అమ్మనుడిని ఆదరించడం, తెలుగులోనే బోధన జరగడం, పరిపాలనలో తెలుగును అమలు చేయడం, ఇంగ్లీష్ మాటలు లేకుండా తెలుగులోనే మాట్లాడడం లాంటి విషయాలను మనలో చాలామంది ఉద్వేగస్థాయిలో నొక్కి చెబుతూ ఉంటారు. ఆచరణకోణం నుంచి కూడా వాటిని చూసి ఆలోచించేవారు తక్కువ. పీవీగారి ఆలోచనాశైలిలోని ప్రత్యేకత అదే. తెలుగును బోధనామాధ్యమంగానూ, అధికారభాషగానూ అమలు చేయడానికి అంత కృషీ చేసిన ఆయన, వాటిని అంటిపెట్టుకుని వచ్చే సమస్యల గురించీ ఆలోచించారు. ఇంగ్లీషు మాధ్యమంలో చదువుకున్నవారికి ఉద్యోగాలలో ఉన్నన్ని విస్తృత అవకాశాలు తెలుగు మాధ్యమంలో చదువుకున్నవారికి ఉంటాయా అన్న సందేహాన్నికూడా ఆయనే లేవనెత్తి దానికి పరిష్కారం కనుగొనాలంటారు. ఆవిధంగా బోధన(instruction), పరిపాలన(administration)లకు ఉద్యోగానియమకాలు(recruitment)ను కూడా ఆయన జోడించారు. ఆచరణ సమస్యలు ఉంటాయి కనుకనే, “భాషావిధానాన్ని ఏవో ఒకటి రెండు రాష్ట్రాలలో మాత్రమే అమలుచేయలేం. జాతీయవిధానం అవసరం. అఖిలభారతస్థాయిలో విధానాన్ని అమలుచేస్తే తప్ప మనం విజయం సాధించలేం” అంటారు ఒక ప్రసంగంలో. బోధన, పరిపాలన, ఉద్యోగానియామకాలే కాకుండా భాషకు సంబంధించి ఒక స్థాయి, లేదా అంతస్తు(స్టేటస్) అనేది కూడా ఒకటి ఉంటుందని, అది ఉన్నప్పుడు భాషకు తనంత తానే ఒక శక్తి వస్తుందని, తెలుగుకు ఇతర భాషలతో సమానమైన అలాంటి అంతస్తును కల్పించగలిగినప్పుడు భాషావిధానం అమలులో అది ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందని ఆయన అంటారు. ఇలా ఆలోచనాశీలితో పోటీ పడే ఆచరణశీలి కూడా కావడం పీవీ ప్రత్యేకతలలో ఒకటి. కోర్టులో డిక్రీ పొందిన తర్వాతే అసలు కష్టాలు మొదలవుతాయనీ, అలాగే విధాననిర్ణయం తీసుకున్న తర్వాతే అమలు ఎలా అన్న అసలు సమస్య మొదలవుతుందనీ, మనలో చాలామంది దీనికి తలకిందులుగా భావిస్తారని ఆయన అంటారు. కేంద్రంలో మానవవనరుల అభివృద్ధి శాఖామంత్రి కావడానికి ముందే జాతీయవిద్యావిధానం రూపకల్పనలో కీలకపాత్ర పోషించినదీ, ఆ తర్వాత మానవవనరుల మంత్రిగా నవోదయపాఠశాలల ఏర్పాటు రూపంలో నాణ్యమైన విద్యను అందుబాటులో తెచ్చినదీ ఆయనే. అంతకుముందు సర్వేల్ పాఠశాలల ఏర్పాటు ఆయన ఆలోచనే. నవోదయపాఠశాలల్లానే ఇవి కూడా పెద్దగా ఆర్థికస్తోమత లేని విద్యార్థులకు భవిష్యజీవితంలో ఉన్నతస్థాయిని అందుకోడానికి తోడ్పడే విద్యను అందించాయి.

