Hostility: A Diplomat’s Diary on Pakistan-India Relations

భారత్-పాక్ మధ్య సంబంధాల విషయంలో దౌత్యవేత్తల పాత్ర ఎంతో కీలకం. భారత్ లో పాకిస్తాన్ రాయబారిగా వ్యవహరించిన అబ్దుల్ బాసిత్, తన అనుభవాలను Hostility: A Diplomat’s Diary on Pakistan-India Relations పుస్తకంలో పొందుపరిచారు. 2014-17 వరకు ఢిల్లీలో పాక్ రాయబారిగా పనిచేసిన అబ్దుల్ బాసిత్, పలు వివాదాస్పద అంశాల్లో భారత్-పాక్ మధ్య సంబంధాల్లో నెలకొన్న ప్రతిష్టంభనను, దాన్ని పరిష్కరించిన విధానాలను ఇందులో వివరించారు.

Soumitra Chatterjee: A Life in Cinema, Theatre, Poetry & Painting

బెంగాల్ చిత్ర సీమలో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సౌమిత్ర ఛటర్జీ జీవిత చరిత్రను Soumitra Chatterjee: A Life in Cinema, Theatre, Poetry & Painting పుస్తకంలో వివరించారు రచయితలు అర్జున్ సెంగుప్త మరియు పార్థా ముఖర్జీ. ఆరు దశాబ్దాల సుదీర్ఘ నట జీవితంలో 300లకు పైగా చిత్రాల్లో నటించిన సౌమిత్ర ఛటర్జీ వ్యక్తిగత, సినీ విశేషాలను, అత్యుత్తమ దర్శకుడు సత్యజిత్ రే వంటి వారితో అనుబంధాలను ఈ పుస్తకంలో వివరించారు.

Wanderers, Kings, Merchants: The Story of India through its Languages

భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ, రెండూ లేదా అంతకంటే ఎక్కువ భాషలు మాట్లాడటం సర్వసాధారణం. అయితే దీనికి దారితీసిన పరిస్థితులు, భారత దేశ ‘భాషా చరిత్ర’ ను Wanderers, Kings, Merchants: The Story of India through its Languages పుస్తకం ద్వారా వివరించారు రచయిత పెగ్గీ మోహన్. భారత దేశంలోకి వివిధ భాషలు ప్రవేశించడానికి కారణాలు, దేశ చరిత్రపై వాటి ప్రభావాన్ని ఈ పుస్తకంలో వివరించారు.

Second World War Sandwich

రెండో ప్రపంచ యుద్దంలోని కీలక సంఘటనను Second World War Sandwich పుస్తకంలో పొందుపరిచారు రచయిత డిగోంటా బోర్దాలాయ్. 1944 లో రెండో ప్రపంచ యుద్ద సమయంలో నాగాలాండ్ లో జపాన్ సైన్యం, బ్రటిష్ సైన్యం మధ్య జరిగిన ఘర్షణలను ఈ పుస్తకంలో వివరించారు. బ్రిటిష్ సైన్యంలోని నలుగురు సామాన్య వ్యక్తులు చేసిన సాహసాలను ఇందులో వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com