మోనియం, సారంగి, తబలా వాదకులుండేవారు. వీరంతా నిష్ణాతులైన విద్వాంసులు. వీరు కంపోజ్ చేసిన ఘజు డాన్సరు నృత్యం చేసేవారు. సాయంత్రాల్లో గోల్ బంగ్లాకు దారితీసే వీధులన్నీ రకరకాల పూల అంగళ్లు, అత్తరు దుకాణాలతో నిండిపోయినవి.

ఈ గోల్ బంగ్లాలో ప్రదర్శనలిచ్చిన తవాయిస్టు, నాగర్స్ (నాట్యకత్తెలు)లో ఫిరోజ్ జాన్, దుర్గానా అనే ఇద్దరిని ప్రధానంగా చెప్పుకోవాలి. ఆ రోజాన్ లక్నో నుండి వస్తే, దుర్జానా ఇరాన్ నుండి వచ్చింది. దుర్జానా అరుదైన అందగత్తె. గొప్పగాయని. ముజ్రా నృత్యం | ఆమెదొక విభన్నశైలి. నిజాం నవాబులు, ఉన్నతాధికారులు ఆమె ముజ్రాలకు హాజరయ్యేవారు.

మరొక తవాయిఫ్ నా గర్ల్ గోరాజాన్ గురించి ప్రత్యేకంగా పేర్కొనాలి. బెనారస్ నుండి వచ్చిన గోరాజాన్ రెండేళ్లపాటు నగరంలో గడిపింది. ఒకానొక ముజ్రా కార్యక్రమంలో ఒక ఆర్మీ అధికారి ఆమె అందాన్ని చూసి బలవంతంగా ఈడ్చుకెళ్లే ప్రయత్నం చేసాడు. అప్పుడు గోరాజాన్ అరచి గోల చేసి ప్రతిఘటించింది. కానీ ఆ అధికారి తన పిస్టల్ తీసి కాల్చడంతో ఆమె భుజంపై గాయాలైనవి. ఈ సంఘటన

తరువాత కొద్ది కాలానికే హైదరాబాదు విడిచి ఉత్తరభారతం వెళ్ళిపోయింది. అయితే ఆమె పాడిన “ఇలోగోనే చీనీరే దుపట్టామెరా ఘజల్ మాత్రం హైదరాబాదీలను చాలా కాలం వెంటాడుతూనే ఉండి పోయింది.

నిజాం ప్రభువు పుట్టిన రోజు సంబరాలు హైదరాబాదులో ఘనంగా జరిగేవి. కాగా ఆయన 33వ పుట్టిన రోజు పండుగ సంబరాలు చాలా భారీ ఎత్తున మూడురోజుల పాటు నభూతో నభవిష్యతి అన్న విధంగా జరిగినవి. ఈ సంగతులన్నీ గులాం సందానీ ఖాన్ గోహర్ తన “తుజు-ఎ-మహబూబియా” అనే గ్రంధంలో ప్రస్తావించారు. ఆ మూడు రోజులు పబ్లిక్ గార్డెన్స్ లో సంగీత నృత్య వినోద కార్యక్రమాలు జరిపారు. ఖవాలీలు, తవాయిస్, నాగర్స్ నృత్యాలు ప్రత్యేక ఆకరణగా నిలిచిపోయినవి.

ఇట్లా నా గర్ల్స్, నౌటకీలు (జానపద నాటకాలు), ముజ్రాలు, మూన్ పారశీ నాటకాలు, సకల ఘరానాలకు నెలవైన హైదరాబాదీ హిందూస్తానీ సంగీత వైభవం, ఉర్దూ ఘజల్లు, ముజ్రాలు, సాహిత్య, నాటక సౌరభాలు, సినిమా థియేటరైన నాటకశాలలు వెరశి మనదైన శతాబ్దాల కళా ప్రాభవం. దశాబ్దాల నిర్లక్ష్యపు చెదల వల్మీకం లోంచి బయల్పడి నేడు నూతన తెలంగాణ సాంస్కృతిక చరిత్ర నిర్మాణానికి వెలుగు దారులు తెరుచుకున్నవి.