బుద్ధిలో బృహస్పతి

కాసు బ్రహ్మానందరెడ్డి తన మంత్రివర్గసహచరుడైన పీవీని బృహస్పతి అని పిలిచేవారట. ‘లోపలి మనిషి’లో ముఖ్యమంత్రి చౌదరి, మంత్రి ఆనంద్ ను అలాగే పరిగణించేవాడు. ఆలోచనాశీలి అనే మాటకు ముందు ‘మౌలిక’ అనే విశేషణాన్ని జోడించుకుంటే తప్ప పీవీ గురించిన చిత్రణ పూర్తి కాదు. ఆయన ఏ మంత్రిత్వశాఖలో ఉన్నా మౌలిక ఆలోచనలు చేశారు, వాటిని అమలు చేశారు. ఏడు, పది తరగతులు మినహా, మిగతా తరగతుల్లో తప్పనిసరి ఉత్తీర్ణతను(డిటెన్షన్ పద్ధతిని)రద్దు చేసిన సాహసి పీవీగారే నంటారు నాటి ప్రముఖ పత్రికా సంపాదకులు కూచిమంచి సత్య సుబ్రహ్మణం. నీలం సంజీవరెడ్డి మంత్రివర్గంలో స్టేట్ మంత్రిగా తనకు జైళ్ల శాఖ అప్పగించినప్పుడు జైలు సంస్కరణలకు ఆయన ఎలాంటి ప్రయత్నాలు చేశారో స్వాతంత్ర్య సమరయోధుడు ఎం. ఎల్. నరసింహారావు రాస్తారు. విదేశాలలో జైళ్ల సంస్కరణ విధానాన్ని పీవీ క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఇతర రాష్ట్రాలలోని జైళ్ల పరిస్థితిని, కేంద్రప్రభుత్వ విధానాన్ని బాగా పరిశీలించి రాష్టంలో జైళ్ల సంస్కరణ చర్యలకు పూనుకున్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ఆ విషయమై ఒక సదస్సును నిర్వహించారు(ఎందులోనైనా కొత్త ఆలోచనల అమలకు సంకల్పించినప్పుడు సదస్సులు ఏర్పాటు చేసి, నిపుణుల అభిప్రాయాలను ఆహ్వానించడం పీవీ మొదటినుంచి చివరివరకు అనుసరించిన ప్రజాస్వామికవిధానం). ఆ సదస్సులో వచ్చిన సూచనల ప్రకారం, 1965లో మొదటిసారి అనంతపురం వద్ద ఆరు బయలు జైలును ఏర్పాటు చేశారు. బాల నేరస్థులకు, మహిళా ఖైదీలకు ఎన్నో సౌకర్యాలు కల్పించారు. ఆ తర్వాత వైద్యఆరోగ్య మంత్రిగా, విడివిడిగా ఉన్న ఆ రెండు శాఖలనూ విలీనం చేశారు. ప్రభుత్వవైద్యుల ప్రైవేట్ ప్రాక్టీస్ ను నిషేధిస్తూ బిల్లు ప్రవేశపెట్టారు.

రాజకీయాలలో సోషల్ ఇంజనీరింగ్

రాజకీయరంగంలో పీవీ చేసిన మౌలిక ఆలోచనలు ఇంకో ముఖ్యమైన అధ్యాయం. అంతవరకు పెద్దగా రాజకీయప్రాతినిధ్యం లేని ఆయా సామాజికవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించి కొత్త సమీకరణలను నిర్మించడం ‘సోషల్ ఇంజనీరింగ్’ పేరుతో ఇటీవలి కాలంలో ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది. రాష్ట్రంలో 1972 ఎన్నికలలోనే ఇలాంటి ‘ఇంజనీరింగ్’ ను అమలు చేసిన కీర్తి పీవీకి దక్కుతుంది. ఆ ఎన్నికలలో ఆయన వెనుకబడిన తరగతులకు, మహిళలకు, మైనారిటీలకు ఎక్కువ సీట్లు కేటాయించారు. ఆయన ముఖ్యమంత్రి అయినప్పటినుంచే ‘బలహీనవర్గాలు’ అనే మాట ప్రాచుర్యంలోకి వచ్చిందంటారు పాత్రికేయకురువృద్ధులు తుర్లపాటి కుటుంబరావు. పీవీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా, రాష్ట్రంలో అప్పటికి రాజకీయప్రాబల్యం విశేషంగా ఉన్న సామాజికవర్గాలకు అదనంగా మరో సామాజికవర్గాన్ని కూడా బరిలోకి దింపి తద్వారా రాజకీయసమతూకాన్ని తేవడానికి ఆలోచన చేయడం నాకు తెలుసు.

