Fossil Free: Reimagining Clean Energy in a Carbon-Constrained World

</p.ప్రపంచానికి సవాలుగా మారిన ముఖ్యమైన అంశం..ఇంధనాలు. ప్రస్తుతం వాడుతున్న పెట్రోలు, డీజిల్, బొగ్గు, సహజ వాయువు వంటి శిలాజ ఇంధనాల వల్ల వెలువడే కాలుష్యంతో పర్యావరణానికీ, మానవ ఆరోగ్యానికీ ముప్పు వాటిల్లుతుంది. దాంతోపాటు శిలాజ ఇంధనాలు రోజు రోజుకీ తరిగి పోతుండటంతో, భవిష్యత్ తరానికి ఇంధన శక్తికి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నయాలు రూపొందించడం, వినియోగించడం వంటి అంశాల ప్రాతిపదికన Fossil Free: Reimagining Clean Energy in a Carbon-Constrained World పుస్తకాన్ని రచించారు సుమంత్ సిన్హా. సౌర శక్తి, పవన శక్తి వంటి పునరుత్పాదక శక్తులను ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి ఉన్న అవకాశాలు, సవాళ్లు, ప్రభుత్వ నిబంధనలు, పెట్టుబడులు వంటి అంశాలను ఈ పుస్తకంలో క్షుణ్ణంగా వివరించారు.

The Fury of Covid-19

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ గురించి ఈ మధ్య కాలంలో చాలా మంది పుస్తకాలు రచించారు. కోవిడ్- 19 వల్ల కలిగిన మరణాలు, ఆర్థిక నష్టాలు వంటి వాటినే ఎక్కువగా ఆయా పుస్తకాల్లో చర్చించారు. కానీ కోవిడ్- 19 సమయంలో ఏర్పడిన సామాజిక, సాంస్కృతిక వైరుధ్యాలు, ప్రభావాల గురించి, కరోనా ఉగ్రరూపానికి దారితీసిన పరిస్థితుల గురించి The Fury of Covid-19 పుస్తకంలో వివరించారు రచయిత వినయ్ లాల్. మనిషి సహజ వనరులను, జీవాలను ధ్వంసం చేస్తూ తన అవసరాలకు వాడుకోవటం, కరోనా మనపై చూపిన ఉగ్రరూపం నుండి నేర్చుకోవాల్సిన విషయాలను ఇందులో ఎక్కువగా వివరించారు. కరోనా కారణంగా వివిధ వర్గాల ప్రజలు ప్రభావితమైన తీరును, సామాజిక వైరుధ్యాలను సైతం ఇందులో పొందుపరిచారు.

Pilgrim Nation: The Making of Bharatvarsh

భారత దేశం పుణ్యక్షేత్రాలకు నిలయం. హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్దులు, జైనులు..ఇలా సర్వమతాలకు చెందిన ఆరాధ్య ప్రదేశాలు మన దేశంలో ఉన్నాయి. వీటన్నిటి గురించిన పూర్తి సమాచారాన్ని ఒకే పుస్తకంలో పొందుపరిచారు రచయిత దేవ్ దూత్ పట్నాయక్. Pilgrim Nation: The Making of Bharatvarsh అనే పుస్తకంలో భారత ఉప ఖండంలోని, వివిధ మతాలకు చెందిన 32 పవిత్ర ప్రదేశాల పూర్తి చరిత్రను వివరించారు. వివిధ ప్రాంతాల, మతాల ప్రజలు తమ ఇష్ట దైవాన్ని ఆరాధించడం, ప్రజల నమ్మకాలు వంటి అంశాలను సైతం ఇందులో పొందుపరిచారు. ఒక పుణ్యక్షేత్రం యొక్క శతాబ్దాల తరబడి చరిత్రను ఈ పుస్తకంలో వివరించడం ఇందులోని ఆసక్తికర అంశం.

‘Mahabharata for Children’

మహా భారతం.. ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు సరికొత్త విషయాన్ని అందించగల అద్భుత ఇతిహాసం. మహాభారతం 18 పర్వాలు, లక్ష శ్లోకాలతో ప్రపంచంలోని అతిపెద్ద పద్య కావ్యాలలో ఒకటిగా ఖ్యాతికెక్కింది. అంతటి మహాభారతాన్ని పిల్లలకు సైతం వివరించేందుకు ‘Mahabharata for Children’ అనే పుస్తకం ద్వారా చక్కటి ప్రయత్నం చేశారు రచయిత్రి అర్షియా సత్తార్. మహాభారతంలోని సంఘటలను అనువదించి, పిల్లలకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకాన్ని రచించారు. మహభారతంలో సంఘటనలు, సన్నివేశాల్లోని మంచి చెడులను చిన్న పిల్లలు ఈ పుస్తకం ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చు. మహాభారతంలో ఉన్న సంక్లిష్ట విషయాలను సైతం, పిల్లలకు ఆసక్తి కలిగించేలా వివరించారు రచయిత్రి అర్షియా సత్తార్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com