-పప్పుల రాజిరెడ్డి 9652215043,

చానా రోజులైంది వాళ్ళు మాతృదేశం విడిచి

గంటల కొద్ది ప్రయాణం చేసి

గాలివాహనంపై రానే వచ్చారు

పచ్చని మర్రి చెట్టుపై పక్షుల సందోహంలా యిల్లు

ఆత్మీయ ఆలింగనమై

చానాళ్ళ కలువలేని తనాన్ని గాలికి వొదిలి

సంతోషాల సంబరమయ్యారు

మాబిడ్డ, వారి పెనిమిటి, చిచ్చర పిడుగుల్లాంటి పిల్లలు

ఇప్పుడిల్లంతా అల్లరల్లరి ఆటలతో పాటలలో

కవ్వింపులతో, కయ్యాలతో, పంతాలతో, పట్టింపులతో

బొమ్మలతో చిందరవందర

చింపిన దిన పత్రికలతో అంగడంగడి ఆగమాగం

సగం రాసిన కాపీలు స్వేచ్ఛ గీసిన చిత్రాలు

పలకా బలపాలు తీరికలేని పిచ్చి గీతలు

తినుబండారాల ఆప్షలు, సాధకుల వ్యూహాలు

సెల్లు ముందుంటేనే బువ్వ తినటాలు అలగటాలు

ఆర్భాటాలు, తిక్క తిక్కవేషాలు

గోడలపై అర్ధం కాని నైరూప్య చిత్రాలు

కలాల ముక్కలు, స్కెచ్ పెన్సిల్ వక్కలు

రంగులు రుద్దిన కాయిదాలు ఇస్కుడిస్కుడు

నెలరాజులు నెల రోజుల్ని ఐస్ క్రీంలా లాగించారు.

మళ్లీ పయనం దేశం గాని దేశం వీసా అల్లారం

సర్దుకోవాలి. కుదుటపడాలి సమాయాత్తమవ్వాలి

రంధిపడే మనసును కళ్లల్లో దాచుకోవాలి

అనివార్యమైన లవణ సముద్రం ఈదాలి

బంధాలను వదిలి బతుకు గమ్యం కోసం భవిష్యత్తు కోసం

పయనమవ్వాలి

కాలం వాకిట్లో హవామ జహాజ్ ఎదురు చూపు

ఇల్లంతా నిశ్శబ్దం

మస్తిష్కంపై టన్నుల కొద్ది మౌనం బరువు

రెక్కలొచ్చి పక్షులు గూడొదలిన తర్వాత

యింట్లో ఇద్దరమే పేర్చిన పుస్తకాల షెల్పులు

టీపాయ్ కింద తేదీల వారీగా దినపత్రికలు క్యూ

చెక్కు చెదరని బొమ్మలు గూట్లో పటాలు మెమెంటోలు

యిస్తే బట్టల్లా సోఫాలు కుర్చీలు

పిల్లలు లేని ఇల్లు పక్షులు లేని గూడు

కరంటు లేని వేసవి రాత్రి సెలవులున్న బడి

సెల్లు లేని రేడియో, కేబుల్ లేని టి.వి,

నిశ్శబ్ద విస్పోటనంలో గాయపడ్డ మనసు పెట్టలమై

వెంట రొంటరిగా మేం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com