సాహిత్యంలో ఎగిసిన కెరటం…

ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిఖ్యాత రచయిత్రి టోనీ మారిసన్ అసలు పేరు చోలే ఆంటోని వాఫోర్డ్. హెూవార్డు లో ఉంటున్నప్పుడు “చోలే “” అన్న పేరును ప్రజలు తప్పుగా ఉచ్చరించడం మూలాన టోనీ గా మార్చుకుంది.

కానీ తర్వాతి కాలంలో తన పేరును అలా మార్చుకున్నందుకు చాలా పశ్చాత్తాపపడి చివరికి తనకు చోలే ఆంటోని వాఫోర్డ్ అనే పేరంటేనే ఇష్టమని చెప్పింది. టోనీ మారిసన్ ఫిబ్రవరి 18, 1931 లో అమెరికా లోని లోరినే లో జన్మించి అమెరికన్ సాహిత్యం లోని అనేక ప్రక్రియల్లో తనదైన సొంత శైలిలో రచనలు చేసి ఒక unique రచయిత్రిగా పేరు ప్రఖ్యాతులు గడించారు. . ఒక నవలాకారిణిగా , వ్యాసకర్తగా, ఎడిటర్ గా కాలేజీ లో ప్రొఫెసర్ గా రాణించారు. ఆమె మొదటి నవల ‘The Bluest Eye’ 1970 లో ప్రచురించబడింది. ‘Song of Solomon’ అనే రచనతో అంతరాతీయ సాహిత్య పియుల మరియు విమర్శకుల చే గుర్తిచబడి ‘National Book Critics’ అవార్డ్ ని గెలుచుకుంది. 1958 లో Harold Morrison తో టోనీ వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు Slade Morrison, Harold Ford Morrison.

టో నీ మారిసన్ హరోల్డ్ మారిసన్ తో 1964 లో విడిపోయింది. టో నీ మారిసన్ రాసిన ముఖ్య మైన రచనల్లో ‘The Bluest Eye’ 1970, ‘Sula’ 1973, ‘Song of Solomon’ 1977, ‘The Beloved’ 1987. ఆమె అన్నీ రచనల్లో crystal గా కనిపిచే అంశం అమెరికాలోని నల్లజాతి మహిళలు తమ రోజు వారి జీవితాల్లో ఎదుర్కొనే రకరకాల సమస్యలు. ఆమె తన రచనలతో వారి జీవితాలను ప్రభావితం చేయాలని , వాళ్ళు తన రచనలు చదివి వాళ్ళజీవితాల్లో ఎదురయ్యే సవాళ్లను యెదుర్కొనేందుకు వారి గుండెలనిండా ధైర్యం నింపే ప్రయత్నం చేసింది.

ఇంకో ముఖ్యమైన అంశం ఆ నల్లజాతి స్త్రీలు తమ నల్లజాతీయుల గుర్తిపుకోసం యెంత ధృడ సంకల్పంతో సమస్య లతో పోరాడుతూ ముందుకు సాగుతున్నారో తెలుస్తుంది .ముఖ్యంగా ఆమె ఉపయోగించే భాష ఆమె ఊహశాలీనత, రకాల మలుపులతో నిండిఉన్న కవిత్వ శైలి ఆమె రచనలకు వన్నె తెచ్చి ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డ్స్ రావడానికి దోహదపడినాయి. ఆమె రాసిన నవల ‘The Beloved’ కి 1987 పులిట్టర్ ప్రైజ్ వచ్చింది. అదే విదంగా ఆమె సాహిత్యానికి గుర్తింపుగా 1993 లో నోబెల్ ప్రైజ్ దక్కించుకున్న అమెరికన్ 8వ రచయిత్రిగా ఆఫ్రికన్ అమెరికన్ మొదటి రచయిత్రిగా ఆమె సాధించిన ఘనతగా చెప్పుకోవచ్చు. తర్వాత ఆమెకు US presidential Medal of freedom award కూడా దక్కింది.ఒకల్లజాతి మహిళగా తన తోటి నల్ల జాతి మహిళలు ఎలా సమాజంలో అవమానాలకు గురి అవుతున్నారో అతిదగ్గరగా చూసి రచనలు చేసిన నల్లజాతి రచయిత్రిగా

