విద్యార్థి చైతన్యానికి అద్దం పడుతూ…

నేను వచ్చేసరికి బట్టలు పిండెయ్యి. పప్పు ఉడకవెట్టు నేను వచ్చినంక తాలింపు వెడ్జ్” అంటూ బయలుదేరబోయింది సుజాత.

“ఇయ్యాల నేనే పనికి పోత. నువ్వే బట్టలుతుకు. పంట చెయ్యి” అని తయారయింది ప్రతిమ.

“ఎందుకే? నన్ను తిట్టిచ్చుటానికా? చిన్న పిల్లగాన్లతోటి పని జేపిత్తున్నని?”

“కాదే! నాకు అమ్మతోని పని ఉంది” “అమ్మతోని నీకేం పనే?” “పోయి వచ్చినంక చెప్త”

“అమ్మ ఎందుకు రాలేదే? అని అడిగితే ఏమని చెప్తవే?” “అమ్మకు జ్వరం వచ్చిందని చెప్త”

“అట్ల చెప్తే నిన్ను నన్ను ఇద్దర్ని గానీయరు కరోనా జ్యగం అనుకొని.”

“కడుపునొప్పి అని చెప్త”

“సరే కాని నిన్న అమ్మ ఇచ్చిన ఈ గిన్నె కూడ తీస్కపో!”

“అట్లనే” అంటూ బయల్దేరింది ప్రతిమ.

ప్రతిమ గురుకుల పాఠశాలలో చదువుతోంది. మహాత్మా జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ స్కూల్ లో సెలక్టు అయినప్పుడు ఉద్యోగం వచ్చినంత సంతోషపడ్డారు. స్కూల్లో చేరిన తరువాత ప్రతిమ మాటతీరు మారిపోయింది. రాత తీరు మారిపోయింది. భాష మారిపోయింది. ఇంగ్లీషు మీడియం కావడంతో ఇంగ్లీషులో మాట్లాడ్డం నేర్చింది. ఇరుగు పొరుగు అందరూ ప్రతిమను బాగా

మెచ్చుకుంటారు. పౌష్టికాహారం దొరకడంతో నునుపు దేరింది. జొన్నకర్రలా వేగంగా పెరుగుతోంది.

ఈ మధ్య కరోనా కోవిడ్-19 రావడంతో ప్రభుత్వం లాక్ డౌన్

ప్రకటించింది. ఎవరూ ఇంటినుంచి బయటకు ఎక్కడికి వెళ్లవద్దని నిషేధాలు విధించారు. రాత్రుల్లు కర్ఫ్యూ విధించారు.

స్కూల్లు మూసివేశారు. ఆఫీసులు మూసివేశారు. ఎపుడు తెరుస్తారో తెలియదు.

కొంత కాలం తర్వాత ఆఫీసులు తెరిచారు. సగం మంది ఒకరోజు మరుసటి రోజు మిగతా సగం మంది ఆఫీసుకు వెళ్లాలన్నారు. స్కూల్లు కూడా అట్లనే తీస్తారని ప్రతిమ ఎదురు చూస్తున్నది. ఎంతకూ తెరుస్తలేరు. మార్చ్ నెల పోయింది. ఏప్రిల్ నెల పోయింది. ఎండకాలం పోయింది. వాన కాలం పోయింది. కాలం గడుస్తోంది. స్కూల్లు ఇంకెపుడు తీస్తరో అని ఎదురు చూస్తున్నది ప్రతిమ. ఆన్లైన్ క్లాసులంటూ సెల్ ఫోన్లో పాఠాలు చెప్తున్నారు. ప్రతిమకు అవి వినడం విసుగ్గా ఉంది.

శశాంక్ సారు అడగాలనుకుంది ప్రతిమ. ప్రతిమ ఎంట్రన్సు దరఖాస్తు నింపి అన్ని విధాల సాయం చేసి, స్కూల్లో చేర్పించింది శశాంకే. అపుడు ఎంట్రన్సు ప్రిపరేషన్లో శశాంక్ సార్ బిడ్డ హన్సిత ఎంతో నేర్పించింది. హంసితలా ఎదగాలని ప్రతిమ ఇష్టంగా చదివి సీటు సంపాదించింది.