భూసంస్కరణలపై పేటెంట్

భారతదేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో కొందరు సాంఘిక, మతసంస్కర్తలుగా ప్రసిద్ధులైనట్టుగా; రాజకీయ, పరిపాలనారంగంలో వారితో సమానమైన గుర్తింపును రేపటి తరాలు పీవీగారికి మరింతగా ఇవ్వవచ్చు. ఆయన రాజకీయ, పరిపాలనా జీవితంలో అతిముఖ్యసంస్కరణలుగా రెండు ప్రధానంగా పైకి తేలతాయి. ఒకటి, ముఖ్యమంత్రిగా ఆయన తలపెట్టిన భూసంస్కరణలు; రెండు, కేంద్రమంత్రిగా ఆర్థికసంస్కరణలు. నిజం చెప్పాలంటే, దేశం మొత్తం మీద భూసంస్కరణలపై పేటెంట్ పీవీగారిదే. భూపోరాటాలలో ఎంతో అనుభవం ఉన్న కమ్యూనిస్టులు కూడా భూసంస్కరణలపై పీవీగారి మార్గదర్శనం కోరుకున్నారంటే దానిపై ఆయన ఆరాట, అధ్యయనాల లోతు అర్థమవుతుంది. అప్పట్లో కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న అచ్యుత మీనన్ కూడా భూసంస్కరణలపై తన సూచనలు, సలహాలు కోరారని పీవీ స్వయంగా నాతో అన్నమాట.

మొదటే చెప్పినట్టు భిన్నతరానికి చెందిన నేను పీవీని సానుకూల దృష్టినుంచి అర్థం చేసుకునే దిశగా బలమైన అడుగులు వేసింది; భూమి గురించి, భూసంస్కరణల గురించి ‘ఇన్ సైడర్’ లో ఆయన రాసినది చదువుతున్నప్పుడే. అంతకన్నాముందు నన్ను ఆకర్షించిన ఘట్టం ఇంకొకటి ఉంది…అది, ‘లోపలి మనిషి’లో ఆనంద్ మొదటిసారి మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత, ‘అసలు అధికారం ఎందుకు, తన మీద దాని ప్రభావం ఎలా ఉంటుం’దని ప్రశ్నించుకుని ఆత్మవిమర్శ చేసుకోవడం. ఇవి చాలా అవసరమైన, మౌలికమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలు ముందుకు తెచ్చిన మరో రాజకీయనాయకుణ్ణి నేను అంతవరకు చూడలేదు. శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు, రకరకాల కోరికలతో, విజ్ఞాపనలతో తన దగ్గరికి వచ్చే ఆర్తుల మధ్య గడుపుతున్నకొద్దీ తనొక వ్యక్తినన్న భావననుంచి బయటపడి పూర్తిగా విభిన్నమైన జీవిగా పరివర్తన చెందినట్టు అతనికి(ఆనంద్ కి) అనిపిస్తుంది. తన వ్యక్తిగత అస్తిత్వానికి ఇప్పుడు ప్రాముఖ్యం లేదనీ, తన ఆనందవిషాదాలు, తన బంధుమిత్రులు, తన ఇష్టాయిష్టాలు – అన్నీ అంతకంటె ఎంతో విస్తృతమైన ఆవరణలో లయమైపోయాయనీ, అది విశ్వజనీనమైన మానవాళి అస్తిత్వం మొత్తాన్ని తనలో పొదవుకున్న ఆవరణమనీ ఊహ చేస్తాడు. ఈ అతీతస్థితిలో ప్రజాస్వామ్యపు ఆధ్యాత్మికరూపాన్నిఅతడు దర్శిస్తాడు! శాసనసభ్యుడిగా తనొక లక్షమందికి ప్రాతినిధ్యం వహిస్తే, ఇప్పుడు మంత్రిగా కొన్ని కోట్లమంది ప్రజల శ్రేయస్సుకు బాధ్యత వహించవలసివస్తుందని, ప్రాతినిధ్యం నుంచి బాధ్యతకు పరివర్తన దానికదే పెద్ద మార్పని అనుకుంటాడు. “మంత్రికీ, మామూలు మనిషికీ మధ్య వ్యత్యాసమేమిటి? స్వార్థపరార్థాల క్రమాన్ని తలకిందులు చేయలేనప్పుడు మంత్రి చేతిలో అదనంగా అధికారమనేది ఎందుకుండాలి, అందుకు ఎలాంటి కారణమూ లే”దని ఆనంద్ నిర్ధారణకు వస్తాడు.

అధికారం గురించిన ఈ వివేచనే ‘లోపలి మనిషి’లో మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఆనంద్ వ్యవహరణలో అడుగడుగునా ప్రతిఫలిస్తుంది. తీవ్ర ఆక్షేపణలను, విమర్శలను, శత్రుత్వాలను, చివరికి పదవీభద్రతను ఎదురొడ్డి ఆనంద్ భూసంస్కరణల అమలుకు పూనుకునేలా చేసింది. అధికారం గురించి తర్కించుకున్నట్టే భూమి గురించి, భూసంస్కరణల గురించి ఆనంద్ సుదీర్ఘంగా తర్కించుకుంటాడు. సాహిత్యపరంగానూ లోతైన, గాఢమైన అభివ్యక్తిని తెచ్చుకున్న ఘట్టాలలో అది కూడా ఒకటి.

