అచ్చమాంబ సంస్కరణా దృక్పథం తెలియజేస్తూ…

అనాదిగా మూసపద్ధతిలో కొనసాగుతున్న స్త్రీల జీవితాలలో మార్పును ఆశిస్తూ ఒక సమిష్టి ప్రాతిపదిక దృష్టితో ‘సంస్కరణవాదం’ ఆరంభం అయింది. స్త్రీలలో అంతర్గతంగా ఉన్న అసంతృప్తులకు, అణగారి ఉన్న ఆలోచనలకు ఒక చక్కటి అవకాశాన్ని కలిగించింది. స్త్రీల సమస్యలను గుర్తిస్తూ,స్త్రీల అభివృద్ధిని కాంక్షిస్తూ సంస్కరణ వాదం బలోపేతమైంది. కుటుంబం ఒక సామాజికరంగంగా పరిణమిస్తున్న ఆ క్రమంలో స్త్రీలను సమాజంలో అంతర్భాగం చేసింది. స్త్రీలలో చైతన్య స్థాయిని పెంపొందించడానికి స్త్రీ విద్యావశ్యకతను నిర్ణయించడం సంస్కరణవాదం లక్షణాలలో మొదటి అంశంగా రూపుదిద్దుకుంది.

తెలుగుదేశమంతటా విస్తరించి ఉన్న బాల్య వివాహాలు, బాల వితంతువులు, సాంఘిక పరమైన కట్టుబాట్లు, కన్యాశు ల్కం, అవిద్య మొదలైన అంశాలు స్త్రీల జీవితాలను దుర్బరం చేశాయి. ఈ బాల్యవివాహాల పద్ధతి వల్ల కన్యాశుల్కం ఏర్పడి,దానివల్ల వైధవ్యం, వ్యభిచారం వంటి అవినీతి చర్యలు, శిశుహత్య వంటి క్రూర చర్యలు ప్రారంభం అయ్యాయి.

స్త్రీల అభ్యుదయాన్ని కాంక్షిస్తు అభివృద్ధి పథంలో నడుస్తున్న సంస్కరణ భావాలు వాస్తవిక జీవితాల్లో మార్పు తీసుకొనిరావాలన్న ఆకాంక్షతో ఆచరణలో కార్యరూపాన్ని అనుసరించాయి. భారతదేశచరిత్రలో సంస్కరణోద్యమానికి ప్రముఖ స్థానం ఉంది. 19వ శతాబ్దంలో ఆరంభమైన సంస్కరణోద్యమం ద్వారా మత, సాంఘిక, రాజకీయ పరిణామాలు ఏర్పడ్డాయి. తొలిదశలో సతీ సహగమనాన్ని, కన్యాశుల్కాన్ని తీవ్ర సమస్యలుగా భావిస్తూ వ్యతిరేక ఉద్యమాలు బయలుదేరాయి. సతీసహగమనం నిషేధ చట్టం వరకు కొనసాగితే; కన్యాశుల్కం – దాని కాలం అంతరించేంత వరకు ఉద్యమించింది. ఇటువంటి సంస్కరణ భావాలను తొలి తెలుగు కథారచయిత్రి భండారు అచ్చమాంబ చాలా స్పష్టంగా వెల్లడించారు. అచ్చమాంబ ప్రాచీనమైన సతీ ధర్మాలతో పాటు నవీన పాశ్చాత్య విద్యా సంస్కారాలను కలబోసి ఒక నూతనమైన పద్ధతిలో రచనా వ్యాసంగాన్నిఇందుకంజ ఆరంభించారు. భండారు అచ్చమాంబ 19వ శతాబ్ది అంతంలో, 20వ శతాబ్ది ప్రారంభంలో స్త్రీల జీవితాలను సంస్కరణాత్మక దృష్టితో ప్రతిబింబిస్తూ దాదాపు 12 కథలు రచించారు. కందుకూరి వంటి సంస్కర్తల భావాలతో ప్రభావితమైన అచ్చమాంబ స్త్రీ చైతన్యంకోసం ‘బృందావనీ స్త్రీ సమాజము’ పేరుతో స్త్రీల సమాజాన్ని స్థాపించారు.

సంఘ సేవకురాలిగా, కథా రచయిత్రిగా పేరుగాంచిన అచ్చమాంబ “అబలా సచ్చరిత్ర రత్నమాల’ అనే గ్రంథాన్ని రచించి ప్రసిద్ధ భారతీయ స్త్రీల ప్రగతిని, ప్రతిష్టను కీర్తించారు. ఆదర్శ మహిళగా మాటలో సూటిదనం, దయాగుణం, జాతీయభావం అభివ్యక్తమవుతాయి. తొలి తెలుగు కథా రచయిత్రి…

భండారు అచ్చమాంబను తొలి తెలుగు కథారచయిత్రిగా పేర్కొంటూ ప్రముఖ విమర్శకులు, పరిశోధకులు వెలిబుచ్చిన అభిప్రాయాలను తెలుసుకుందాం.