1800 శతాబ్దం మొదటి సగంలో హైదరాబాదులో “నౌటంకీ’లు మొదలైనవి. ‘నౌటంకీ’లంటే ‘జానపద నాటకాలు , ఇవి మధ్యతరగతి, పేదప్రజలు, గ్రామీణ ప్రాంతాల్లో బాగా ఆదరణ పొందిన వినోదాలు. గోలకొండ పతనం తరువాత చాలా పెద్ద సంఖ్యలో సివిల్ సర్వెంట్లు, వ్యాపారస్తులు పలురకాల వృత్తిదారులు దక్షిణాదికి వచ్చి హైదరాబాదులో స్థిరపడ్డారు. వీరిలో కాయస్తులైన చాలా మంది. ఇక్కడికి వచ్చి ఉన్నతాధికారులుగా స్థిరపడ్డారు. వీరి ఆధరణ వల్లనే దక్కన్ ప్రాంతంలో నౌటంకీలు ప్రవేశించినవి. మొదట్లో రామలిలా ఉత్సవాల్లో స్థానిక ప్రముఖుల చొరవతో తాత్కాలిక వేదికను ఏర్పాటు చేసి జానపద నాటకాలు వేసేవారు. మొదట్లో ఈ నౌటంకీలలో మహిళా పాత్రలను కూడా పురుషులే వేసేవారు. దీపాల వేళకు మొదలయ్యే ఈ నౌటంకీలు అర్దరాత్రి దాటే వరకు కొనసాగేవి. కరెంటు, మైక్రోఫోన్లు లేని ఆ రోజుల్లో కళాకారులకు ఉండే ఉచ్చస్వరం వారికి వరం వంటిదిగా భావించేవారు.

ఒకానొక ‘నౌటంకీ’ బృందం ఒకటి మహారాష్ట్ర నుండి 1843లో తొలిసారిగా హైదరాబాదుకు వచ్చి గుల్బార్‌హౌజ్ దగ్గరలో విడిదిచేసి నాటకాలు వేశారు. వీరి నాటకాలన్నీ ఆ రోజుల్లో జనాదరణ పొందినవి. నాటకాలకు గుల్బార్ హౌస్ పరిసరాలు నౌటంకీలకు కేంద్రాలైనవి. ఆ తరువాత ఇక్కడే కృష్ణా ఒపేరా హౌజ్ నిర్మాణమైంది. ఇదే ఆ తరువాత 1929లో కృష్ణాటాకీస్ అయింది. 1925 ‘నౌటంకీల’ క్రమంలోనే మూనారసి థియేటర్లు హైదరాబాదుకు వచ్చి చారిత్రక, ప్రణయ గాధలను, మెరుగుపరుచుకున్న సెట్టింగులు, కాస్ట్యూములతో ఉర్దూ, హిందీల్లో నాటకాలుగా ప్రదర్శించి నగర ప్రజలకు సరికొత్త వినోదాన్ని చూపినవి. ‘సిరాజ్ ఉదోలా’, ‘జవాన్ ఎ హిందుస్తాన్’, ‘ఇమాన్ కా సౌదా’ వంటి నాటకాలు వాటిలో కొన్ని. ఈ కాలంలోనే ‘సయ్యద్ యావర్ అలీ’ అద్భుతమైన నాటకాలు రాసి ‘షేక్స్పియర్ ఆఫ్ దక్కన్’గా పేరుపొందారు. ఈయన మూనారసి థియేటర్స్ వారికి నాటకాలు రాసేవారు. ఉర్దూ ఫర్షియన్, అరబిక్ భాషల్లో ఆరితేరిన సయ్యరియార్ అలీ డైలాగులు రాయడంలో ఆయనను మించిన వారు లేరా కాలంలో, ఈయన తొలినాటకం రాసిన హైదరాబాదీగా రికార్డులకెక్కారు. చాలామంది ధనవంతులు ఈయన రాసిన నాటకాలు కొని, థియేటర్స్ వారిచేత తమ పేరుతో ప్రదర్శింప చేసుకునేవారు. ఇంపీరియల్ థియేటర్స్ అనే మరొక కంపెనీ కూడా ఆ కాలంలో హైదరాబాదులో నాటకాలు ప్రదర్శించింది.