విసుగు వచ్చి ఓసారి అడగనే అడిగింది ప్రతిమ. హంసిత డాడీ అని పిలుస్తుంటే చనువు పెరుగుతున్న కొద్దీ ప్రతిమకు శశాంక్ను సార్ అని పిలిచే బదులు అంకుల్ అని పిలువాలనిపించేది. ఆరోజు చొరవతో అదే ప్రయత్నం చేసింది.

అంకుల్! “మా రెసిడెన్షియల్ స్కూల్లు ఎపుడు తెరుస్తరు? ఇంటికాడ బోర్ల ఉంది. పాఠాలు పోతున్నయి అంకుల్”. అంకుల్ అని పిలవనైతే పిలిచింది గాని, పిలిచిన తర్వాత ప్రతిమకు నాలుక తడబడింది. “ఎందుకులే! సార్ అని పిలిస్తే అయిపోయె” అనుకుంది. అంకుల్ అనే సంబోధనను శశాంక్ గమనించక పోలేదు.

“ప్రతిమా! కరోనా కాలంలో వందల మంది స్టూడెంట్స్ కలిసి ఉంటే ఇంకేమైనా ఉందా? ఎంత ప్రమాదమో!” వివరించాడు శశాంక్,

“అయితే సర్! ఒక మాట అడుగ వచ్చా.?” అంకుల్ సంబోధనను వదిలివేసి మళ్లీ సర్ అనే సంబోధనలోకి వచ్చేసింది ప్రతిమ. అది కూడా గమనించాడు శశాంక్.

“అడుగు” అన్నాడు.

“సర్! ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లు పని చేయక పోయినా కరోనా కాలంలో జీతాలిస్తున్నారు. మీరు కూడా మాకు రెండు నెలలు పని చేయక పోయినా పూర్తి జీతం ఇచ్చిన్రు. థాంక్స్. సర్! అయితే మా కోసం రెసిడెన్షియల్ స్కూల్లో ఏడాదికి లక్ష ఖర్చు పెడుతున్నది. మాకిది ప్రభుత్వ ఉద్యోగం తీరుగ నెలకు పదివేలు ఖర్చు పెడుతున్నదని మీరే అన్నరు. అందుకే ఉద్యోగంలాగా కెజి టు పిజి ఉచిత రెసిడెన్షియల్ స్కూల్ లో చదివిస్తుంది అన్నారు. మరి మాకు కనీసం డైట్ ఛార్జెస్ అయినా మాకు నెల నెల ఇస్తే బాగుంటుంది గద సర్! మేం ఆన్ లైన్ క్లాసులు కూడ వింటున్నం గద సర్! మాకు ఇంట్లో కష్టంగా ఉంది సర్!”

ఆ మాటతో శశాంక్ ఆలోచనలో పడ్డాడు.

పిల్లలు ఎంత లాజికల్ గా ఆలోచిస్తారో అనుకున్నాడు.

“అలా చేస్తే బాగానే ఉంటుంది.” అంటూ శశాంక్ ప్రతిమను మెచ్చుకున్నాడు.

అట్ల స్కూల్ గురించి, క్లాస్ మేట్సు గురించి, టీచర్ల గురించి ఆలోచిస్తూ నడుస్తున్నది ప్రతిమ. ఎన్ని ఆటపాటలు, పాఠాలు మిస్సయ్యాయో! ఎల్లుండే తన బర్త్ డే. స్కూల్లో అయితే అందరిలో ఎంత గ్రాండుగా ఉండేదో! స్కూల్ నడిస్తే ఈ పాటికి లెసన్స్ ఒక రౌండు పూర్తయి ఉండేవి. హన్సిత తన క్లాసే చదువు తోంది. కాని ఆ ప్రయివేటు బడిలో ఫీజులమోత, పుస్తకాల మోత ఎక్కువ. ఆటపాటలు తక్కువ. అంతా బట్టీయం. హన్సిత ఒకోసారి తననే అడుగుతుంది. తనకు స్కూల్లో క్లాసులు చెప్పడం, ఉపన్యాసాలివ్వడం కూడ నేర్పించారు. తను క్లాసు చెపుతుంటే హన్సిత ఎంత ఆసక్తిగా చూస్తుందో! తనకలా చెప్పడం రావాలని ఎంత కష్ట పడుతుందో! ఆలోచనతోనే ఇల్లు చేరుకుంది ప్రతిమ.