ప్రపంచ సాహిత్య చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది. తన రచనలన్నీ నల్ల అమెరికెన్ల కు జరుగుతున్న అన్యాయం గురించి, అక్కడున్న జాత్యహంకారం పోకడలకు వ్యతిరేకంగా నల్లఅమెరికలన్ల విముక్తి కోసం రాసినవే.

ఇక ఆమె విద్యాభ్యాసం లోరైన లోని Howard University లో 1953 లో ఇంగ్లీష్ సాహిత్యంతో B.A చేసింది.1955 లో Cornell University నుంచి Masters degree పొందింది.మారిసన్ చిన్నతనంలో అమెరికాలోని Midwest ప్రాంతంలో పెరగడం వల్ల నల్లవారి జీవితమన్న బ్లాక్ సంస్కృతి అన్న యెనలేని మమకారం పెరిగింది.ఆ సంస్కృతిలోని పాటలు పాడడం, కథలు వినడం చెప్పడం,జనపదకథలు వినడం వల్ల ఆమె సాహిత్యాన్ని అంతా ఒరిజినల్ గా రాయగలిగింది. కొంత కాలం టెక్సాస్ లో భోధన చేసి హైవర్డ్ యునివర్సిటి కెళ్ళి అక్కడ 1957 నుంచి 1964 వరకు సాహిత్యాన్ని భోధించారు.1965 నుంచి ప్రఖ్యాత రాండమ్ హౌస్ లో Fiction ఎడిటర్ గా పనిచేసి 1984 నుంచి Albany లోని State University of Newyork లో భోదించారు.1989 లో Princeton University పనిచేసి 2006 రిటైర్ అయ్యా రు. టోనీ మారిసన్ ప్రఖ్యాత నవల ‘The Bluest Eye’లో ఒక నల్లజాతి యుక్త వయస్సు మహిళతన చుట్టూ ఉన్న తెల్లవాళ్ళ అందాన్ని చూసి తాను అంతా అందంగా లేనని బాధ పడుతుంది. తన కళ్లు కూడా తెల్లవాళ్ళ కళ్ళలాగా నీలంగా ఉంటే బాగుండుననుకుంటుంది .మరో నవల ‘Sula’ లో రోజు రోజుకూ మారుతున్న సామాజిక కట్టుబాట్లను , స్నేహసంభందాలను narrate చేస్తుంది. ‘Song of Soloman identity crisis ఆధారంగా రాయబడింది. ‘Beloved ‘ నవలలో ఒక పారిపోయిన బానిస స్త్రీ తన సొంత బిడ్డనే చంపుకుంటుంది. ఎందుకంటే తన కూతురు బతుకు ఈ బానిస బతుకు రొంపిలో పడకూడదని. ఈ నవల 1998 లో చలనచిత్రంగా వచ్చింది. Oprah Winfrey లో ప్రధాన పాత్ర పోషించారు. టోనీ మారిసన్ ప్రతిభావంతమైన రచయిత్రే కాక అద్భుతమైన కవయిత్రి కూడా. కవయిత్రిగా రాసీలో తక్కువగా రాసినా వాసిలో మాత్రం ఆలోచనాత్మకమైన కవితల్ని అలారు. “Five poems” అనే శీర్షికతో కవిత్వసంకలనాన్ని వెలువరించారు.

తన జీవిత కాలమంతా అమెరికాలోని తన నల్లజాతివారి కోసం అంకితమై రచనలు చేసిన సాహితీమూర్తి టోనీ మారిసన్. సాహితీప్రియులందరు తప్పక చదవవలసిన రచయిత్రి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com