మంజీర రచయితల సభ

నాణ్యమైన కవిత్వం కోసం నాలుగు కాలాల పాటు నిలిచే సాహిత్యం కోసం మంజీరా రచయితల సంఘం ప్రతి ఆదివారం 5 గంటల నుండి గూగుల్ మీలో నిర్వహిస్తున్న కార్యక్రమమే కవిత్వ నైపుణ్యాలు.

కవిత్వం నైపుణ్యాలు…

13లో కవిత్వము దృశ్యీకరణ – మానవీకరణ ప్రకృతీకరణ అనే అంశంపై ప్రఖ్యాత కవి తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వాధ్యక్షులు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి గారు ప్రసంగించారు. విలువైన అంశాలను వివరిస్తూ కవిత్వంలో దృశ్యీకరణ పాఠకుని హృదయాన్ని చైతన్యం చేయాలన్నారు. మానవీకరణ వల్ల మనుషుల్లో ఉన్న స్వార్థపూరిత భావన పోయి మానవులే అత్యున్నత వారని బోధ చేస్తుందన్నారు. కవిత్వంలో ప్రకృతీకరణ ముఖ్యమని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో కందుకూరి శ్రీరాములు, పొన్నాల బాలయ్య, దాసరి మోహన్, సంతోష్ శర్మ, ఏం దేవేంద్ర, వి. సరోజ మొదలైన ప్రముఖులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం హోస్ట్ గా మంజీరా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ సిద్దెంకి యాదగిరి వ్యావహరించారు.

డా.కేతవరపు రాజశ్రీ ‘కరోన…టూరిస్టు కాదు’ కవితా సంపుటి ఆవిష్కరణ

గత నెల ‘కరోన…టూరిస్టు కాదు’ కవితా సంపుటి ఆవిష్కరణలో జి.కృష్ణవేణి, డా.పరంజ్యోతి, నేటి నిజం దినపత్రిక సంపాదకులు బైస దేవదాసు, ఆవిష్కర్త డా.కె.వి.రమణాచారి, డా.కేతవరపు రాజశ్రీ, నియోగి, జంద్యాల కుసుమ కుమారి తదితరాలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com