1. ‘హిందూ సుందరి’ పత్రికలో 1902లో అచ్చయిన ‘స్త్రీ విద్య’ కథను ప్రస్తావిస్తూ ‘నూరేళ్లపంట’ కథా సంకలనంలో భార్గవీరావు గారు ముందుమాట రాస్తూ – ‘1902లోనే బందరులో తొలి మహిళా సమాజాన్ని బృందావన స్త్రీ సమాజాన్ని స్థాపించిన అచ్చమాంబగారు మొదటి రచయిత్రి అని గర్వంగా చెప్తూ వారి రచన ‘స్త్రీ విద్య’ను

మొదటి కథగా వేసుకున్నాము. గుంజాడ వారి ‘దిద్దుబాటు’ మొదటికథ అనుకోవడం పొరబాటని సవినయంగా మనవి చేస్తున్నాము’ అని నిర్ధారించారు. ఇతివృత్త నేపథ్యాన్ని బట్టి చూసినా ఈ రెండు కథల్లో స్త్రీ విద్య ప్రధానంగా ఉండటం విశేషం.

2. హిందూసుందరి’ పత్రికలో 1902 – నవంబరులో అచ్చయిన అచ్చమాంబ కథ ‘ధన త్రయోదశి’ని వివరిస్తూ ప్రముఖ

స్త్రీవాద పత్రిక భూమిక సంపాదకీయంలో కొండవీటి సత్యవతి ‘తెలుగు సాహిత్య చరిత్రలో ఆనాటి రచయిత్రులకు జరిగిన అన్యాయం అంతా ఇంతా కాదు. తెలుగులో తొలి ఆధునిక కథ రాసిన భండారు అచ్చమాంబకు జరిగిన అన్యాయం గురించి కె.లలిత బయటపెట్టే వరకు ఎవరికీ తెలియదు. 1902లోనే ‘ధన త్రయోదశి’ కథ రాసిన భండారు అచ్చమాంబను వెనక్కి నెట్టేసి 1911? (1910)లో గురజాడ రాసిన దిద్దుబాటు తొలి ఆధునిక కథగా సాహిత్యకారులు స్థిరీకరించారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు.

3. కథానిలయం ట్రస్ట్ వారు 2008లో ‘తొలి తెలుగు కథలు – ఏడు అభిప్రాయాలు’ అనే పుస్తకంలో అచ్చమాంబ కథలను ప్రచురించింది. ఇందులో మొదటి రెండు కథలు 1902లోనే అచ్చమాంబ రాసినవి ‘ధన త్రయోదశి, స్త్రీ విద్య’. వీరి నివేదికను బట్టి తొలి తెలుగు కథా రచన చేసినవారు అచ్చమాంబయే అని పేర్కొనవచ్చు. 4. 2009,

జూలై 13న ఆంధ్రజ్యోతి పత్రిక ‘వివిధ’ సాహిత్య వేదికకు రాసిన వ్యాసంలో డా. ముదిగంటి సుజాతారెడ్డి ‘తెలంగాణ నుంచే తొలి కథానిక’ అనిచెబుతూ భండారు అచ్చమాంబ 1898 నుంచే కథా రచనారంభం చేశారని, ఆమె రాసిన ‘ప్రేమ పరీక్షణము’ ‘ఏరువు సొమ్ము పరువు చేటు’ కథలు రాయసం వేంకట శివుడు నిర్వహించిన ‘తెలుగు జనానా’ పత్రికలో అచ్చయ్యాయని, కాని ఇంకా ఆ పత్రికా సంచికలు దొరకవలసి ఉందని తెలియజేశారు. 1901 నుంచి 1904 వరకు సేకరించిన అచ్చమాంబ పది కథలను సంగిశెట్టి శ్రీనివాస్ ‘భండారు అచ్చమాంబ – తొలి తెలుగు కథలు’ అనే పేరుతో గ్రంథ రూపంలో వెలువరిస్తున్నారని స్పష్టం చేశారు.

5. 2010లో సంగిశెట్టి శ్రీనివాస్ ‘భండారు అచ్చమాంబ – తొలి తెలుగు కథలు’ అనే పేరుతో అచ్చమాంబ రాసిన పదికథలను గ్రంథరూపంలోకి తీసుకొచ్చారు. 1. గుణవతియగు స్త్రీ, 2. లలితా శారదులు, 3. జానకమ్మ, 4. దంపతుల ప్రథమ గృహం, 5. సత్పా దానము, 6. స్త్రీ విద్య, 7. ధన త్రయోదశి, 8. భార్యాభర్తల సంవాదము, 9. అద్దమును సత్యవతియు, 10. బీద కుటుంబము కథలను ఈ పుస్తకంలో ప్రచురించారు. ఇంకా రెండు కథలు ‘ప్రేమ పరీక్షణము, ఎరువుసొమ్ము పరువుచేటు’రాయసం వేంకటశివుడు నిర్వహించిన ‘తెలుగు జనానా’ పత్రికలో అచ్చయ్యా యని, ఇంకా ఆ కథలు దొరకవలసి ఉందని పేర్కొన్నారు.

