
ప్రసిద్ధ హిందీ సాహితీవేత్త కృష్ణ సోబ్తి 2017లో ప్రతిష్ఠాత్మక జ్ఞాన్ పీఠ్ అవార్డుకు ఎంపికయ్యారు. అన్ని రకాల సవాళ్లను ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉండే సాహసోపేత వ్యక్తులను సోబ్తి తన కథల్లో సృష్టించారు. నూతన రచనారీతులతో ప్రయోగాలు చేయటంలో ఆమె రచనలు పేరు పొందాయని జ్ఞానపీఠ్ కమిటీ సోబ్తిపై ప్రశంసలు కురిపించింది. హిందీ, ఉర్దూ, పంజాబీ సమ్మిళిత సంస్కృతి ఆమె రచనల్లో, భాషలో కనిపిస్తుంది. నవలా రచనలో సోబ్తి ఎన్నో వినూత్న అంశాలను, నూతన మార్గాలను నిర్మించారు.
హిందీ, ఉర్దూ, పంజాబీ సమ్మిళిత సంస్కృతులని మేళవించి ఆమె రచించిన ‘జిందారుఖ్’ నవలకు సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ‘యాదోంకెయార్’ ,’తిన్ పహార్’, ‘ఎ లడ్ కీ’ ఎంతో పేరు తెచ్చిన నవలలు. 1979లో తన తొలి రచన ‘జిందగీనామా’ కు పొడిగింపుగా ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ పేరిట ఇంకా చిన్న నవల రాసి ఈ రెండు కలిసి ‘జిందారుఖ్’ గా ప్రకటించారు. ఈ నవలకు జ్ఞానపీఠ్ అవార్డు వచ్చింది.