‘Archaeology and the Public Purpose: Writings on and by M.N. Deshpande’
పురాతన కట్టడాలువాటి నేపథ్యంపరిరరక్షణ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) మాజీ డైరెక్టర్ జనరల్ నరహర్ దేశ్ పాండే యొక్క పూర్తి అనుభవాలను పుస్తక రూపంలో పొందుపరిచారు రచయిత్రి నయన్ జోత్ లహిరి. దేశ్ పాండే ను ఇంటర్వ్యూ చేసి తన జీవిత జరిత్రఆర్కియాలజిస్ట్ గా మారేందుకు దారి తీసిన పరిస్థితుల గురించి ఇందులో వివరించారు. స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో వారసత్వ సంపదఅరుదైన చారిత్రాత్మక కట్టడాలను పరిరిక్షణించిన విధానాలువాటిలో తన భాగస్వామ్యం లాంటి అనేక అంశాలను దేశ్ పాండే ఈ పుస్తకం ద్వారా పంచుకున్నారు.
Indian Economy’s Greatest Crisis
కరోనా మహమ్మారి ప్రపంచ ఆర్థికసామాజిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రపంచంలో జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశమైన భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితమైన తీరును ‘Indian Economy’s Greatest Crisisపుస్తకంలో వివరించారు రచయిత అరుణ్. కరోనా సమయంలో వలస కార్మికుల వ్యధలపై ఈ పుస్తకంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆరోగ్య విపత్తుగా ప్రారంభమైన కరోనాఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన తీరుదానిని ఎదుర్కొనేందుకు పాలకులు అవలంబించిన విధానాలను ఈ పుస్తకంలో వివరించారు.
Beyond Possible
జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను సాధించేందుకు అనేక ఒడిదొడుకులను ఎదుర్కొనవలసి ఉంటుంది. పర్వతాలను అధిరోహించడం అనే తన జీవిత లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఎదురైన అనుభవాలను Beyond Possibleపుస్తకంలో పొందుపరిచారు ప్రముఖ పర్వతారోహకుడు నిమ్స్ దాయ్ పూజ్రా. నేపాల్ దేశానికి చెందిన పూజ్రా ఇప్పటిదాకా ఎవరెస్ట్ సహాఅనేక ఎత్తైన పర్వతాలను అధిరోహించాడు. అయితే తన లక్ష్య చేధనలో ఎదురైన విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూముందుకు సాగిన విధానాన్ని ఇందులో సందేశాత్మకంగా వివరించారు నిమ్స్ దాయ్ పూజ్రా. జీవితంలో లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉపయోగపడే పలు జీవిత సత్యాలను నిమ్స్ దాయ్ పూజ్రాతన అనుభవాల రూపంలో ఈ పుస్తకంలో వివరించాడు.
Himalayan Challenge
ఇండియా-చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణల గురించి ఈ మధ్య తరచుగా వింటున్నాం. అయితే ఇండియా-చైనా మధ్య ఉద్రిక్తతలు గత ఆరు దశాబ్దాల క్రిందటే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక రాజకీయ నాయకుడిగావివిధ సందర్భాలలో చైనా దేశంలో పర్యటించిన అనుభవాలను ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ‘Himalayan Challenge: India, China and the Quest for Peaceపుస్తకంలో పొందుపరిచారు. ఇండియా-చైనా మధ్య సత్సంబంధాల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సైతం ఇందులో చర్చించారు.