ఆధునిక సాహిత్యంలో కథ వచన ప్రక్రియగా ఒక ప్రత్యేకమైన రూపాన్ని ధరించి, సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకొంది. ఇరవయ్యో శతాబ్దిలో ఆరంభమైన కథా ప్రక్రియకు వందేళ్ళకు పైబడి చరిత్ర ఉంది. తెలంగాణ కథ భండారు అచ్చమాంబతో ప్రారంభం అవుతుందని, నూట ఇరవై ఏండ్ల చరిత్ర తెలంగాణ కథకుందని ప్రముఖ తెలంగాణ రచయిత్రి డా. ముదిగంటి సుజాతారెడ్డి స్పష్టం చేశారు. భండారు అచ్చమాంబ జననం తెలంగాణ ప్రాంతం కావటం, తొలి తెలుగు కథలు రాయటం, అందులోను ఆమె మహిళ కావటంగమనార్హం. కావున తెలంగాణ (తెలుగు) తొలితరం కథా రచయిత్రుల చరిత్ర భండారు అచ్చమాంబతోనే ఆరంభమవుతుంది. ఆధునిక తెలుగు కథా సాహిత్యంలో గురజాడ కథను, సాంఖ్యాయన కథలను పూర్వపక్షం చేస్తూ తెలంగాణ పరిశోధకులు, విమర్శకుల ద్వారా అచ్చమాంబ కథలు మొదటి స్థానంలో నిలిచాయి. తెలంగాణ కథా సాహిత్యంలోనే కాదు సమస్త తెలుగు కథా చరిత్రలోనూ మొట్టమొదటి రచయిత్రిగా పేర్కొనదగినవారు భండారు అచ్చమాంబ.

భండారు అచ్చమాంబ నైజాం సరిహద్దులోగల మునగాల సంస్థానంలోని నందిగామలో 1874 సంవత్సరంలో జన్మించారు. తల్లిదండ్రులు గంగమ్మ, కొమర్రాజు వెంకటప్పయ్య, సోదరుడు కొమర్రాజు లక్ష్మణరావు; అచ్చమాంబ ఆరేండ్ల వయస్సులో తండ్రి మరణానంతరం తల్లితో, సోదరుడితో తన సవతితల్లి కొడుకైన కొమర్రాజు శంకరరావు ఉంటున్న నల్లగొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతానికి వచ్చారు. ఎనిమిదేళ్ల వయస్సులో 1882లో తన

మేనమామ భండారు మాధవరావుతో అచ్చమాంబకు వివాహం జరిగింది. తన భర్త ఉద్యోగం రీత్యా వారి కుటుంబం మారిపోయింది. ఆ సందర్భంలోనే నాగపూర్, దిలాపూర్ ప్రాంతాలలో వారి కుటుంబం ఉండవలసి వచ్చింది. ఒకఉపాధ్యాయుడు తమ ఇంటికి వచ్చి సోదరుడికి పాఠాలు బోధించేటప్పుడు పక్కనే కూర్చొని శ్రద్ధగా విని అభ్యాసం చేశారు. అలవోకగా తెలుగు, సంస్కృతం, మరాఠి, హిందీ, గుజరాతీ భాషలను నేర్చుకొన్నారు. సంప్రదాయాభిప్రాయాలు గల తన భర్త అచ్చమాంబ చదువుకోవడానికి అభ్యంతరం వ్యక్తం చేసినా, ఆయన ఇంట్లో లేని సమయంలో అనేక గ్రంథాలు చదివేవారు. ఆయా భాషల్లో గల అపారమైన సాహిత్యాన్ని ఆకలింపు చేసుకున్నారు. భర్త, సోదరుడితో పాటు ప్రతి సంవత్సరం తెలుగు ప్రాంతాలలో పర్యటించిఉపన్యాసాలు, సభలు, సమావేశాలు నిర్వహించేది. ఆమె తన ప్రసంగాలతో మహిళా లోకంలో తిరుగులేని మార్పు తీసుకొచ్చింది. పది కథలు – ప్రధానాంశాలు…

‘భండారు అచ్చమాంబ – తొలి తెలుగు కథలు’ అన్న సంపుటి ద్వారా పదికథలు మనకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కథలోని ప్రధానాంశం స్త్రీ చైతన్యం, స్త్రీ విద్య, అనేక రంగాలలో స్త్రీ అభివృద్ధి – ఆలోచన విశ్లేషణా స్థాయి.

1. గుణవతియగు స్త్రీ – తెలుగు జనానా – 1901, మే సంచిక : ఈ కథలో దశకుమార చరిత్రలో ఉన్న కథను తీసుకొని నేటి జీవన విధానానికి సంబంధించిన కథగా మలిచారు. సంసారాన్ని ఎట్లా పొదుపుగా చేయవచ్చునో ఈ కథలో తెలుస్తుంది. ప్రాచీన కథాంశం అయినా నిత్యజీవనానికి పనికి వచ్చే సారాంశం ఇది. ‘గుణవతియగు స్త్రీ’ అన్న శీర్షికా నామమే ఇందులో పరమార్థాన్ని బోధిస్తుంది.

