తెలియకుండానే ఒక వెన్నెల నీడ

తోడునీడగా వెన్నంటి వుంటుంది

కనిపించని ప్రాణవాయువు వీచిక

గుండెను చుట్టుకొని కాపలా కాస్తుంది

అనుభవం విలువై విలువ సుభాషితమై

సమాజానికి మార్గనిర్దేశం చేస్తుంది

మూడు అక్షరాల్లో చెప్పుకుంటే- సంస్కృతి

అక్షర సత్యంగా విప్పుకుంటే-జీవన రీతి

మతమౌఢ్యం కాదు గతాల మధ్య వారధి

చీకటి కుడ్యం కాదు మానవత్వ సన్నధి

మనోలోకాన్ని వెలిగించే హారతి

కాల లోలకాన్ని కదిలించే జాగృతి

సామాన్యుని రక్షణలో సదాపారుతున్న

అనాది జీవనది అదే మానవ సంస్కృతి

                                    -అమ్మంగి వేణుగోపాల్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com