“తెలుగు సాహిత్యం-రైతాంగ సమస్యలు” అంశంపై జాతీయ సదస్సు

ప్రజా స్వామిక రచ యి త్రు ల వేదిక ఆరో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ,పింగిలి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్ధుల సంఘం హనుమ కొండ వారు సం యుక్తం గా మార్చి 7 &8 తే దీ లలో “తెలుగు సాహి త్యం- రైతాంగ సమస్యలు” అనే అంశంపై జాతీయ స దస్సు నిర్వహించారు. ఈ సదస్సు లో రైతులకు సంబంధించిన వివిధ పోరాటాలను,మహిళలు పురుషులకు ధీటుగా పోరాడిన తీరును, ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రైతు పోరాటాన్ని ప్రస్తావించారు. ప్రారంభ సమావేశవేదికపై ప్రముఖ రచయిత విమర్శకుడు శ్రీ అల్లం రాజయ్య, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత శ్రీ అంపశయ్య నవీన్, కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ రవి, పూర్వ విద్యార్థుల సంఘ కన్వీనర్ శ్యామల ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక తెలంగాణ కార్యదర్శి కాత్యాయని విద్మహే పాల్గొన్నారు. రెండు రోజుల ఈ సదస్సులో మొత్తం ఐదు సమావేశాలు జరిగాయి.

‘గుప్పెటలో గోదారి” కథల సంపుటిని ఆవిష్కరించిన కవిత

అక్షరయాన్ ఉమెన్ రైటర్స్ ఫోరం వారి వెబ్ సైట్ ప్రారంభోత్సవ సందర్భంగా ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మీ ‘గుప్పెటలో గోదారి” కథల సంపుటిని శ్రీమతి కవిత ఆవిష్కరించారు. రచయిత్రి ఆకెళ్ళ వెంకట సుబ్బలక్ష్మి, రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి తదితరులు ఉన్నారు.

‘సృజన’ సాహితీ సమాఖ్య తరఫున కవి డాక్టర్ దామెర రాములు దంపతులను జీవన సాఫల్యపురస్కారం

ఖమ్మం జిల్లాసత్తుపల్లిలో 24.1.21 ఆదివారం ‘సృజన’ సాహితీ సమాఖ్య తరఫున ప్రముఖ కవి డాక్టర్ దామెర రాములు దంపతులను జీవన సాఫల్యపురస్కారంతో సన్మానిస్తున్న సత్తుపల్లి శాసనసభ్యులు గౌరవ సండ్ర వెంకట వీరయ్య మరియు సంస్థ సభ్యులు.

హన్మకొండలో మహావైభవంగా అష్టావధానం

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారంన హన్మకొండలోని భద్రుక కామర్స్ డిగ్రీ కళాశాలలో అష్టవధాన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ లేఖ సాహితీ సంస్థ ఆధ్వర్యములో డా.టి.రంగస్వామి అధ్యక్షతన శతవధాని, అవధాన కళానిధి శ్రీ ఆముదాల మురళి పృఛ్చకులు అడిగిన వాటికి ఆహ్లాదకరంగా అష్టావధానం చేశారు. అష్టావధానికి, పృచ్చకులకు కళాశాల యాజమాన్యం శాలువా, మెమెంటోలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా కంది శంకరయ్య, ఎన్ రవిందర్, కళాశాల కరస్పాడెంట్ యస్ ఎన్ మనోజ్ మరియు కవులు, రచయితలు, సాహీతీమూర్తులు హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com