America in the World

ప్రపంచంలో అగ్రదేశం అనగానే వెంటనే గుర్తొచ్చే పేరు అమెరికా. అనేక దశాబ్దాలుగా ఆర్థిక, సాంకేతిక, సైన్య విభాగాల్లో అన్ని దేశాల కంటే ముందుంది యూఎస్ఏ. దీంతో అమెరికా లాంటి దేశం యొక్క విదేశాంగ విధానాల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటం సహజం. అమెరికా విదేశాంగ విధానాలు, దౌత్య సంబంధాల గురించి America in the World: A History of U.S. Diplomacy and Foreign Policy పుస్తకంలో వివరించారు రచయిత రాబర్ట్ జోలిక్. గత రెండు వందల సంవత్సరాలుగా, యూఎస్ఏ అవతరణ నాటి నుండి నేటి వరకు అమెరికా ఇతర దేశాలతో వ్యవహరించిన విధానం, ముఖ్యంగా విదేశాంగ విధానాలను ప్రభావితం చేసిన అంశాలను రచయిత ఈ పుస్తకంలో వివరించారు.

Azim Premji: The Man Beyond the Billions

అజీమ్ ప్రేమ్‌జీ, భారతదేశపు అతిపెద్ద సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఒకటైన విప్రో సంస్థకు అధినేత. వంటనూనెల ఉత్పత్తి సంస్థ నుండి వేల కోట్ల రూపాయల విప్రో సామ్రాజ్యం వరకు అజీజ్ ప్రేమ్ జీ అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారు. అజీజ్ ప్రేమ్ జీ సుదీర్ఘ పారిశ్రామిక ప్రయాణం గురించి Azim Premji: The Man Beyond the Billions పుస్తకంలో వివరించారు రచయితలు సందీప్ ఖన్నా, వరుణ్ సూద్. అజీజ్ ప్రేమ్ జీ వ్యక్తిత్వానికి సంబంధించిన అనేక రకాల ఆసక్తికరమైన అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. అజీమ్ ప్రేమ్‌జీ దాతృత్వం, వ్యాపారంలో చిన్న చిన్న తప్పిదాలు, ఇతరులతో ప్రవర్తించే విధానం వంటి అనేక విషయాలను రచయితలు ఇందులో వివరించారు.

Portraits of Power

భారతదేశ పరిపాలనా వ్యవస్థలో ఐఏఎస్ అధికారులది ప్రత్యేక స్థానం. Portraits of Power పుస్తకం ద్వారా ఒక ఐఏఎస్ అధికారిగా తన స్వీయ చరిత్రను రాశారు మాజీ బ్యూరోక్రాట్ ఎన్ కే సింగ్. తన వ్యక్తిగత జీవితం, కుటుంబం నుండి ప్రారంభించి, సివిల్ సర్వీస్ అధికారి వరకు అనేక అంశాలను ఎన్ కే సింగ్ ఇందులో వివరించారు. గత 50 సంవత్సరాలుగా దేశ విధాన రూపకల్పనలో తాను పాలుపంచుకున్న అనేక సంఘటనలు ఇందులో సవివరంగా పొందుపరిచారు. అంతేకాదు ఒక సివిల్ సర్వీస్ అధికారిగా తాను ఎదుర్కొన్న ఒత్తిళ్లు, ఐఏఎస్ లపై రాజకీయాల ప్రభావం వంటి వాటిని సైతం ఈ పుస్తకంలో వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com