అతని ఆలోచనలు ఇలా సాగుతాయి:

“భూమి అంటే అధికారం. గ్రామజీవనంలో అదే సర్వస్వం. గ్రామీణచైతన్యంలో భూమి సర్వశక్తిమంతం, సర్వవ్యాప్తం, సర్వసాక్షి. భూమి ఎవరూ ఢీకొనలేని సర్వోన్నతశక్తి, ఎవరూ నిరాకరించలేని మహా సత్యం, ఎవరూ విచ్ఛిన్నం చేయలేని జటిల నిర్మాణం. శతాబ్దాలుగా ఇది మళ్ళీ మళ్ళీ రుజువవుతూనే ఉన్న నిజం.

“భూమి అంటే అధికారం. గ్రామజీవనంలో అదే సర్వస్వం. గ్రామీణచైతన్యంలో భూమి సర్వశక్తిమంతం, సర్వవ్యాప్తం, సర్వసాక్షి. భూమి ఎవరూ ఢీకొనలేని సర్వోన్నతశక్తి, ఎవరూ నిరాకరించలేని మహా సత్యం, ఎవరూ విచ్ఛిన్నం చేయలేని జటిల నిర్మాణం. శతాబ్దాలుగా ఇది మళ్ళీ మళ్ళీ రుజువవుతూనే ఉన్న నిజం.

“భూమి అంటే అధికారం. గ్రామజీవనంలో అదే సర్వస్వం. గ్రామీణచైతన్యంలో భూమి సర్వశక్తిమంతం, సర్వవ్యాప్తం, సర్వసాక్షి. భూమి ఎవరూ ఢీకొనలేని సర్వోన్నతశక్తి, ఎవరూ నిరాకరించలేని మహా సత్యం, ఎవరూ విచ్ఛిన్నం చేయలేని జటిల నిర్మాణం. శతాబ్దాలుగా ఇది మళ్ళీ మళ్ళీ రుజువవుతూనే ఉన్న నిజం.

“భూమి అంటే అధికారం. గ్రామజీవనంలో అదే సర్వస్వం. గ్రామీణచైతన్యంలో భూమి సర్వశక్తిమంతం, సర్వవ్యాప్తం, సర్వసాక్షి. భూమి ఎవరూ ఢీకొనలేని సర్వోన్నతశక్తి, ఎవరూ నిరాకరించలేని మహా సత్యం, ఎవరూ విచ్ఛిన్నం చేయలేని జటిల నిర్మాణం. శతాబ్దాలుగా ఇది మళ్ళీ మళ్ళీ రుజువవుతూనే ఉన్న నిజం.

“భూమి, తన మీద జీవించే ప్రతి ఒకరికీ సొంతం; చెట్టు తన మీద గూడు కట్టుకున్న ప్రతి పిట్టకీ సొంతం; అలాగే నీరు…అప్రయత్నంగా, అవ్యాజంగా కలిగే సృష్టికర్త చలవతో తనలోకి ఎగిరి దూకుతూ, ఈదుతూ, జారుతూ, పిల్లిమొగ్గలు వేస్తూ స్వేచ్ఛగా సంచరించే ప్రతి చేపపిల్లకీ సొంతం. ప్రతిదీ ప్రతి ఒకరికీ చెందుతుంది. ‘చెందడం’ అన్నదే సర్వత్రా వ్యాపించిన స్వాభావికస్థితి. అక్కడ ఎటువంటి రికార్డులూ లేవు, రిజిస్ట్రేషన్లు లేవు, ఎవరికీ ప్రత్యేకమైన స్వామ్యం లేదు, ఎవరికీ వ్యక్తిగతమైన హక్కు లేదు. ఇటువంటి అద్భుతమైన సుందరమైన వ్యవస్థనుంచి నేటి వ్యవస్థకు చేరుకోవడంలో అభ్యుదయం అనదగినదేమీ లేదని ఆనంద్ విచారంగా అనుకున్నాడు…

భూమి గురించి ఇలా తలపోస్తున్నప్పుడే ఆనంద్ కు గతించిన తండ్రి గుర్తుకొస్తాడు. అతని ఆలోచనలు తండ్రి అవసానదశవైపు మళ్లుతాయి. ‘లోపలి మనిషి’లో ఎంతో ఆర్ద్రతతోపాటు గాంభీర్యాన్ని సంతరించుకున్న విశిష్టఘట్టాలలో ఇది ఒకటి. ఈ చిత్రణలో వెనుకటికాలపు దాంపత్యసరళిని, తండ్రీ-కొడుకుల బంధాన్ని పీవీ అద్భుతంగా చిత్రీకరిస్తారు:

