ఆగష్టు 26, 2020 న తెలంగాణ జాగృతి స్వర్గీయ పీవీ నరసింహా రావు సభ నిర్వహించింది. సభకు అధ్యక్షత వహించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత దక్షిణాది నుండి ఉత్తరాదికి వెళ్లి ప్రధానిగా రాణించిన మొదటి వ్యక్తి పీవీ అన్నారు. వీరి మతభాషణ, గంభీరమైన వ్యక్తిత్వం ఈనాటి నాయకులందరికీ అనుసరణీయం అన్నారు. ముఖ్య అతిధి, టీఆర్ఎస్ జనరల్ సెక్రెటరీ కే.కేశవరావు మాట్లాడుతూ, పీవీ ఉన్నత వ్యక్తిత్వం అందరికీ ఆదర్శం అని అన్నారు. సభలో పాల్గొన్న పీవీ కుమారుడు రాజేశ్వర రావు, కుమార్తె వాణి, పీవీతో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇన్ సైడర్ పీవీ రచన తెలుగు అనువాదకులు కల్లూరి భాస్కరం అనువాదం చేసినప్పటి అనుభూతిని వివరించారు. తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షులు రాజీవ్ సాగర్ అతిధి పరిచయం కార్యక్రమం నిర్వహించారు. చాలా మంది ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ సభకు జి.వరలక్ష్మి వందన సమర్ఫణ చేశారు.

తెలంగాణ చైతన్య సాహితి

నిర్వహణలో

‘కాళోజీ 106వ జయంతి’ ని పురస్కరించుకొని

ప్రత్యేక ‘ జూమ్’ కవి సమ్మేళనం

‘ప్రాణహిత’

(కవితా వాహిని)

తేదీ : 09 సెప్టెంబరు 2020

సమయం : సాయంత్రం 5 గంటల నుండి… ఏర్పాటు చేయడం‌జరిగింది. కార్యక్రమంలో మొదట ప్రసిద్ధ కవి, సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులు నందిని సిధారెడ్డి కాళోజీ గారి తో తమ ఉద్యమ అనుభవాలను పంచుకున్నారు.

తదనంతరం జరిగిన కవి సమ్మేళనంలో

సుప్రసిద్ధ కవులు, కవయిత్రులు తమ తమ కవితలను వినిపించారు. తెలంగాణ చైతన్య సాహితీ కన్వీనర్ ప్రముఖ కవి చమన్ నిర్వహణ సమన్వయం చేయగా

తొలుత ప్రాణహిత జూమ్ కవి సమ్మేళనానికి విచ్చేసిన కవులకు దాసరి మోహన్ స్వాగతం పలికారు. కార్యక్రమంలో సాంకేతిక సహకారం సి.హెచ్.ఉషారాణి అందించగా తెలంగాణ చైతన్య సాహితీ వ్యవస్థాపకులు వఝల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com