చందుపట్ల విట్టల్ అనే పేరు కలిగి సి.హెచ్ మధుగా విఖ్యాతుడైనరచయిత కరోనా కాటు వల్ల 24-04-2021న తన ప్రస్థానంముగించారు. ఆయన నిబద్దుడైన కవి. నవలా రచయిత, కథా రచయిత. సామాజిక ఉద్యమ కార్యకర్త. క్యాన్సరు జయించినా కరోనా కాటును తప్పించు కోలేకపోయారు. 1969 తెలంగాణా ఉద్యమం, నక్సల్ బరి ఉద్యమం ఆయనను చాల ప్రభావితం చేశాయి. నిరంతర సామజిక సాహిత్య అధ్యయనంతో ఒక ప్రగతివాద రచయితగా నిలబడ్డారు. ఆయన సాహిత్యం , జీవితం ఒకటిగా నడచిన సృజనకారుడు. తంగేడు అయన మృతికి సంతాపం ప్రకటిస్తున్నది. తన అశ్రు నివాళి అర్పిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com