“తన అనారోగ్యం విషమిస్తోందని బహుశా నాన్నకి తెలుసు. కానీ అప్పుడే లా పరీక్షకు కూర్చోబోతున్న తనకు పరీక్షకు వెళ్లలేని పరిస్థితి కలిగించకూడదనుకున్నాడు. పరీక్ష పూర్తి కాగానే ఇంటికి రమ్మని చిన్న ఉత్తరం రాసి ఊరుకున్నాడు. ఆఖరిపరీక్ష కూడా రాసి ఇంటికొచ్చి నాన్న పరిస్థితిని చూసిన మీదట కానీ ఆయన తన క్షేమం కోసం ఎంత ప్రమాదాన్ని స్వీకరించాడో అతనికి అర్థం కాలేదు. గంట గంటకీ పరిస్థితి క్షీణిస్తున్నా అదృష్టవశాత్తూ నాన్న స్పృహలోనే ఉన్నాడు. ‘నువ్వు వచ్చావు, చాలా సంతోషం’ అన్నాడు భావగర్భితంగా. ..

“నాన్న త్వరత్వరగా మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో కూడా ఆశ్చర్యం గొలిపేంత స్పష్టత ఉట్టిపడుతోంది. తనకు మిగిలిన ఆ కాస్త సమయంలోనే చెప్పదలచుకున్నవన్నీ చెప్పాలన్న తహతహతో కాబోలు, అన్న మాట మళ్ళీ అనకుండా చెప్పుకుంటూ వెడుతున్నాడు. ఆనంద్ ఒక్కసారిగా ఘొల్లుమనేసరికి నాన్న కోపంగా అతనివైపు చూసి కనుబొమలు ముడిచి, క్షీణస్వరంతో అన్నాడు…’చూడు నాయనా, మనకు లక్ష్మి ఏనాడూ లేదు, ఉన్నదల్లా ధైర్యలక్ష్మి మాత్రమే. ఆమెను దూరం చేసుకోకు, లేకపోతే బతకడానికి నీకు మరే ఆధారమూ ఉండదు…’

“ఓ వైపున నాన్న అమ్మను చూసి కంటతడి పెడుతూనే, పెద్దగా శోకాలు పెడుతున్న అమ్మపై అంతిమక్షణాలలో కూడా కేకలు వేయబోవడం ఆనంద్ కు జ్ఞాపకమొచ్చింది. భూదేవంత ఓరిమితో ఆయన సంతానాన్ని కని పెంచి, ఆయన కోపతాపాలను గుర్తెరిగి మసలుకుంటూ పల్లెత్తు మాట అనకుండా నలభై ఏళ్ళు కాపురం చేసిందామె. అందుకు కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కాబోలు. ఆ కృతజ్ఞతను ఆయన మాటల్లో వ్యక్తం చేయాలనుకోలేదు. అనుభూతి చెందడమే కానీ మాటల్లో వాళ్ళు ఏనాడూ ఏదీ వ్యక్తం చేయరు. వాళ్ళ జీవనసరళి అలాంటిది. ఒకరి మీద ఒకరికి ఎంతో అపేక్ష. కానీ దానిని ఏనాడూ ప్రకటించి ఎరుగరు.

“చివరిసారిగా నాన్న రామనామస్మరణ ప్రారంభించారు, తన చుట్టూ ఉన్నవారిని కూడా రామనామం జపించమని సైగ చేశారు. ఆ పెదవుల మీద ధ్వనించే నామస్మరణ ఒక్కొక్క ఆవృత్తి గడిచిన కొద్దీ క్షీణించి…మరింత క్షీణించి…చివరికి ఆ పెదవులపై నిశ్శబ్దస్పందనగా పరిణమించింది. మెల్లగా…ఇంకా మెల్లగా…ఆ కదలిక కూడా ఆగిపోయింది… అయిపోయింది…అంతా అయిపోయింది…

