(నవనాథ చరిత్రము గౌరన)

గౌరన నవనాథ చరిత్రములో ఒక ఘట్టములో

వర్ణించిన గొల్ల రూపము. సిద్దేంద్రనాథుడు, గోకరనాథుడు వంటి నవనాథుల చరిత్రమును

గౌరన ద్విపదలో రాశాడు. శివుడు పరమదైవంగా భావించినా విగ్రహపూజలు కాకుండా యోగమార్గంలో సిద్ధిపొందడమే వీరి ‘తత్త్వము. వీరిని సిద్ధులు అనికూడా అంటారు.

అందులో ఒకచోట వర్ణించిన ఒక గొల్లడు, పర్వత ప్రాంతంలోకి వెళ్ళినపుడు గుహలో ఒక కాంతి చూసి సిద్దుడుగా మారిన సందర్భంలో పై వర్ణన. ఈ కవి క్రీ.శ. 1380-1450 ప్రాంతం వాడు. తల్లి పోచాంబ. తండ్రి అయ్యలామాత్యుడు. రాచకొండవాసి. తన పెదతండ్రి పోతరాజు సింగయనాయకుడు అనే రాజు వద్ద మంత్రి, గౌరన రాజాశ్రయం

పొందలేదు. నవనాథ చరిత్రము, హరిశ్చంద్రోపాఖ్యానము రాశాడు. సంస్కృతంలో లక్షణదీపిక రాశాడు. తన కావ్యాలను శ్రీశైల మల్లికార్జునునికి అంకితం చేశాడు. తెలుగులో పాల్కురికి సోమన తరువాత ద్విపదరూపంలో మంచి కావ్యాలు రాసిన కవి గౌరన. వర్ణనలు, సంభాషణలు, పద ప్రయోగాలు పలువురు పండితుల

ప్రశంసలందుకున్నాయి.

చక్కటింకొక గొల్ల చయ్యన వచ్చె

ఎక్కు పెట్టిన విల్లు నేర్చినయమ్ము

నీలిపాగయు మొల బెట్టిన పిల్ల

గ్రోలుమూపునిడుకొనిన గొడ్డలియు

నొసవుగా మునుగిద్ద నోరగొండియును

గీసిన గుదియము గెంపారు గురిజ

పూసల పేరును బొంగుగోలయును

గాసె దట్టియు మీద గదియ బిగించి

చుట్టిన యఱుత్రాడు సొంపారు చెంప

గట్టిన యెద్దుల కరుచ కొయ్యలును

మెఱుగు పింఛపు దండ మేటి బెబ్బులులు

కజవక యుండు వాకట్టు బదకెలు

మరువలు దిగకుండ మందులు వాడి

నెరయు చీరణములుంచిన తిత్తి

కుడి రొండి నొరవుగా గ్రుక్కిన చూచు

కొదువును నును జింక కొమ్మును జల్లి

చిక్కంబు దనకొప్ప సింగంబులట్టి

కుక్కలు తనవెంట కూడి యేతేర…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com