2. 2. లలితా శారదులు – తెలుగు జనానా – 1901 : ‘లలితా శారదులు’ అనే ఇద్దరు స్నేహితుల మధ్యసాగిన వ్యవహారమిది. లలితలో ఈర్ష్యం, గర్వం, దురభిమానం వంటివి కనిపిస్తే, శారదలో మంచితనం కనిపిస్తుంది. అయితే శారద తన సద్గుణాలతో లలితలో మార్పు తేవడానికి ప్రయత్నించడం అనేది ఇందులోని ప్రధానాంశం.

3. జానకమ్మ – తెలుగు జనానా – 1902 : ఈ కథ స్త్రీకి విద్య ఎంత అవసరమో చాటి చెబుతుంది. చదువుకొన్న స్త్రీకి వివాహ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని, కట్నకానుకలు లేకుండానే వరుడు లభిస్తాడని రచయిత్రిఈ కథ ద్వారా అందించే సందేశం. అందుకే తల్లిదండ్రులు కూతురును బరువుగా భావించకుండా విద్యాబుద్ధులు నేర్పించాలని కోరారు. ఇది పూర్తిగా సంభాషణా ధోరణిలో సాగినకథ.

4. 4. దంపతుల ప్రథమ కలహం – హిందూ సుందరి – 1902 : భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని అన్యోన్యంగాజీవించాలని, కుటుంబం మొత్తం సామరస్యపూర్వక వాతావరణాన్ని కల్పించుకోవాలని తెలియజెప్పే కథ. ఇది కూడా సంభాషణా ధోరణిలో సాగింది.

5. 5. సత్పాత్రదానము – హిందూ సుందరి – 1902 : ఈ కథలోని గుడ్డివాని భాష తెలంగాణ యాసలో కనిపిస్తుంది. రచయిత్రి ఈ కథ జరిగిన చోటును హైదరాబాదుగా పేర్కొన్నారు. ఇందులో నిజాం పాలనలోని భూస్వామ్య విధానం, భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేసే నేపథ్యం ఉంది.

6. స్త్రీ విద్య – హిందూ సుందరి – 1902 : ఈ కథ స్త్రీ విద్యావశ్యకతను తెలుపుతుంది. ఇది భార్యాభర్తల సంవాదరూపంలో కొనసాగుతుంది. స్త్రీలుచదువుకోకుండా అజ్ఞానాంధకారంలో ఉన్నట్లైతే మూఢత్వంలో ఉంటారనే విషయాన్ని ఈ కథలో ఒక పురుష పాత్ర ద్వారా రచయిత్రి చెప్పిస్తారు.

7. శాస్త్రాలలో స్త్రీలు చదువుకోకూడదు అనే మాటను ఖండిస్తూ స్త్రీ విద్యాభివృద్ధికోసం పురుషుల ప్రోత్సాహం ఎంతైనా అవసరమని తెలియజేశారు. ధన త్రయోదశి – హిందూ సుందరి – 1902 : ఈ కథలో గల భార్యాభర్తలిద్దరిని స్వయంకృషి మీద విశ్వాసంగల పాత్రలుగా చిత్రించారు. వీరు దారిద్ర్యంలో కొట్టు మిట్టాడుతున్నా ఉదాత్త గుణాలు మాత్రం వీరినుంచి వీడలేకపోవడం అనేది ఈ కథలో కన్పించే విశేషం.

8. భార్యా భర్తల సంవాదము – హిందూ సుందరి – 1903 : ‘స్త్రీ విద్య’ కథలో లాగానే ఈ కథలో కూడా భార్యాభర్తలసంవాద రూపంలో కథనం సాగింది. స్త్రీలు బంగారు ఆభరణాల కంటే సద్గుణాలనే భూషణాలను ధరించాలని ఈ కథ తెలియచెబుతుంది.

9. అద్దమును సత్యవతియు – హిందూ సుందరి – 1903 : ఈ కథద్వారా ఒక చిన్న సంఘటన నుంచి ఒక గొప్ప సందేశాన్ని రచయిత్రి ఉపదేశించారు. ఈ జగత్తంతా ఒక అద్దమని, దాన్ని కోపంగా చూస్తే కోపంగా, సంతోషంగా చూస్తే సంతోషంగా ప్రతిబింబిస్తుందని వర్ణించారు. అతిచిన్న వయస్సుగల మూడు ఏండ్ల సత్యవతి పాత్రను చలాకీగా, సరస సంభాషణగా రచించారు.