కుంగదీసిన నెహ్రూ అస్తమయం

తరాల అంతరం ఉన్న పీవీగారితో ‘లోపలి మనిషి’ అనువాదకుడిగా ఏదో ఒక స్థాయిలో నేను ‘కనెక్ట్’ కావడం చాలా ముఖ్యం. లేకపోతే అనువాదం కేవలం అనువాదం కోసమే అన్నట్టు చాలా యాంత్రికంగా మారుతుంది. అదృష్టం కొద్దీ అలా ‘కనెక్టు’ అయ్యే అవకాశం పైన చెప్పుకున్న ఘట్టాల రూపంలో చాలా తొందరగానే వచ్చింది. ఉండి ఉండి తర్వాత కూడా వస్తూనే ఉంది. నెహ్రూ అస్తమయంపై ఆనంద్ తలపోత అలాంటి మరో ఘట్టం. ‘లోపలి మనిషి’లోని ఆనంద్ లో పీవీని దర్శించగలిగినప్పుడు, నెహ్రూ ప్రభావవర్షంలో ఆయన నిలువునా ఎలా తడిసిపోయారో ఈ ఘట్టం వెల్లడిస్తుంది. ఆయన మరణవార్త ఆయనలో కలిగించిన దుఃఖోద్వేగపు అభివ్యక్తి కూడా గొప్ప ప్రవాహగుణాన్ని తెచ్చుకుని వరద కడుతుంది. ఆ రోజు మధ్యాహ్నం ఆనంద్ ఒక జాయింట్ సెలెక్ట్ కమిటీ సమావేశంలో ఉన్నప్పుడు ఆ దుర్వార్త తెలుస్తుంది. అరచేతుల మధ్య తల ఉంచుకుని ఆనంద్ చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. ఎన్నో సంవత్సరాల క్రితం తండ్రి మరణించినప్పుడు కూడా కలగనంత దుఃఖం ఇప్పుడతన్ని ముంచెత్తింది. జవాహర్లాల్ లోని ఆకర్షణీయపార్స్వాలు ఒకొటొకటిగా అతని కళ్ళముందు కదిలిపోసాగాయి. గుజరాత్ ప్రాంతంలోని హరిపురాలో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సదస్సుకు వెళ్లినప్పటి తన అనుభవాన్ని పీవీ (ఆనంద్ ముఖతా) చెప్పుకుంటూవచ్చారు. అంత జనసందోహాన్ని తను ఎప్పుడూ చూడలేదు. జనసమ్మర్దంలో చిక్కుకుని ముందుకూ వెళ్లలేకపోయాడు, వెనక్కీ రాలేకపోయాడు. ఊపిరాడక చనిపోతానేమేనని కూడా అనుకున్నాడు. ఆ తోపులాటలో తన ప్రయత్నం లేకుండానే సభాస్థలికి చేరుకున్నాడు. అంతవరకూ కలిగిన అసౌకర్యాన్ని మరచిపోయి అక్కడున్న ఇతర గ్రామీణులల్లానే జాతీయనాయకుల్ని ఒక్కొక్కరినే గుర్తుపట్టడంలో మునిగిపోయాడు… జవహర్లాల్, బోస్, పటేల్, ఆజాద్, పట్టాభిసీతారామయ్య, గఫార్ ఖాన్(అందరికంటే ఎత్తుగా)….ముంచెత్తిన భావావేశంతో ఒక్కొక్కసారి ఆగుతూ, ఒక్కొక్కసారి ఝరీవేగంతో ముందుకు దూకుతూ నిజాయితీ ఉట్టిపడే నెహ్రూ అభిభాషణను మొదటిసారి విన్నాడు. ఆ తర్వాత త్రిపురి ప్లీనరీకి వెళ్లినప్పుడు, పూణేలో ఒక విద్యార్థుల సమావేశానికి వెళ్లినప్పుడు నెహ్రూలోని శీఘ్రకోపాన్ని చూసిన సంగతిని ఎంతో మురిపెంగా ఆనంద్ గుర్తుచేసుకున్నాడు. త్రిపురిలో బహిరంగసభలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక విమానం పెద్దశబ్దంతో చుట్టూ తిరుగుతూ, శ్రోతల ఏకాగ్రతకు భంగం కలిగించింది. జవహర్లాల్ ఆగ్రహంతో ఊగిపోతూ, ఈ సమీపంలోకి ఏ విమానం రావడానికి వీల్లేదని గట్టిగా కేకపెట్టారు. ఆయన ఆదేశాన్ని పాటించేది ఎవరా అనుకుంటూ ఆనంద్ ఆశ్చర్యపోతుంటే, నిజంగానే ఆ విమానం మళ్ళీ ఆ దరిదాపులకు రాలేదు. పూణే సమావేశంలో నెహ్రూ సభాస్థలికి రాగానే విద్యార్థులు పండిట్ జీ జిందాబాద్ అంటూ నినాదాలు ప్రారంభించేసరికి నెహ్రూవారిపై కోపంతో విరుచుకుపడ్డారు. యుద్ధంతో ధ్వంసమైన ఒక దేశాన్ని అప్పుడప్పుడే చూసివచ్చిన ఆయనలో ఆ జ్ఞాపకాలు ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నాయి. బయటి ప్రపంచంలో ఏ జరుగుతోందో పట్టని బాధ్యతారాహిత్యం విద్యార్థుల