The Automobile: An Indian Love Affair

భారతదేశంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీ చరిత్ర, వాటికున్న ఆదరణను The Automobile: An Indian Love Affair పుస్తకంలో వివరించారు జర్నలిస్ట్, రచయిత గౌతమ్ సేన్. గత వందేళ్లుగా, దేశ ఆటోమొబైల్ రంగంలో వస్తున్న మార్పులు, ప్రజల జీవన విధానంపై దాని ప్రభావాన్ని ఈ పుస్తకంలో ఆసక్తికరంగా వివరించారు. దేశ ఆటోమొబైల్ రంగంపై తన అనుభవాలను, క్షేత్ర స్థాయిలోని వాస్తవ పరిస్థితులను రచయిత ఈ పుస్తకంలో పొందుపరిచారు. దేశ ప్రజలకు వాహనాలపై గల అమితాసక్తికి గల కారణాలను సైతం ఇందులో చర్చించారు.

Her Right to Equality: From Promise to Power

Rethinking India series లో ఆరవ భాగంగా Her Right to Equality: From Promise to Power పుస్తకాన్ని రచించారు నిషా అగర్వాల్. భారతదేశంలో లింగ సమానత్వం, మహిళా స్వేఛ్చ అంశాలను ఈ పుస్తకంలో చర్చించారు. దేశంలో రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశాల్లో మహిళల పాత్ర చాలా తక్కువగా మాత్రమే ఉండటానికి గల కారణాలను ఈ పుస్తకంలో విశ్లేషించారు రచయిత నిషా అగర్వాల్. లింగ అసమానతలకు గల కారణాలను ఈ పుస్తకంలో చర్చించారు.

Despite the State

భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం, పరిపాలన, రాజకీయ వ్యవస్థ ఏవిధంగా ఉందనే అంశాలపై Despite the State అనే పుస్తకాన్ని రచించారు రచయిత ఎం. రాజశేఖర్. దాదాపు 33 నెలల పాటు మిజోరాం, తమిళనాడు, ఒరిస్సా, గుజరాత్, పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో పర్యటించిన రచయిత, క్షేత్రస్థాయి వాస్తవాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఆయా రాష్ట్రాల్లో ప్రజల జీవన విధానాలు, మౌళిక వసతులు, రాజకీయ వ్యవస్థ పనితీరు వంటి అంశాలను ఈ పుస్తకంలో వివరించారు.

Joe Biden: American Dreamer

జో బైడెన్…అమెరికా అధ్యక్షుడిగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించాడు. గతేడాది జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థి డోనాల్డ్ ట్రంప్ ను ఓడించిన జో బైడెన్, అమెరికా 46 వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. జో బైడెన్ వ్యక్తిగత, రాజకీయ జీవితంలో ఎదుర్కొన్న ఆటుపోట్లను Joe Biden: American Dreamer రూపంలో వివరించారు రచయిత ఇవాన్ ఓస్నోస్. తను కుటుంబ నేపథ్యం, కష్టనష్టాలు, రాజకీయ ప్రయాణం గురించిన అనేక ఆసక్తికర అంశాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com