10. బీద కటుంబము – సావిత్రి – 1904 : ఈ కథలో స్వయంకృషితో,సద్గుణాలతో దారిద్ర్యాన్ని ఎట్లా జయించవచ్చునో తెలుస్తుంది. ఇది ఉత్తమ పురుషలో సాగిన కథనం. కథా కథనశైలి…

అచ్చమాంబ కథల్లో గ్రాంథిక భాష కన్పిస్తున్నా, దీర్ఘ సమాసాలుగాని, జటిల పదాలుగాని ప్రయోగించబడలేదు. కథనం ఆద్యంతం ఆసక్తిగా కొనసాగింది. ఈ కథలు పూర్తిగా సామాజిక నేపథ్యం గలవి. కొన్ని కథల్లో జీవిత సత్యాలుంటే, మరికొన్ని కథల్లో నీతి బోధలున్నాయి. ఇవి వ్యక్తిత్వ నిర్మాణానికి, జీవితార్థానికి పనికి వచ్చే విషయాలు. ఆమె భావాల్లో ఎక్కడా కాలదోషం కన్పించదు. కథాంశం ఆధునిక సామాజిక ప్రయోజనానికి , చెందింది. సంభాషణలు అత్యంత సరళ సుందరంగా ఉన్నాయి. కథలన్నింటిలో ప్రథమ పురుషలో కథనం సాగినా పదో కథలో మాత్రం ఉత్తమ పురుషలో సాగింది. ఈ లక్షణం ఆధునిక కథానిక స్వరూప స్వభావానుగుణంగా ఉంది. ఏకాంశ ప్రాధాన్యంతో పాటు, శిల్పం దృష్ట్యా ఎక్కడా విభిన్నత గోచరించదు.

భాషలో మాత్రం గ్రాంథికం కన్పించినా, కథా లక్షణాలకు ఎలాంటి ఆటంకాలు కలుగవనే భావించాలి. తర్వాతి కాలంలోగ్రాంథిక భాషలో రచించిన కథా రచయితల (అడవి బాపిరాజు) కథలను కథానికలుగా, రచయితలను కథా రచయితలుగా అభివర్ణించడం జరిగింది. కావున అచ్చమాంబ కథలను కూడా సమగ్ర కథాలక్షణాలతో కూడినకథానికలుగా స్వీకరించాల్సిన బాధ్యత మనమీద ఉంది. తెలంగాణలో పుట్టి, మహారాష్ట్రలో జీవితం కొనసాగించడం ద్వారా ఆమెలో మిశ్రమ భావజాలం ఏర్పడింది. ఇటు వీరేశలింగం సంఘ సంస్కరణోద్యమం, అటు మహారాష్ట్రలోనీ జన జాగరణ దేశీయాభిమానం పట్ల ఆమె ప్రభావితురాలయ్యారు. వీటన్నింటికి భిన్నంగా ఆమె కథల్లో తెలంగాణా పదజాలం, తెలంగాణా జీవన విధానం వంటి అంశాలు ప్రతిబింబిస్తాయి.

ఈర్ష్య, గర్వం, దురభిమానం వంటిదుర్గుణాలను వదిలి సద్గుణాలను అలవరుచుకోవాలని. స్వయంకృషితో, సోమరితనాన్ని వదిలి దారిద్ర్యాన్ని అధిగమించాలని, పొదుపును పాటించి సంసారాలను సంరక్షించుకోవాలని, భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని అన్యోన్యంగా జీవించాలని, కుటుంబం

మొత్తం సామరస్య పూర్వక వాతావరణాన్ని కల్పించుకోవాలని రచయిత్రి తన కథల ద్వారా ఉపదేశించారు. ఈ కథల నేపథ్యమంతా సామాజిక చైతన్యాన్ని ఆశిస్తుంది. వ్యక్తిత్వ నిర్మాణానికి (వికాసానికి), జీవితార్థానికి పనికి వచ్చే విషయాలను నీతి బోధకాలుగా, జీవిత సత్యాలుగా వెల్లడించారు. కథా సాహిత్యం ద్వారా సామాజిక ప్రయోజనాన్ని అభిలషించారు.

భండారు అచ్చమాంబ స్త్రీ విద్యావశ్యకతను తెలిపే సంభాషణ స్త్రీ విద్య కథలో లభిస్తుంది. భాషలో సరళతను, భావ ప్రాధాన్యతను ఇందులో ప్రత్యేకంగా గమనించవచ్చు.

“విద్య వలన బుద్ధి వికసించును. అనేక సభ్రంథములలోని యమూల్యంబులగు నుపదేశ వాక్యంబులు మనసున నాటి మనుజుల నుదాత్తవంతులనుగా జేయును. వారి యందలి దుర్గుణ పుంజములు పోయిసద్గుణ పరంపర లాస్థానముల లంకరించును. లోకానుభవమును గనుటకు వారలు విశేష యోగ్యులగుదురు. అనేక లోక వార్తల నెఱుగ గలిగిన వారలగుదురు. కొన్ని పుస్తకముల పఠనము వలన మనమునకాహ్లాదము కలుగును. ఇందువలన సంసారము నందలి యసంఖ్యాకములగు దు:ఖముల నొక్కింత మఱచి జనులానందింపగలరు. విద్యవలన నిట్టి లాభములింకను బెక్కులు కలవు. నీవు పట్టుదలతో చదువునేర్చి