సయ్యర్ యావర్ అలీ రాసిన “ఆసియా-ఎ-సితార, ఫిట్నా, పూర్బానూ, ఆపాబ్-ఎ-షరాఫత్, డాకూ కీ దుల్హాన్, ఆజ్ కల్, సౌతేలీమా, లైలామజు, షిరీస్ ఫరద్, దుఖియా దుల్హన్, మెహతాబ్ జహాన్, బాప్ కి బడా దువా, షాహీ ఠాకూ, దునియామే జన్మత్, తదీర్ కీ సితారా, ఫరేబ్ హుస్, షిక» దిల్, తల్వార్ కా ధని, మజ్జూమ్ మెహసీన్” మొదలైన నాటకాలు ఆ రోజుల్లో చాలా పాపులరైనవి. ఇంకా ఆ రోజుల్లో ఖాబిల్ హైరదాబాది, మౌలానా జాఫర్ అలీఖాన్లు కూడా గుర్తుంచుకోదగిన నాటక రచయితలుగా పేరొందారు..

1919-1924 మధ్యకాలంలో జరిగిన ఖిలాఫత్ మూవ్మెంట్ సమయంలో మూనా రశి థియేటర్స్, ద ఇంపీరియల్ థియేట్రికల్ కంపెనీ, ద ఆల్ ఫ్రెడ్ థియేట్రికల్ కంపెనీలు సయ్యద్ యావర్ అలీ ఆజం రాసిన చాలా నాటకాలు ప్రదర్శించారు. ‘టిప్పుసులాన్’. “ఇసామీ ఝండా’ వీటిలో కొన్ని. ఇవేగాక 1900 మొదట్లో సికిందరాబాదులోని ఫొటోప్లేస్ లిమిటెడ్ వంటి సంస్థలు కొన్ని విలాయత్ హుస్సేన్ ఫజ్రా అనే నాటక కర్తను నియమించుకుని ‘ఇస్లాహుద్దీన్ అయ్యూబి’ అనే నాటకాన్ని ప్రదర్శించగా అది చాలా పాపులరైంది. ఇంకా మౌలానా జఫర్ అలీ రాసిన “జంగ్-ఎ-రూస్-వ-జపాన్ కూడా ప్రేక్షక జనాదరణ పొందిన నాటకం. ఇతని నాటకం ఉరూ వారపతిక “దక్కన్ రివ్యూ”లో 1905లో అచ్చయింది. ఈ నాటకం ఒక్కటే పుస్తకంగా గుల్బర్గా జిల్లా కమిషనర్ ముందు మాటతో ప్రచురితమైంది.

ఇంతకు ముందు ప్రస్తావించుకున్న సయ్యద్ యావర్ అలీ 1883లో హైదరాబాదులో జన్మించారు. సయ్యద్ దావూద్ అలీషా రమాల్ కుటుంబానికి చెందిన ఈయన ఉర్దూ, పర్షియన్, అరబిక్, ఇంగ్లీష్ భాషల్లో విద్యాభ్యాసం చేశారు. దాగ్ దెహల్వీ హైదరాబాదుకు వచ్చాక వారి వద్ద శిష్యరికం చేశాక మొదట గజల్స్ తరువాత నాటకాల స్క్రిప్టు రాయడంలో మెళకువలు నేర్చుకున్నారు. పారశీ థియేటర్ నిర్వాహకులు నాటకాలు రాయించుకుని సరైన పారితోషకాలిచ్చేవారు కాదు. దాంతో ఆయన పేదరికం అనుభవిస్తూ 1932లో 49వ ఏట కన్నుమూశారు. ఆ తరువాత ఆయన శిష్యుడైన సయ్యద్ ఖర్బాన్ అలీ కొన్ని ఎంపిక చేసిన ఉర్దూ కవితల్ని పుస్తకంగా ప్రచురించాడు.

