Wild and Wilful

మానవులతో పాటు, జంతువులు, పక్షులు, కీటకాలు లాంటి అనేక ప్రాణులు భూమిపై జీవిస్తున్నాయి. అయితే అన్ని జీవుల మనుగడ, వాటిపై మానవుల ప్రభావం వంటి అంశాలపై Wild and Wilful పుస్తకాన్ని రచించారు నేహా సిన్హా. ముఖ్యంగా మన దేశంలో వివిధ జంతుజాతులకు మానవులు నుండి జరుగుతున్న హాని, వాటి మనుగడ ప్రశ్నార్థకమవుతున్న విధానాలను ఈ పుస్తకంలో పొందుపరించారు. ఏనుగులు, పులులు, పక్షులు వంటి అనేక జంతుజాతుల సంరక్షణకు అవసరమైన చర్యలను సైతం ఈ పుస్తకంలో వివరించారు.

By Many a Happy Accident: Recollections of a Life

ముహమ్మద్ హమీద్ అన్సారి, రెండు పర్యాయాలు దేశ ఉపరాష్ట్రపతిగా సేవలందించారు. హమీద్ అన్సారి తన ఆత్మకథను By Many a Happy Accident: Recollections of a Life అనే పుస్తక రూపంలో పొందుపరిచారు. తన జీవితంలో జరిగిన అనేక అనుకోని సంఘటనలను, జీవిత గమనాన్ని మార్చిన విధానాలను ఈ పుస్తకంలో వివరించారు. అంతేకాదు దేశ విభజన నాటి నుండి నేటి వరకు తన జీవితంలోని రాజకీయక, సామాజిక, మతపరమైన, దౌత్య పరమైన అనేక అనుభవాలను హమీద్ అన్సారి ఈ పుస్తకంలో పొందుపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com