నోబెల్ సాహిత్య బహుమతి 2015- స్వెత్లానా అలెక్సీవిచ్‌

బెలారస్ కు చెందిన రచయిత్రి స్వెత్లానా అలెక్సీవిచ్‌, 2015 వ సంవత్సరంలో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి గెలుచుకుంది. ఆమె రచించిన ‘ఎ మాన్యుమెంట్స్ టు సఫరింగ్ అండ్ కరేజ్ ఇన్ అవర్ టైం’ అనే పుస్తకం నోబెల్ ను తెచ్చి పెట్టింది. ఈమె పుస్తకాలు దాదాపు 19 దేశాల్లో ప్రచురితమయ్యాయి. జర్నలిస్టుగా కెరీర్ ను ప్రారంభించిన స్వెత్లానా అలెక్సీవిచ్‌, యుద్ధ బాధితుల వెతలను ప్రపంచానికి చూపించటమే లక్ష్యంగా పనిచేశారు. ముఖ్యంగా మహిళల దయనీయ పరిస్థితులే కథా వస్తువులుగా పలు పుస్తకాలు రాశారు. ‘ది అన్ ఉమెన్లీ ఫేస్ ఆఫ్ ది వార్’ స్వెత్లానా అలెక్సీవిచ్‌ యొక్క మొదటి రచన. స్వెత్లానా అలెక్సీవిచ్‌ రచించిన ద లాస్ట్‌ విట్నెసెస్‌, జింకీ బాయ్స్‌ – సోవియట్‌ వాయిసెస్‌ ఫ్రమ్‌ ద అఫ్ఘానిస్థాన్‌ వార్, ద చెర్నోబిల్‌ ప్రేయర్‌ – ఎ క్రానికల్‌ ఆఫ్‌ ఫ్యూచర్‌ పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయి.

జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత 2013 కేదార్‌నాథ్‌ సింగ్

ప్రముఖ హిందీ కవి కేదార్‌నాథ్ సింగ్ కు 2013 లో జ్ఞాన్ పీఠ్ అవార్డు లభించింది. కేదార్‌నాథ్‌ సింగ్ రచించిన ‘అకల్ మే సరస్’ కు గాను ఈ పురస్కారం లభించింది. ఉత్తర ప్రదేశ్ లో జన్మించిన కేదార్‌నాథ్‌, తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నే తన కవిత్వానికి వస్తువుగా మలచుకుని అనేక రచనలు చేశారు. తన చుట్టూ ఉన్న పదజాలాన్నేకవితా భాషగా స్వీకరించి ప్రజల భాషను సజీవంగా నిలబెట్టారు. కేదార్‌నాథ్‌ ప్రతి రచనలో సమాజంలోని వైరుధ్యాలు, వివిధ ప్రజాస్వామ్య ఉద్యమాల ఆకాంక్షలు ప్రతిబింబిస్తాయి. ‘అభిబిల్కులే అభి’, ‘జమీన్ పక్ రహీ హౌ’, ‘అకల్ మే సారస్’, టాఘ్ కేదార్‌నాథ్‌ సింగ్ ప్రముఖ రచనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com