ఆయన నాటకాల స్క్రిప్టులన్నీ కాలగర్భంలో కలిసి పోయినవి. అయితే హైదరాబాదు నాటకరంగాన్ని ఎంతగా ఆదరించిందంటే ఇతర ప్రాంతాల

అంగాన్ని ఎంతగా ఆదరించిందంటే ఇతర ప్రాంతాల నుండి వచ్చిన చాలా నాటక సంస్థలను దశాబ్దాల తరబడి ఇక్కడే ఉండిపోయేంతగా. మహారాష్ట్ర నుండి వచ్చి “కిర్లోస్కర్ సంగీత

ఆగా, మహారాష్ట్ర నుండి వచ్చి “కిరోస్కర్ సంగీత్ మండలి” 1893-1912 మధ్య కాలంలో పలు నాటకాలు ప్రదర్శించింది. ‘కిర్లోస్కర్’ కన్నా ముందుగానే కేశవరావు బటోడేకర్ నాట్యమండలి

కన్నా ముందుగానే కేశవరావు బరోడేకర్ నాట్యమండలి 1885-1906 మధ్యకాలంలో “ఒథెల్లో” నాటకాన్ని జమ్రుద మహల్

గ్రౌండ్స్ లో ప్రదర్శించారు. ‘జమ్రుద్ మహల్ థియేటర్ ఇదే గ్రౌండ్ లో ఆ తరువాత నిర్మాణమైంది. ఈ కృష్ణా థియేటర్‌గా ఆబిడ్స్ లో ఏర్పడింది. అయితే గుల్జార్‌హౌజ్లో నిర్మితమైన ‘కృష్ణా టాకిస్ ఈ

ఉంది. అయితే గుల్బారాష్ట్రాల్లో నిర్మితమైన ‘కృష్ణా టాకీస్’ ఈ రెండు కూడా ఒకటేనని అందరూ పొరపడుతుంటారు. ఈ రెండు వేరు వేరు.

ఈ నేపథ్యంలో శ్యామ్ రావా న్యాల్కల్ ‘దక్కన్ మ్యూజిక్ కట్ ను ప్రారంభించి ‘శారద’ అనే నాటకాన్ని 1916 ఏప్రిలేలో కృష్ణా ఒపెరాలో ప్రదర్శించారు. ఆ తరువాత ‘దక్కన్ లిటరరీ అసోషియేషన్’ ‘1924-27 మధ్యకాలంలో నాలుగు నాటకాలు ప్రదర్శించింది… హిరాబాయి బరోడెకర్ అనే రంగస్థల నటి తన నాటక బృందంతో మహారాష నుండి వచ్చి 1936-1940 మధ్యకాలంలో నాటకాలు ప్రదర్శించడమే గాక దక్కన్ రేడియోలో కూడా నాటకాలు వేశారు. ‘తేజ్-ఎ-వఫా’ దేశ్ దశ, దూజ్ కా చాంద్, వతన్ కే దోస్త్ వంటి నాటకాలను పై సంస్థలు ప్రదర్శించినవి. 1933 నాటికి “మ్యూజిక్ సర్కిల్” అనేదొకటి మొదలైతే 1942 నాటికి మహిళలు వేదికలెక్కడం

ప్రారంభమైంది. 1942 నుండి. అలా హైదరాబాదులో రంగస్థలంపై వేషం కట్టిన తొలినటి రంగబాయి. ఆమె సికిందరాబాదులోని ఒక తెలుగు కుటుంబంలో జన్మించారు. కుటుంబ కారణాల వల ఆమె రంగస్థల నటిగా జీవితం ప్రారంభించి చాలా నాటక కంపెనీల్లో చేరి

భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో పర్యటించింది. అటు తరువాత బర్మా వెళ్లి కూడా నాటకాల్లో నటించిన ఆమె బొంబాయిలో కొంతకాలం పని చేసింది కూడా.

