కంచెర్ల గోపన్న

దాశరథీ శతకము శ్రీరాముని ప్రస్తుతిస్తూ కంచర్ల గోపన్న 17వ శతాబ్దంలో రచించిన భక్తి శతకం.

ఈ శతకానికి దాశరథీ కరుణాపయోనిధీ అనే మకుటంఅన్ని పద్యాలలో చివరగా వస్తుంది. దాశరథీ అనగా దశరథుని పుత్రుడైనశ్రీరాముడు. భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620లో, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి,కామాంబ దంపతులకుజన్మించినాడు. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి,కీర్తించి, భక్త రామదాసుగా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధం. దాశరధి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము – ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథభట్టాచార్యులు.

శ్రీ రఘురామ చారుతులసీ – దళధామ శమక్షమాది శృం

గార గుణాభిరామ త్రిజ-గన్నుత శౌర్య రమాలలామ దు

ర్వార కబంధరాక్షస వి-రామ జగజ్జన కల్మషార్లవో

త్తారకనామ! భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

రంగదరాతిభంగ, ఖగ రాజతురంగ, విపత్పరంపరో

త్తుంగ తమఃపతంగ, పరితోషితరంగ, దయాంతరంగ స

త్సంగ ధరాత్మజా హృదయ సారసభృంగ నిశాచరాబ్దిమా

తంగ, శుభాంగ, భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

శ్రీ రఘువంశ తోయధికి శీతమయూఖుడవైన నీ పవి

త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్త మాధురీ

పూరితవాక్రసూనముల బూజలొనర్చెద జిత్తగింపుమీ

తారకనామ భద్రగిరి దాశరథీ! కరుణాపయోనిధీ!

శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవా

చార జనంబుగాగ విరజానది గౌతమిగా వికుంఠము

న్నారయ భద్ర శైలశిఖరాగ్రముగాగ వసించు చేతనో

ద్దారకుడైన విష్ణుడవు దాశరథీ! కరుణాపయోనిధీ!

భండన భీముడా ర్తజన బాంధవుడుజ్యల బాణతూణకో

దండకళాప్రచండ భుజ తాండవకీర్తికి రామమూర్తికిన్

రెండవ సాటిదైవమిక లేడనుచున్ గడగట్టి భేరికా

దాండడా దాండ దాండా నిన దంబులజాండము నిండమత్తవే

దండము నెక్కి చాటెదను దాశరథీ! కరుణాపయోనిధీ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com