
డా.మంగళగిరి శ్రీనివాసులు రచించిన గ్రంథము ఆవిష్కరణ
డా.మంగళగిరి శ్రీనివాసులు రచించిన ఆంధ్ర(నేటితెలంగాణ ) సారస్వత పరిషత్తు – తెలుగు భాషా సాహిత్య సేవ అను పరిశోధన గ్రంథము ఆవిష్కరణ సభలో ఎడమ నుండి కుడికి
శ్రీ బడేసాబ్, డా.జుర్రు చెన్నయ్య,ఆచార్య ఎన్ ఆర్ వెంకటేశం, ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, డా. కె వి రమణా చారి,రచయిత డా. మంగళగిరి శ్రీనివాసులు, మంత్రి రామారావు, మన్నేమోని కృష్ణయ్య గార్లు ఆవిష్కరించారు.
దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి సంస్మరణ సభ

నవంబర్ 1 రోజు దేవులపల్లి కృష్ణశాస్త్రి జయంతి సందర్భంగా అక్టోబర్ 31 న జూమ్ సభ జరిగింది. ఓలేటి పార్వతీశం, వడ్డేపల్లి కృష్ణ, నిడమర్తి నిర్మలాదేవి, అలగా కృష్ణమోహన్, దేవులపల్లి సాహితీ మూర్తి మళ్యాన్ని విశ్లేషించారు.
డాక్టర్ కాంచనపల్లి గో.రా.

ఉదయం 10.30 ని.లకు చైతన్య విద్యానికేతన్ హైస్కూల్ మగ్దుం నగర్, జగద్గిరి గుట్టలో డా.కుర్మాచలం శంకరస్వామి రచించిన మబ్బుల మాటు కవితా సంపుటి ఆవిష్కరణ జరిగింది. కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు కే.పి.వివేకానంద గారు గ్రంథాన్ని ఆవిష్కరించగా, ప్రముఖ కవి తిరునగరి అధ్యక్షత వహించారు. వక్తలుగా నేటి నిజం ప్రధాన సంపాదకులు బైస దేవదాసు, కాంచనపల్లి గో.రా., అశ్వాపురం వేణు, నూధవ్ ప్రబృతులు హాజరయ్యారు.
తాత్విక చింతనతోనే గొప్ప కవితా శిల్పం….డాక్టర్ కాంచనపల్లి గో.రా.
సమాజ హితాన్ని కోరుకునే తాత్విక త, ఉత్తమ వ్యక్తిత్వం కలిగిన కవుల నుంచే అసలు సిసలైన కవితా శిల్పం రూపుదిద్దుకుంటుందని ప్రముఖ సాహితీ వేత్త తంగేడు పక్ష పత్రిక అసోసియేట్ ఎడిటర్ డాక్టర్ కాంచనపల్లి గోవర్ధన రాజు అన్నారు. తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం రాత్రి జూమ్ ద్వారా జరిగిన 90వ ఎన్నీల ముచ్చట్లు వెబినార్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. “వచన కవిత్వం-రచనా మెలకువలు” అంశంపై కాంచనపల్లి విస్తృతమైన ప్రసంగం చేశారు. కవిత్వ నిర్మాణ పద్ధతులను సోదాహరణంగా వివరించారు. కవితా వస్తువు ఎంపిక, శీర్షిక కూర్పు, ఎత్తుగడ, నిర్వహణ, ఆలోచనాత్మక ముగింపుల గురించి విశ్లేషించారు. నిత్య అధ్యయనం అభ్యాసాలతోనే కవితా రచనా శక్తి అలవడుతుందన్నారు. కవులు చదవడం, రాయడం సమాంతరంగా కొనసాగించినపుడే మేలైన కవిత్వం ఉద్భవిస్తుందని తెలిపారు. ఇటీవలి కాలంలో తెలంగాణ సారస్వత పరిషత్ అచ్చేసిన “వచన కవిత్వం-వస్తు శిల్పాలు” పుస్తకాన్ని కొత్తగా కవిత్వం రాస్తున్నవారు తప్పనిసరిగా చదువాలని సూచించారు. కొత్త కవులను తీర్చిదిద్దాలనే సదుద్దేశ్యంతో ఎనిమిదేండ్లుగా ఎన్నీల ముచ్చట్లు కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రతి నెలా పౌర్ణమి రోజున నిర్వహిస్తున్న తెలంగాణ రచయితల వేదికను కాంచనపల్లి గోవర్ధన రాజు అభినందించారు. అనంతరం ప్రశ్నోత్తరాల కార్యక్రమం జరిగింది. కాంచనపల్లి గోవర్ధన రాజు ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా, ఆలోచనాత్మకంగా సాగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గాజోజు నాగభూషణం, అన్నవరం దేవేందర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి కూకట్ల తిరుపతి, బూర్ల వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు కందుకూరి అంజయ్య, చీకోలు సుందరయ్య తదితరులు పాల్గొన్నారు. సుమారు ముఫ్ఫై ఐదు మంది కవులు వర్తమాన పరిస్థితులపై కవితా గానం చేసారు.