సరోజినీదేవి తమ్ముడు హరీన్ చటోపాధ్యాయ హైదరాబాదులో చాలా పేరున్న నటుడు, రచయిత, కవి, నాటక ప్రయోక్త. ఇంట్లోనే నాటకాలు వేసేవాడు. చెల్లెండ్లు మృణాలిని, సునాళిని. అక్క సరోజిని కొడుకు కూతురు జయసూర్య, పద్మజ అంతా కలిసి సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో, నిజాం కాలేజిలో ఆంగ్ల నాటకాలు వేశారు. “అబూహసన్’, ‘వాల్మీకి’ నాటకాలు మద్రాసులోని విక్టోరియా హాల్లో (1918) నిండిపోయిన జనం ముందు ప్రదర్శించి మెప్పిందారు. రెండేళ్ల తరువాత 1920లో ‘ది స్లీపర్ అవేక్డ్’, రిటర్న్ ఫ్రమ్ అబ్రాడ్’ అనే రెండు సాంఘిక నాటకాలు ఇండియాలోనే గాక సిలోన్లో కూడా ప్రదర్శితమైంది. మంగళూరులో కమలాదేవి చటోపాధ్యాయను పెళ్లాడాక తన అత్తగారి కోరిక మేరకు తుకారాం’, ‘జయదేవ్’, ‘సక్కుబాయి’, ‘ఏకనాథ్’, ‘పుండలీక్ వంటి భక్తి నాటకాలు రాశారు. వీటిలో తుకారాం దేశవ్యాప్తంగా ఆదరణ పొందిన నాటకంగా రికార్డులకెక్కింది. కమలాదేవి 1930లోనే రెండు మూకీలో నటించగా, ఆ తరువాత హరీస్ కూడా బొంబాయి, కలకత్తాల్లో హిందీ, బెంగాలీ చాలా చిత్రాల్లో గుర్తుండిపోయే పాత్రల్లో నటించారు.

1956 లో సమైక్య రాష్ట్రం ఏర్పడిన తరువాత క్రమక్రమంగా తెలంగాణ సాహిత్య, సాంస్కృతిక రంగం క్రమంగా తెరవెనకకు వెళ్లడం జరిగింది. సీమాంధ్ర ప్రాంతాల శాస్త్రీయ సంగీత నాట్యాలు, తెలుగు సినిమాలు పూర్తిగా ఈ ప్రాంత ప్రజల జీవితాలపై బలమైన ముద్ర వేసినది. ప్రధానంగా పాఠ్య పుస్తకాలలో, సినిమాలలో, పత్రికలలో పూర్తిగా సీమాంధ్ర ప్రాంతాలలోని రెండున్నర జిల్లాల భాష ప్రజల జీవితాలను శాసించి, వారి భాషనే తెలుగు భాషగా చలామణి అయింది. తెలంగాణ భాషలో, యాసలో మోటుదనం ఉంటుందని అవమానించడం మొదలుపెట్టారు. వీటన్నింటి పర్యవసనమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం. 1995 నుండి మొదలై 2014లో ముగిసి 2014లో ముగిసి, తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది.

సీమాంధ్ర ప్రజలు, తెలంగాణ భాషకు, యాసకు, సాగుతున్న కళలకు ప్రయాణంలో, ఆ కళా రూపాలతోనే ఉద్యమం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com