ప్రవర్తనలో కనిపించడమే ఆయన కోపానికి కారణం. తరాల అంతరం ఉన్న పీవీగారితో ‘లోపలి మనిషి’ అనువాదకుడిగా ఏదో ఒక స్థాయిలో నేను ‘కనెక్ట్’ కావడం చాలా ముఖ్యం. లేకపోతే అనువాదం కేవలం అనువాదం కోసమే అన్నట్టు చాలా యాంత్రికంగా మారుతుంది. అదృష్టం కొద్దీ అలా ‘కనెక్టు’ అయ్యే అవకాశం పైన చెప్పుకున్న ఘట్టాల రూపంలో చాలా తొందరగానే వచ్చింది. ఉండి ఉండి తర్వాత కూడా వస్తూనే ఉంది. నెహ్రూ అస్తమయంపై ఆనంద్ తలపోత అలాంటి మరో ఘట్టం. ‘లోపలి మనిషి’లోని ఆనంద్ లో పీవీని దర్శించగలిగినప్పుడు, నెహ్రూ ప్రభావవర్షంలో ఆయన నిలువునా ఎలా తడిసిపోయారో ఈ ఘట్టం వెల్లడిస్తుంది. ఆయన మరణవార్త ఆయనలో కలిగించిన దుఃఖోద్వేగపు అభివ్యక్తి కూడా గొప్ప ప్రవాహగుణాన్ని తెచ్చుకుని వరద కడుతుంది. ఆ రోజు మధ్యాహ్నం ఆనంద్ ఒక జాయింట్ సెలెక్ట్ కమిటీ సమావేశంలో ఉన్నప్పుడు ఆ దుర్వార్త తెలుస్తుంది. అరచేతుల మధ్య తల ఉంచుకుని ఆనంద్ చాలాసేపు అలాగే కూర్చుండిపోయాడు. ఎన్నో సంవత్సరాల క్రితం తండ్రి మరణించినప్పుడు కూడా కలగనంత దుఃఖం ఇప్పుడతన్ని ముంచెత్తింది. జవాహర్లాల్ లోని ఆకర్షణీయపార్స్వాలు ఒకొటొకటిగా అతని కళ్ళముందు కదిలిపోసాగాయి. గుజరాత్ ప్రాంతంలోని హరిపురాలో జరిగిన కాంగ్రెస్ ప్లీనరీ సదస్సుకు వెళ్లినప్పటి తన అనుభవాన్ని పీవీ (ఆనంద్ ముఖతా) చెప్పుకుంటూవచ్చారు. అంత జనసందోహాన్ని తను ఎప్పుడూ చూడలేదు. జనసమ్మర్దంలో చిక్కుకుని ముందుకూ వెళ్లలేకపోయాడు, వెనక్కీ రాలేకపోయాడు. ఊపిరాడక చనిపోతానేమేనని కూడా అనుకున్నాడు. ఆ తోపులాటలో తన ప్రయత్నం లేకుండానే సభాస్థలికి చేరుకున్నాడు. అంతవరకూ కలిగిన అసౌకర్యాన్ని మరచిపోయి అక్కడున్న ఇతర గ్రామీణులల్లానే జాతీయనాయకుల్ని ఒక్కొక్కరినే గుర్తుపట్టడంలో మునిగిపోయాడు… జవహర్లాల్, బోస్, పటేల్, ఆజాద్, పట్టాభిసీతారామయ్య, గఫార్ ఖాన్(అందరికంటే ఎత్తుగా)….ముంచెత్తిన భావావేశంతో ఒక్కొక్కసారి ఆగుతూ, ఒక్కొక్కసారి ఝరీవేగంతో ముందుకు దూకుతూ నిజాయితీ ఉట్టిపడే నెహ్రూ అభిభాషణను మొదటిసారి విన్నాడు. ఆ తర్వాత త్రిపురి ప్లీనరీకి వెళ్లినప్పుడు, పూణేలో ఒక విద్యార్థుల సమావేశానికి వెళ్లినప్పుడు నెహ్రూలోని శీఘ్రకోపాన్ని చూసిన సంగతిని ఎంతో మురిపెంగా ఆనంద్ గుర్తుచేసుకున్నాడు. త్రిపురిలో బహిరంగసభలో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒక విమానం పెద్దశబ్దంతో చుట్టూ తిరుగుతూ, శ్రోతల ఏకాగ్రతకు భంగం కలిగించింది. జవహర్లాల్ ఆగ్రహంతో ఊగిపోతూ, ఈ సమీపంలోకి ఏ విమానం రావడానికి వీల్లేదని గట్టిగా కేకపెట్టారు. ఆయన ఆదేశాన్ని పాటించేది ఎవరా అనుకుంటూ ఆనంద్ ఆశ్చర్యపోతుంటే, నిజంగానే ఆ విమానం మళ్ళీ ఆ దరిదాపులకు రాలేదు. పూణే సమావేశంలో నెహ్రూ సభాస్థలికి రాగానే విద్యార్థులు పండిట్ జీ జిందాబాద్ అంటూ నినాదాలు ప్రారంభించేసరికి నెహ్రూవారిపై కోపంతో విరుచుకుపడ్డారు. యుద్ధంతో ధ్వంసమైన ఒక దేశాన్ని అప్పుడప్పుడే చూసివచ్చిన ఆయనలో ఆ జ్ఞాపకాలు ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నాయి. బయటి ప్రపంచంలో ఏ జరుగుతోందో పట్టని బాధ్యతారాహిత్యం విద్యార్థుల ప్రవర్తనలో కనిపించడమే ఆయన కోపానికి కారణం.

