
జాతీయవాద దేశీయ ప్రాజెక్టు ద్వారా కప్పివేయబడిన విదేశాంగ విధానంతో ఒక దేశం ప్రపంచ వేదికపై ప్రాముఖ్యతను సాధించగలదా? భారతదేశం వంటి పురోగమిస్తున్న శక్తికి, యుద్ధం లేకుండా చైనా వంటి మరింత స్థిరపడిన శక్తిని కదిలించడం సాధ్యమేనా? ఇలాంటి ప్రశ్నలు అనేక సంవత్సరాల నుండి విదేశాంగ విధాన నిపుణులను వెంటాడుతున్నాయి. Making India Great పుస్తకంలో రచయిత అపర్ణ పాండే, ఇండియా అంతర్జాతీయంగా గొప్ప స్థాయిలో ఎదిగేందుకు ఉన్న మార్గాలు, అవరోధాలను వివిధ అంశాలుగా విభజించి, వివరించారు. భారతదేశ భౌగోళిక పరిస్థితులు, ఆర్థిక విధానాలు, విదేశాంగ విధానాలు, సైనిక సామర్థ్యం వంటి అంశాల ప్రాతిపదికన, అనేక ఆసక్తికరమైన విషయాలను ఈ పుస్తకంలో వివరించారు.