‘Archaeology and the Public Purpose: Writings on and by M.N. Deshpande’

పురాతన కట్టడాలువాటి నేపథ్యంపరిరరక్షణ గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ప్రముఖ ఆర్కియాలజిస్ట్ఆర్కియాలజీ సర్వే ఆఫ్‌ ఇండియా (ఏఎస్‌ఐ) మాజీ డైరెక్టర్ జనరల్ నరహర్ దేశ్ పాండే యొక్క పూర్తి అనుభవాలను పుస్తక రూపంలో పొందుపరిచారు రచయిత్రి నయన్ జోత్ లహిరి. దేశ్ పాండే ను ఇంటర్వ్యూ చేసి తన జీవిత జరిత్రఆర్కియాలజిస్ట్ గా మారేందుకు దారి తీసిన పరిస్థితుల గురించి ఇందులో వివరించారు. స్వాతంత్ర్యానంతరం భారతదేశంలో వారసత్వ సంపదఅరుదైన చారిత్రాత్మక కట్టడాలను పరిరిక్షణించిన విధానాలువాటిలో తన భాగస్వామ్యం లాంటి అనేక అంశాలను దేశ్ పాండే ఈ పుస్తకం ద్వారా పంచుకున్నారు.

Indian Economy’s Greatest Crisis

కరోనా‌ మహమ్మారి ప్రపంచ ఆర్థికసామాజిక వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రపంచంలో జనాభా పరంగా రెండో అతిపెద్ద దేశమైన భారతదేశం‌ యొక్క ఆర్థిక వ్యవస్థ కరోనా మహమ్మారి కారణంగా ప్రభావితమైన తీరును ‘Indian Economy’s Greatest Crisisపుస్తకంలో వివరించారు రచయిత అరుణ్. కరోనా సమయంలో వలస కార్మికుల వ్యధలపై ఈ‌ పుస్తకంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆరోగ్య విపత్తుగా ప్రారంభమైన కరోనాఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసిన తీరుదానిని ఎదుర్కొనేందుకు పాలకులు అవలంబించిన విధానాలను ఈ పుస్తకంలో వివరించారు.

Beyond Possible

జీవితంలో ఉన్నతమైన లక్ష్యాలను సాధించేందుకు అనేక ఒడిదొడుకులను ఎదుర్కొనవలసి ఉంటుంది. పర్వతాలను అధిరోహించడం అనే తన జీవిత లక్ష్యాన్ని చేరుకునే మార్గంలో ఎదురైన అనుభవాలను Beyond Possibleపుస్తకంలో పొందుపరిచారు ప్రముఖ పర్వతారోహకుడు నిమ్స్ దాయ్ పూజ్రా. నేపాల్ దేశానికి చెందిన పూజ్రా ఇప్పటిదాకా ఎవరెస్ట్ సహాఅనేక ఎత్తైన పర్వతాలను అధిరోహించాడు. అయితే తన లక్ష్య చేధనలో ఎదురైన విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటూముందుకు సాగిన విధానాన్ని ఇందులో సందేశాత్మకంగా వివరించారు నిమ్స్ దాయ్ పూజ్రా. జీవితంలో లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉపయోగపడే పలు జీవిత సత్యాలను నిమ్స్ దాయ్ పూజ్రాతన అనుభవాల రూపంలో ఈ పుస్తకంలో వివరించాడు.

Himalayan Challenge

ఇండియా-చైనా మధ్య సరిహద్దుల్లో ఘర్షణల గురించి ఈ మధ్య తరచుగా వింటున్నాం. అయితే ఇండియా-చైనా మధ్య ఉద్రిక్తతలు గత ఆరు దశాబ్దాల క్రిందటే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఒక రాజకీయ నాయకుడిగావివిధ సందర్భాలలో చైనా దేశంలో పర్యటించిన అనుభవాలను ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ‘Himalayan Challenge: India, China and the Quest for Peaceపుస్తకంలో పొందుపరిచారు. ఇండియా-చైనా మధ్య సత్సంబంధాల పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యల గురించి సైతం ఇందులో చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com