మృతప్రాయమైన జాతీయోత్పత్తి అంకెల కంటె, జాతి గౌరవానికే ప్రాముఖ్యం ఇచ్చుకున్న ఆ సందర్భంలో నెహ్రూ అంతర్జాతీయంగా దేశం ప్రతిష్ఠను ఇనుమడింపజేయడం గురించి ఆనంద్ తలపోశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అతని భావనలో జవహర్లాల్ ఒక వినూత్నభావప్రపంచానికి రూపకల్పన చేసి అందించాడు! ఒక రంగంలో కాదు, ఆలోచనకీ, ఆచరణకీ సంబంధించిన అనేక రంగాలలో ఆయన దేశానికి మార్గదర్శనం చేశాడు! దేనిని తాకితే దానిని ఉజ్వలింపచేశాడు! అదే సమయంలో, నెహ్రూలేని భారతదేశం భవిష్యత్తు గురించి కలవరపడిన ఆనంద్, గాంధీకి తను వారసుడైనట్టుగా తనకు తగిన వారసుని నెహ్రూ అందించకపోవడాన్ని తప్పు పట్టాడు.

భూసంస్కరణల అమలు నెహ్రూ ఆదేశమే. ఆనంద్ మంత్రిగా, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా భూసంస్కరణలను తలకెత్తుకున్నది కేవలం నెహ్రూ అనుయాయిగానూ, అభిమానిగానే కాదు; నక్సల్బరీ ఉద్యమం విసిరిన సవాలుకు జవాబుగా కూడా! ‘లోపలి మనిషి’లో నక్సల్ బరీ ఉద్యమం గురించిన పరిచయాన్నీ, దాని గురించి ముఖ్యమంత్రికి, ఆనంద్ కు మధ్య జరిగిన చర్చనూ పీవీగారు ఎంతో విపులంగా, నాటకీయంగా చిత్రించుకుంటూ వెడతారు. ముఖ్యమంత్రి భూసంస్కరణలను వెక్కిరిస్తే ఆనంద్ సమర్థిస్తాడు. నా ఉద్దేశంలో- నక్సల్ బరీ ఉద్యమమూ, దానిని ఎదుర్కోవడానికి మనం ఆచరణలో ఏమైనా చేయగలమా అని, ఆనంద్ ముఖతా పీవీ ప్రశ్నించుకోవడం, భూసంస్కరణల అమలుకు పూనుకోవడమే 752 పేజీల ‘లోపలి మనిషి’లో ప్రధాన ఇతివృత్తం. ఆవిధంగా స్వాతంత్రోద్యమ తరాన్ని దాటి పీవీ మా తరం దగ్గరికి వచ్చేశారు, అలా మా తరానికి ఆయనకూ మధ్య ఒక ‘మీటింగ్ పాయింట్’ ఏర్పడింది.

ఇప్పుడు ఆయన శతజయంతి వేళ, ఈ దేశానికి ఆయన ఏమిచ్చారని ప్రశ్నించుకున్నప్పుడు బహుశా నా ఉద్దేశంలో దానికి జవాబు ఇలా ఉంటుంది: అధికారం దేనికి అనే ప్రశ్నవేసుకుని ఎవరికివారు ఆత్మపరిశీలన చేసుకోవలసిన అవసరాన్ని ఆయన ప్రస్ఫుటంగా ముందుకు తెచ్చారు. లోతైన ఆలోచనతో, దార్శనికతతో ఆచరణను ఎలా మేళవించాలో చెప్పారు. రాజకీయ, పరిపాలనారంగాలను అవసరమైనప్పుడల్లా సంస్కరించుకోవలసిన ఆవశ్యకతను బోధించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com