గతంలో ఎన్నో వ్యాధులు ప్రపంచాన్ని ఇబ్బందులకు గురిచేసినా, ప్రస్తుత కరోనా మహమ్మారి వేగంగా, అత్యంత తీవ్రంగా ప్రపంచాన్ని ప్రభావితం చేసింది. వివిధ అంశాలు, వివిధ రంగాలతో పరస్పరం అనుసంధానమైన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ యొక్క బలహీనతలను కరోనా వైరస్ బహిర్గతం చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న వ్యవస్థలు, తిరిగి సాధారణ జనజీవనానికి సరిపడా ఉత్పత్తిని, పురోగతిని సాధించగలవా..అనే ప్రశ్న అందరి మెదళ్లనూ తొలుస్తుంది. ఒకవేళ సరిపడా పురోగతి సాధించని యెడలా, అల్ప స్థాయి వృద్ధితో, జీవనం సాగించడం ఎలా అనే అంశాల ప్రాతిపదికన ‘The Case for Degrowth’ పుస్తక రచన సాగింది.

వ్యవస్థల్లో వృద్ధి తిరోగమనంలో ఉన్నా, తక్కువ స్థాయి ప్రమాణాలతో ప్రజలు జీవనం సాగిస్తూనే.. సమానత్వం, సంతోషం, సహనం వంటి లక్షణాలతో సమాజం ఉండాలని రచయితలు ఈ పుస్తకంలో వివరించారు. ప్రస్తుతం సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఉన్న లోటుపాట్లను సైతం రచయితలు ఇందులో పొందుపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com