కొంత చదువుకొనిన పిదప భోజన శయనాదులనైన నొల్లక చదువునందే యభిరుచి కలిగియుందువని నేను దృఢముగా జెప్పగలను. అన్ని యానందములలో విద్యానందమే శ్రేష్టమనిన వాక్యము నిజమని నీవే తెలుసుకొనెదవు. ఇది యిటుండనిమ్ము ప్రపంచము నందెల్లప్పుడును పత్ని పతికి సహాయురాలై యుండవలయును…. ప్రస్తుతము పురుషుల కంటెను స్త్రీలు విశేష జ్ఞాన సంపన్నులగుట యధిక యావశ్యకము, ఏలన నికముందు పుట్టబోవు వారి నున్నత పదవికి తెచ్చుట స్త్రీలయధీనము లోనిదై యున్నది. తల్లి విద్యాహీనము దుర్గుణపతియునైనచో నామె సంతాన మంతయు నటులనే యగుటయు, తల్లి విద్యావతియు సద్గుణవతియునైనచో నామె సంతానముమిక్కిలి యోగ్యతను గాంచగల్గుటయు సహజము .”

(స్త్రీ విద్య – బండారు అచ్చమాంబ). తెలంగాణ పదాలు…

‘కౌలు’ అనే పదం కేవలం నిజాం రాష్ట్రాంధ్ర ప్రాంతం (తెలంగాణ)లోనే వాడుకలో ఉండేది. భూస్వామ్య విధానం పూర్తిగా తెలంగాణా ప్రాంతంలోనే నిండి ఉంది. దశలవారీగా వ్యవసాయభూమిని రైతు కూలీలు దుక్కి దున్నడమనే పద్ధతి, ‘కౌలు’ అన్న పదప్రయోగం ‘సత్పాత్రదానము’ కథలో కనిపిస్తుంది.

‘కౌలు’ అనే పదం కేవలం నిజాం రాష్ట్రాంధ్ర ప్రాంతం (తెలంగాణ)లోనే వాడుకలో ఉండేది. భూస్వామ్య విధానం పూర్తిగా తెలంగాణా ప్రాంతంలోనే నిండి ఉంది. దశలవారీగా వ్యవసాయభూమిని రైతు కూలీలు దుక్కి దున్నడమనే పద్ధతి, ‘కౌలు’ అన్న పదప్రయోగం ‘సత్పాత్రదానము’ కథలో కనిపిస్తుంది.

“అక్కడ’ అనేదానికి బదులుగా ‘ఆడ’ అని, ‘కడుపు నింపుకొనెదరు’ అనేబదులు ‘పొట్ట నింపుకొనెదరు’ అనే మాటలు కేవలం తెలంగాణ మాండలికంలోనే కనిపిస్తాయి. ‘కచ్చె’ అంటే ‘మొండి’, ‘పూర్వము నీవంటి

యొక కచ్చెపిల్ల యుండెను’ అని ‘దంపతుల ప్రథమ కలహము’ కథలోని వాక్యప్రయోగం. కథకు వికృతి కచ్చె, కక్ష సంస్కృత నామం. ‘కచ్చె’ అనేది తెలంగాణ పదం – ‘నీయబ్బ సొమ్మా’ అన్నది కూడా తెలంగాణ పదప్రయోగం. ‘ఈ తేప’ అంటే ఏడాది (సంవత్సర కాలం), ఉత్త అంటే ఏమీ లేక కేవలం’ అనే అర్థంలో మనం ఉపయోగిస్తాం. ఇవి అచ్చమైన తెలంగాణ పదాలు.

మాటకు ముందు ‘మంచిది’ అని వాడటం తెలంగాణ వారికి అలవాటు. ఈ ఊతపద ప్రయోగం అచ్చమాంబ కథల్లో కనిపిస్తుంది. ‘మంచిది కాని నేను పంపిన పుస్తకములు నీకు ముట్టినయి గదా!’, ‘మంచిది మొట్టమొదట నీవు వెక్కిరించి…’ ఇందులో ‘ముట్టినయి’ అనేది తెలంగాణ పదం. ‘ఒకసారి’కి బదులు ‘ఒకపారి’ అని ఉపయోగించారు. ‘ఒకపారి’ అనే పదం తెలంగాణ వ్యాప్తిలో ఉంది.

