
తుమ్మల దేవరావ్ (8985742274)
చీకట్లో మగ్గిన జీవజాలానికిః
నిలువెత్తు కిరణాలు సాచి
ప్రాణశక్తిని నింపుతున్న సూరీడు
భూతల్లికి భరోసా!
జీవన కాంక్షతో..
గడ్డి గూడులో గుడ్లను పొదిగిన తల్లి పిచ్చుక
కొత్త లోకాన్ని పరిచయం చేయబోతున్న
చిట్టిపిచ్చుకలకు ఆకాశమంత బరోసా!
తల్లి గర్భాశయాన్ని వీడి..
భూమి మీదకు రాబోతున్న పసికూనకు
తన్మయత్వంతో…
మృత్యువును సైతం దిక్కరించి
మద్దీడుతున్న తల్లి ప్రేమకు ఒక బరోసా!
నాన్న వీపుకు ఆకాశం చేసుకుని
మీద కూర్చోని గుర్రపు ఆటాడుతూ
విహంగం వీక్షణం చేస్తున్న
పసితనానికి నాన్నయిస్తున్న భవిష్యత్ భరోసా!