
జీవితంలో విజయం సాధించడం ఎలా.. ? ఉన్నత శిఖరాలను అధిరోహించడం ఎలా అనే అంశాలపై చాలా మంది పుస్తకాలు రాశారు. అయితే వైఫల్యాల నుండి, తిరస్కారాల నుండి తేరుకుని, తిరిగి విజయబాట పట్టడం ఎలా అనే అంశంపై పుస్తకాలు రాశారు రచయిత అంబి పరమేశ్వరన్. వైఫల్యాలు ఎదురైనప్పుడు ఎలా స్వీకరించాలి, తిరిగి విజయాలను ఎలా సాధించాలి అనే విషయాలను Spring: Bouncing Back from Rejection పుస్తకంలో వివరించారు రచయిత అంబి పరమేశ్వరన్.
రచయిత తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంలోని అనుభవాల నుండి వివిధ కథలను, సంఘటలను ఈ పుస్తకంలో పొందుపరిచారు. ఒలింపిక్ అథ్లెట్లు, రిటైర్డ్ ఐఎఎస్ ఆఫీసర్లు, ప్రఖ్యాత విద్యావేత్తలు మరియు అనుభవజ్ఞుడైన సిఇఒ కోచ్లు యొక్క కథలను ఇందులో ఉదాహరణలుగా వివరించడంతో పాఠకులకు ఎక్కువ ఆసక్తి కలుగుతుంది. విజయమార్గంలో అసంఖ్యాక తిరస్కరణలను ఎదుర్కొన్న అనేక మంది ప్రముఖ వ్యక్తుల గురించి రచయిత ఈ పుస్తకంలో వివరించారు.