ఇక ‘వెళ్లుట’ అనే దానికి బదులు ‘పోవుట’ అని వాడటం దాదాపు అన్ని కథల్లో కనిపిస్తుంది. పోయెను, పోవుచుండెను, దగ్గరికిపోయి, అచ్చటికి పోయిన పిమ్మట, పనికి పోవుచుండెను, పోవుచుండగా – అనే రూపాలు ప్రతికథల్లో ఉన్నాయి. ఈ ఆధారాలన్నింటిప్రకారంగా తెలంగాణ నుంచే తొలి కథానిక వెలువడిందని, తొలి తెలుగు కథా రచయిత్రి ‘భండారు అచ్చమాంబ’ అని ధ్రువీకరించి. కథా చరిత్రను తిరగరాయచ్చు. స్త్రీల చరిత్రా గ్రంథం…

నాటి కాలంలో విద్యావంతులైన స్త్రీలు సమాజపు కట్టుబాట్లను, పతివ్రతా ధర్మాలను చాటిచెప్పే వృత్తాంతాలను తీసుకొని రచనలు చేశారు. కాని అచ్చమాంబ అభ్యుదయ మార్గంలో ఆలోచించి, ప్రాచీనమైన పతివ్రతా ధర్మాలతో పాటు నవీన పాశ్చాత్యవిద్యాసంస్కారాలను కలబోసి ఒక నూతనమైన పద్ధతిలో రచనా వ్యాసంగాన్ని ఆరంభించారు. అచ్చమాంబ జీవిత చరిత్ర రచించిన పులుగుర్త లక్ష్మీనరసమాంబ, అచ్చమాంబనొక ఆదర్శ మహిళగా అభివర్ణించడంలో ఈ విషయం తెలుస్తుంది. మొసటికంటి రామాబాయమ్మ సంపాదకత్వంలోవెలువడిన ‘హిందూ సుందరి’ పత్రికలోనూ, పులుగుర్త లక్ష్మీ నరసమాంబ సంపాదకత్వంలో వెలువడిన ‘సావిత్రి’ పత్రికలోనూ అచ్చమాంబ రచనలు చాలా అచ్చయ్యాయి. అచ్చమాంబ 1901లో రచించిన ‘అబలా సచ్చరిత్ర రత్నమాల’ అన్న గ్రంథంలో ప్రసిద్ధ భారతీయ స్త్రీల కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేశారు. ధీర, వీర వనితల ఉదాత్త చరిత్రల వ్యాస సమాహారం ఇది. ఈ గ్రంథం ఆనాటి మహిళల్లో స్పూర్తిని, రచనా ప్రేరణను కలిగించింది. – ప్రప్రథమంగా తెలుగు భాషలో స్త్రీల చరిత్రను రచించినవారుగా గణతికెక్కారు. ఆమెలో గల

నిర్మొహమాటం, సూటిదనం, జాతీయ తాగుణం ఈ గ్రంథం ద్వారా ప్రదర్శితమౌతుంది.

పురుషుల కంటే స్త్రీలు ఎందులోనూ _ తీసిపోరు, నిర్లక్ష్యానికి, నిరాదరణకు,

అణచివేతకు గురైన స్త్రీలు లోకజ్ఞానం | లేక, విద్యలేక ఇళ్లలో మగ్గిపోయారు అంతే తప్ప శారీరకంగా, మానసికంగా, మేధోపరంగా వారు ఎందులోనూ తక్కువ కాదు’. అనే అభిప్రాయాన్ని చాలా స్పష్టంగా, బలంగా వందేళ్ళకు ముందే వెల్లడించారు అచ్చమాంబ. అతి పిన్న వయసులో ఆమె చేసిన కృషి అద్వితీయం. అమోఘం.

ఆమె జీవించింది ముప్పయ్యేళ్ళు. ఊహ తెలిసి, లోకం పోకడ తెలుసుకునే సరికి పదిహేనేళ్ళు పడుతుంది. మిగతా పదిహేనేళ్ళకి ఒక బృహత్ప్రణాళికకు రూపమివ్వడం మామూలు విషయం కాదు. ‘అబల సచ్చరిత్ర రత్నమాల’ అనే గ్రంథం మూడు సంపుటాలుగా వెలువరించాలని ఆమె అనుకున్నారు. భారతీయ మహిళా రత్నాల జీవిత చరిత్రలు మొదటి సంపుటంలో పొందుపరిచారు. వేద పురాణాలలోని మహిళల ఔన్నత్యం, రెండవ సంపుటిలో, ఇతర దేశాల మసన్నత మహిళల గూర్చి మూడవ సంపుటిలో రాయాలనుకున్నారని స్త్రీదరహాసం దోచిన ఇతిహాసం అనే పుస్తకాన్ని రచించిన దేవరాజు మహారాజు తెలియజేశారు. కాని ఆమె ముప్పయవ ఏట అనారోగ్యానికి గురి అయ్యారు. చాలా కాలం వరకు కోలుకోలేని స్థితిలో ఉన్నారు. చివరకు మరణించడం వల్ల ఆమె పథకంపూర్తికాలేకపోయింది. చాలా వరకు విషయ సేకరణ జరిగినా; పరిశోధన, విశ్లేషణ పూర్తయినా రాయాల్సిన దశలో ఆమె కన్నుమూయడం దేశానికి, సమాజానికి ఎంతో లోటు జరిగిందనే చెప్పాలి. ఒక్క సంపుటియే వెలువరించిన ఆమె తొలిచరిత్ర కారిణిగా, తొలి మహిళా చరిత్ర కారిణిగా నిలిచిపోయింది.