“గుడ్ మార్నింగ్ సర్” అంటూ ఇంట్లోకి అడుగు పెట్టింది ప్రతిమ.

“గుడ్ మార్నింగ్” అంటూ చిరునవ్వు నవ్వాడు శశాంక్.

“గుడ్ మార్నింగ్ హన్సిత” అంటూ పలకరిస్తూ చేయి చాపింది ప్రతిమ. హ్యండ్ రైటింగ్ ప్రాక్టీతో కుస్తీ పడుతున్న హన్సిత టేబుల్ ముందు నుంచి లేసి షేక్ హాండిచ్చింది.

“గుడ్ మార్నింగ్ అమ్మా!” అంటూ నమస్కరించింది ప్రతిమ.

“ఇవాల నువ్వచ్చినవేమే ప్రతిమా.? బోల్లు, బట్టలు బాగున్నయి.” అంది స్వరూప.

“అమ్మకు కడుపు నొప్పి. నన్ను పొమ్మన్నది” అంటూ పొయికాడి గిన్నెలు బాల్కనీలోకి తెచ్చింది ప్రతిమ. .

“అయ్యో! మాస్కు కట్టుకోలేదేమే! కరోనా తెచ్చుకొని అందరికి అంటిస్తవ! ఆగు.” అంటూ ఒక కొత్త మాస్కు టేబుల్ మీద పెట్టింది స్వరూప.

ముందు బట్టలు వాషింగ్ మిషన్లో వేసింది ప్రతిమ. ఎండిపోయిన గిన్నెల మీద నల్లా తిప్పి నీళ్లు చల్లింది. చీపురు తీసుకొని ఊడ్వడం మొదలు పెట్టింది.

“దేవునిగదికెయి పోకు” . “అమ్మా నేను స్నానం చేసి వచ్చిన”

“ఈమె ఉన్నది చూడు. ఎమాయెనే హన్సితా! ప్రతిమ స్నానం చేసి అంత దూరం నుంచి వస్తే నువ్వు ఇంకా అట్లనే ఉన్నవులే! స్నానం చెయ్యి!”

“మాకు పొద్దున్నే స్నానం చేయడం అలవాటు. ఈ పాటికి టిఫిన్ కూడా పెడరమ్మా!” అంది ప్రతిమ. “దీన్ని కూడ ఏదైనా రెసిడెన్షియల్ స్కూల్లో వేస్తే ఇది కూడ అన్ని నేర్చుకుంటుండె.” స్వరూప నవ్వుతూ ప్రతిమను మెచ్చుకొంది.

లైజాల్ ఫ్లోరింగ్ క్లీనింగ్ మందు వేసి తుడిచింది ప్రతిమ. అంట్లు తోమి, రెండు ట్రిప్పుల బట్టలు ఆరేసింది.

రెసిడెన్షియల్ స్కూల్ కు పోయినంక ప్రతిమ “నాకన్న ఎక్కువ ర్యాంకు తెచ్చుకుంటున్నది. దీనికి యైటీ ఫైవ్. నాకు సెవెంటీ ఫైవ్ వచ్చినయి.” అని మెచ్చుకుంది హన్సిత.

“ఈమెకు మంచి ఉద్యోగమే వస్తుంది, ఎంత మర్యాద! ఎంత సంస్కారం! బాగా చదువుకోవే! “మన సార్ కూడ సాయం చేస్తడు” అంది స్వరూప.

“అట్లనే అమ్మా!”

చేతులు తుడుచుకొని నిలబడింది ప్రతిమ.

ప్రతిమకు స్వరూప నాలుగు ఇడ్లీలు సాంబారు ప్లేటు అందించింది.

“మాస్కుతోని ఎట్ల తినాలె అమ్మా!” అంటూ నవ్వింది ప్రతిమ.

స్వరూప కూడ నవ్వింది.

“రెసిడెన్షియల్ స్కూలుకు పోయినంక మస్తు హుషారైనవే” అని మెచ్చుకుంది స్వరూప.

“అక్కడ చాలా మంది అక్కలుంటరు కదమ్మా! సీనియర్లను చూసి నేర్చుకుంటం.”

“మాస్కు తీసి అట్ల దూరంగ కూర్చో”. “దానికే ముందు పెట్టినవు. నాకేది?”

