నోబెల్ సాహిత్య బహుమతి 2014 ‘పాట్రిక్ మోడియానో’

ఫ్రెంచ్‌ నవలా రచయిత పాట్రిక్‌ మోడియానో 2014 లో సాహిత్య విభాగంలో నోబెల్ బహుమతి పొందారు. మానవ జీవితాలునాజీల చేతుల్లో మారణ కాండకు గురైన యూదుల మనో భావాలువారు ఎదుర్కొన్న అవమానాలుఅస్థిత్వాన్ని కోల్పోవడం వంటివి పాట్రిక్‌ మోడియానో నవలల్లో ప్రధాన అంశాలు. 1945లో పారిస్‌ నగరంలో జన్మించిన మోడియానో స్వీయానుభవాలే ఆయన సాహిత్య సృష్టికి ప్రేరణలు. ప్రచార ఆర్భాటాలకు దూరంగా ఉండే పాట్రిక్‌ మోడియానోఫ్రెంచ్‌లో ఇప్పటి వరకు 40కి పైగా నవలలుపలు బాలల పుస్తకాలు రచించారు. ఇందులో కొన్ని నవలలు ఆంగ్లంలోకి అనువదితమయ్యాయి. ‘మిస్సింగ్‌ పర్స న్‌’సెర్చ్‌ వారంట్‌’డోరా బ్రూడర్‌’మెమరీ లేన్‌’ఏ ట్రేస్‌ ఆఫ్‌ మాలిస్’ మోడియానో ప్రధాన రచనలు.

జ్ఞాన్ పీఠ్ అవార్డు గ్రహీత 2012 ‘రావూరి భరద్వాజ’

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ రచయిత ‘రావూరి భరద్వాజ’ కు 2012 లో జ్ఞాన్ పీఠ్ పురస్కారం లభించింది. రావూరి భరద్వాజ కథానికలునవలలునవలికలుకవితలువ్యాస సంపుటాలునాటికలుస్మృతి సాహిత్యంతో కలిపి సుమారు 190 పుస్తకాలు రాశారు. ఆయన ప్రసిద్ధ నవల ‘పాకుడు రాళ్లు’. 1950లో ముద్రించబడిన రాగిణి అనే పుస్తకం భరద్వాజ గారి ప్రధమ రచన. పాకుడురాళ్ళుజీవన సమరంకాదంబరి వంటి రచనలు ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టాయి. పాకుడురాళ్ళు నవలలో భరద్వాజ వెండి తెర వెలుగుల వెనుక ఉన్న చీకటి కోణాలను స్పృశించిన శైలివర్ణించిన విధానం ఒక గొప్ప సంచలనంఆలోచనాత్మకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com