మొట్టమొదటిసారిగా మహిళల చరిత్రను రికార్డు చేసిన మహిళా చరిత్రకారిణిగా ప్రసిద్ధిచెందారు. ‘అబల సచ్చరిత్ర రత్నమాల’మహిళల జీవితాలను ఆవిష్కరించారు. దీనికోసం పంజాబ్, కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్, బెంగాల్, మహారాష్ట్ర, ఆంధ్రాప్రాంతాలు పర్యటించారు. అక్కడి విశిష్ట మహిళల జీవితాలను గూర్చి ఈ పుస్తకంలో వెల్లడించారు. పండిత రమాబాయి, హర్‌దేవి, కాశీబాయి కనిత్కర్, కమలా సత్యానందన్, కొటికలపూడి సీతమ్మ వంటి వారినెందరినో ఆమె పరిచయం చేశారు. మహిళల జీవితాలను పరిచయడం చేయడంలో అచ్చమాంబ రచన చాలా సరళంగా సాగింది. ఆమె వాస్తవాల్ని చాలా ఖచ్చితంగా నమోదు చేశారని విమర్శకులు, ఇతర చరిత్రకారులూ అభిప్రాయపడ్డారు.

స్త్రీ సమాజం స్థాపన…స్త్రీ సమాజం స్థాపన…స్త్రీ సమాజం స్థాపన…

ఒకవైపు రచన, మరోవైపు స్త్రీ జనోద్ధరణ జీవిత ధ్యేయాలుగా ఎంచుకున్నారు అచ్చమాంబ. ఓరుగంటి సుందరి రత్నమాంబతో కలిసి 1902లో మచిలీపట్నంలో ‘బృందావన స్త్రీ సమాజం’ నెలకొల్పారు. తెలుగు ప్రాంతంలో అదేమొదటి స్త్రీ సమాజం! ఒక సంవత్సర కాలంలోనే 1903లో రాష్ట్రం నలుమూలలా తిరిగి, వివిధ ప్రాంతాలలో ‘బృందావన స్త్రీ సమాజం’ శాఖలు తెరవడానికి కృషి చేశారు. ఆమె ఇంట్లో చదువుకునే అనాథ పిల్లలు ఎప్పుడూ నలుగురైదుగురు ఉండేవారు.

స్త్రీ చైతన్యం కోసం అచ్చమాంబ ఎంతగానో పాటుపడ్డారు. తెలుగు దేశమంతటా పర్యటించి మహిళాభ్యు దయం పైన ఎన్నో ఉపన్యాసాలు చేశారు. బందరులో, కాకినాడలో ‘బృందావనీ స్త్రీ సమాజము’ పేరుతో స్త్రీల సమాజాన్ని స్థాపించారు. ముట్నూరు కృష్ణారావు, కొండా వెంకటప్పయ్య వంటి వారు ఆమె కృషిని ప్రశంసించారు. గొప్ప సంఘసేవకురాలుగా పేర్గాంచారు. సమాజ సేవ చేసే క్రమంలో ప్లేగువ్యాధి గ్రస్తులను సంరక్షిస్తూ, అదే వ్యాధికి గురై అచ్చమాంబ 1905లో మరణించారు. తన ముప్పైయేటలోనే అచ్చమాంబ మరణించడం విచారకరం. నిలిచిపోయిన రచన ఖన…

అచ్చమాంబ రచనల్లో నేటికీ నిలిచిపోయిన మరో రచన ‘ఖన’. ఖగోళ శాస్త్రవేత్త మిహిరుడి భార్య ఖన. ఆమె మిహిరుడంతటి ప్రజ్ఞాశాలి. పురుషాధిక్య ప్రపంచం ఆమెకు సరైన గుర్తింపు నివ్వలేదన్న వ్యధతో అచ్చమాంబ ఎన్నో ఆధారాలు సంపాదించి, పురాతన గ్రంథాలు శోధించి ఖగోళ శాస్త్రజ్ఞారాలైన ఖన జీవితాన్ని వెలుగులోకి తెచ్చారని, స్త్రీ ఆత్మ గౌరవాన్ని ఇనుమడింపజేశారని కొందరు పరిశోధకులు, విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.

అలభ్య రచన – శతకం…

అచ్చమాంబ ఒక శతకం రాశారు. కాని అది ఈ తరానికి అందలేదని దేవరాజు మహారాజు తెలిపారు.భండారు అచ్చమాంబ నాడు సామాజికంగా ఉన్న అవరోధాలెన్నింటినో దాటారు. ఆధునిక భావజాలంతో రచనా వ్యాసంగాన్ని ప్రారంభించారు. కథా వస్తువులో నవ్యతను తీసుకొచ్చారు. ముఖ్యంగా స్త్రీ చైతన్యాన్ని కాంక్షించారు. అనేక స్త్రీ అభివృద్ధి కార్యకలాపాలలో పాల్గొన్నారు. స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ సమానత విద్యతోనే సమకూరుతుందని గ్రహించారు. కథా నిర్మాణంలో ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తొలి తెలుగు కథా రచయిత్రిగా నిలిచిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com