అక్షరార్చన భారత భారతి వాక్స్థలి సమూహం పక్షాన నిర్వహించిన సాహిత్య కార్యక్రమం ‘ విశ్వనాథ సృష్టి – ఆచార్య సుప్రసన్న దృష్టి అనే అంశంపై డా గండ్ర లక్ష్మణరావు ప్రసంగించారు. రామాయణ కల్పవృక్షం లో శ్రీవిద్యా రహస్యాన్ని నిక్షిప్తం చేసినట్లు సుప్రసన్న గారు రసరాజధానిలో నిరూపించారని, సీతను ఆదిపరాశక్తిగా ధ్వనింపజేశారని వివరించారు . విశ్వనాథకు సన్నిహితంగా ఉన్న సుప్రసన్న తాత్విక కోణంలో వివేచించారని తెలిపారు. యోగ లక్షణాలు , మొదలైనవి ఇతరకావ్యాల్లో తెలిపినవాటిని లక్ష్మణరావు సోదాహరణంగా వివరించారు. గిరిజామనోహరబాబు, నాగిళ్ళ రామశాస్త్రి, కుందావఝల కృష్ణమూర్తి, పాలకుర్తి శ్యామలానంద ప్రసాద్, హన్మంతరావు, వఝల రంగాచార్య, అనంతకృష్ణ మొదలైనవారు పాల్గొన్నారు. కార్యక్రమం జూమ్ ద్వారా జరిగింది .

….డా గండ్ర లక్ష్మణరావు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com