“నువ్వేం పని చేసినవే? ఇది బండెడు గిన్నెలు తోమింది. వాషింగ్ మిషన్లో బట్టలు వేసి, రెండు ట్రిప్పుల బట్టలు ఆరేసింది. ఇల్లు తుడిచింది. నీకు చదువు గూడ చెప్పవట్టె!”

ప్రతిమకు అమ్మ మెచ్చుకునే సరికి అలసటంతా పోయినట్లయింది. టిఫిన్ ప్లేట్ తీసుకొని దూరంగా కింద కూర్చోబోయింది.

“బట్టలు పాడైతై. ఆ స్టూల్ మీద | కూర్చోవే అంది స్వరూప.

“చదుకునే పిల్లను కింద కూర్చో బెట్టడం మర్యాద కాదని స్వరూపకు తెలుసు.

టిఫిన్ తిని ప్లేటు కడిగి తోమి పెట్టేసింది ప్రతిమ. మల్లీ మాస్క్ కట్టుకుంది.

ఏదో అడగాలని నిలబడింది.

“అమ్మా! ఎల్లుండి నా బర్త్ డే. మా స్కూల్లోనైతే బర్త్ డేని ఎంత గ్రాండ్ గా చేస్తారంటే…” చెప్పుతూ పోయింది.

“ఇక్కడ ఇంటికాడ కూడ చేసుకోవచ్చు గదనే.”

“పైసలు లేవు. కొత్త డ్రెస్ కూడ లేదు.”

“కరోన కాలంల ఎవల దగ్గరున్నయే పైసలు. అయినా సార్నడుగు”

కరోనా లాక్ డౌన్లో రెండు నెలలు తానే పని చేసుకుని జీతం మాత్రం చిన్న జీతాలు కదా అని ఫుల్ జీతం ఇచ్చేసింది.

పేపర్ చదువుతున్న శశాంక్ సార్ దగ్గర నిలబడింది ప్రతిమ. అడుగుల చప్పుడుకు ప్రతిమ వైపు ఏంటి సంగతి అన్నట్టు చూశాడు శశాంక్.

“ఎక్స్ క్యూజ్ మి సర్. ఎల్లుండి నా బర్త్ డే. రెండువేలు కావాలె సర్. వచ్చే నెల నుంచి నెలకైదు వందలు పట్టుకొండి”

ఆ అడిగే తీరు చూసి శశాంకకు భలే ముచ్చటేసింది. ప్రతిమ ఎంత తొందరగ విశ్వాసం! ఎంత వినయం! ఎంత సంస్కారం! మనసులో మెచ్చుకొని ప్రశంసా పూర్వకంగా నవ్వాడు శశాంక్,

“ఇవ్వు డాడీ!” అంటూ హన్సిత గారాబం పోయింది మెడ చుట్టూ చేతులు వేస్తూ.

అయిదు వందల నోట్లు నాలుగు చేతిలో పెట్టాడు. శశాంక్,

“ఇందులో వెయ్యి నీ బర్త్ డేకి నా గిఫ్ట్. హన్సితకు క్లాస్ కూడా చెప్తున్నవు”

“థాంక్యూ సర్!” అంటూ కృతజ్ఞతగా చూసింది ప్రతిమ.

వచ్చిన పని పూర్తయినట్టు మాస్కు సరిచేసుకుంటూ చెంగున పరుగెత్త బోయింది ప్రతిమ.

“ఈవినింగ్ తొందరగ రావే. పాఠం చెప్పాలె” హన్సిత పిలుపుతో ప్రతిమ సరేనంటూ సంతోషంగా ఇంటికేసి నడిచింది..

తోవలో కనపడితే కొన్ని కూరగాయలు కొన్నది. పోస్టాఫీస్ కు పోయి ఫ్రెండ్సు రాయడానికని కొన్ని పోస్టర్డులు కొన్నది. ఇంటికి చేరేసరికి తల్లి సుజాత కుట్టు మిషను మీద ఏదో కుడుతున్నది. వంట అయిపోయినట్లుంది అనుకున్నది ప్రతిమ.

ఫోన్ తీసుకొని నెంబర్లు కలిపింది. రెండు మూడు సార్లకు ప్రిన్సిపల్ మేడమ్ సుహాసిని ఫోన్ ఎత్తింది. “గుడ్ మార్నింగ్ మేడమ్”.

“గుడ్ మార్నింగ్ ప్రతిమ, బాగున్నావా? బాగా చదువుతున్నావా?”.

“బాగా చదువుకుంటున్నాను మేడమ్.

రెసిడెన్షియల్ స్కూల్లు ఎప్పుడు తీస్తారు మేడమ్. ఇంటికాడ బోర్‌గా ఉంది” అంది ప్రతిమ.

“ఏమో చెప్పలేము. కరోనా ప్రమాదం ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు స్కూల్లు తెరుస్తారు. అయినా తెలుగులో మాట్లాడుతున్నావేంటి? ఇంగ్లీషులో మాట్లాడాలని చెప్పినా కదా!” అంటూ ఇంగ్లీషులో ప్రశ్నించింది సుహాసిని.

“ఇంగ్లీషులో మాట్లాడితేనే ప్రాక్టీస్ అవుతుంది” అంది మళ్లీ, “ఓకే మేడమ్ ఐ విల్ స్పీక్/p>

హియర్ ఆఫ్టర్ విత్ హన్సిత అండ్ హిజ్ ఫాదర్”. “ఆర్ యూ టీచింగ్ హన్సిత?” ,/p>

“యస్ మేడమ్ దే గిప్టెడ్ మి ఆలో ఆన్ ది అకేషన్ ఆఫ్ మై బర్త్ డే. ఐ విల్ సెలబ్రేట్ మై బర్త్ డే ఎట్ మై హెూమ్”. “విష్ యు హ్యాపీ బర్త్ డే ప్రతిమ” “థాంక్యూ మేడమ్” “ఐ యామ్ రైటింగ్ బర్త్ డే గ్రీటింగ్స్ టు మై ఫ్రెండ్స్. ఆన్ దేర్ బర్త్ డేస్”. “ఓకే ఓకే” కంగ్రాచులేషన్స్.

ప్రతిమ తన క్లాస్ టీచర్ కి పీడి మేడమ్ కు ఫోన్ కలిపి మాట్లాడింది. కొంతమంది ఫ్రెండ్స్ కి ఫోన్ చేసింది. అరగంట మాట్లాడిన తర్వాత అప్పుడు రెసిడెన్షియల్ స్కూల్లో ఉన్నట్లుగా ఫీలింగ్ కలిగి సంతోషపడింది ప్రతిమ. .

“మీ స్కూల్లు ఎప్పుడు తీస్తరటనే”. “కరోనా తగ్గినంక తీస్తరట” అంది ప్రతిమ.

కరోనా ఎప్పుడు తగ్గుతుందో బిడ్డా! బిడ్డ స్కూలుకు ఎప్పుడు పోతుందో అనుకుంటూ సుజాత తనలో తాను గొనుక్కుంది.

“ఆకలవుతుందేమో తినవే” అంది పాతబట్ట ఏదో కుట్టుకుంటూ సుజాత.

“అమ్మ ఇడ్లీ పెట్టిందే ఫుల్ అయిపోయింది. ఇవాళ విజిటేబుల్ కర్రీ కూడా వండుతా. వండిన తర్వాత లంచ్ చేస్తనే”.

ప్రతిమ అప్పుడప్పుడు తల్లికి ఇంగ్లీషు పదాలు నేర్పుతుంది. సుజాత కూడా ఇంగ్లీషు పదాలు వాడడం నేర్చుకుంటున్నది.

“సార్ తౌజండ్ రూపీస్ గిఫ్ట్ గా ఇచ్చిండు. కొత్త డ్రెస్ రెడీమేడ్ ది కొనుక్కుంటా. రేపు హన్సితను తీసుకుపోయి డ్రెస్ సెలెక్ట్ చేసుకుంట”. “కొత్త ఫ్యాషన్స్ చాలా వచ్చినయ్” అంది ప్రతిమ.

అమ్మా అని, మా మమ్మీ అంటూ గారాబం పోతూ సార్ ఇచ్చిన రెండువేలు తీసి చూపించింది ప్రతిమ.

“అందుకేనా పనికి పోతానన్నది” అంటూ మురిపెంగా చూసింది సుజాత. “

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com