తెలంగాణ సాహిత్యం లో నవల

తెలంగాణ సాహిత్యం లో నవల పాత్ర చాల విస్త్రుతమైనది . ఒకనాటి తెలంగాణా పోరాటాన్ని ,సామాజిక జీవనాన్ని నవల బాగా ప్రతి ఫలించింది .వట్టికోట ఆళ్వారు స్వామి ప్రజల మనిషి, (1915) దాశరథి రంగాచార్య చిల్లరదేవుళ్ళు , మోదుగు పూలు తొలితరం తెలంగాణ నవలలో చెప్పుకోదగినవి .తరువాత తెలంగాణ విప్లవోద్యమాన్ని ప్రతిఫలించింది . చెరబండ రాజు మా పల్లె (1974) ప్రస్థానం (1981) అల్లం రాజయ్య కొలిమంతుకుంది (1974) అగ్ని కణం (1983) తుమ్మేటి రఘోత్తం రెడ్డి నల వజ్రం , వసంత రావు దేశ్ పాండే అడవి (1993) జ్వాలాముఖి వ్రేలాడే మందారం (1979) లాంటి నవలలన్నీ విప్లవోద్యమాన్ని ప్రతిఫలించినవి .అంపశయ్య నవీన్ చీకటి రోజులు ,రక్త సారం ,లాంటి నవలలు కూడా ఈ కోవా లో చేరేవే .

ఇంకా మాదిరెడ్డి సులోచన ,పోల్కం పల్లి శాంతాదేవి ,ముదిగంటి సుజాత రెడ్డి లాంటి రచయిత్రులంతా నాటి తెలంగాణ సమాజాన్ని బాగా ప్రతిఫలించారు .

ఇంత విస్తృతం గా వచ్చిన నవల ఈ నాడు ఏమయింది ? తెలంగాణ సాహిత్యం లో బిక్కుబిక్కుమంటూ ఎందుకు నిలబడిపోయింది ? ఇది సృజన లోకాన్ని కలచి వేయవలసిన ప్రశ్న .

అదే కవిత్వమైతే చాల విస్తృతం గా వస్తుంది .కవిత్వం లో వచన కవిత్వం ,పాట, పద్యం ,లాంటి విభాగాలన్నీ కొనసాగుతున్నాయి .కథ కూడా కవిత్వం తోపాటు నడుస్తూనే ఉంది .విమర్శ దానితో పాటు ,సాహిత్య చరిత్ర ,చరిత్ర పరిశోధన లాంటి ప్రక్రియలన్నీ తమ పరిమళాన్ని వెదజల్లుతూనే ఉన్నాయి .

నిజానికి నవలా రచనకు అవసరమైన ముడిసరుకు మనకెంతో లభించే సన్నివేశం ఇది . తెలంగాణ ఉద్యమం ,దానితరువాత వచ్చిన తెలంగాణ రాష్త్రం, అనంతర కాల పరిస్థితులు ,ఇట్లా ఎంతో ముడి సరుకు సృజన కర్తల ముందు ఉన్నది .అయినా ఒక అర్థం కాని నిర్లిప్తత తెలంగాణ సాహితీ లోకాన్ని వెన్నాడుతోంది .

నవల రాయాలంటే రచయితకు ఒక ప్రత్యేకమైన దృష్టి ఉండాలి .శిల్ప పక్వత సాదించలి .కుదురుగా నిలకడ గా వస్తువును నడిపించాగలగాలి. ఎదో ఒకసారి భావావేశం వచ్చినపుడు అట్లే రాసిపారెయ్యడం కుదరదు .

గతం లోనైతే ఆంద్ర ప్రాంత రచయితల కే ప్రచారం అధికం అని తెలంగాణా వాళ్లకు అవకాశం లేదనే మాటుంది . కాని ఇప్పుడు అన్ని ప్రక్రియల్లో తెలంగాణ రచయిత దీన్ని అధిగమించాడు .

వ్యాపార నవల టి.వి. సీరియల్స్ గా రూపాంతరం చెందాక తన స్థానం నిలుపుకోవలసిన సీరియస్ నవల వెనుకబడడం సృజనలోకం తిరిగి చూసుకోవలసిన అవసరం ఉంది .

పైన పేర్కొన్న రచయితలు చాలామంది ఇప్పటికీ సాహితీ లోకంలో కొనసాగుతున్నారు .కాని ఎందుకో నవలా సస్యాన్ని వదలి పెడుతున్నారు .యువలోకం కవిత్వం ,కతపైనే దృష్టి పెడుతున్నారు .

సృజన లోకం నవలా ప్రక్రియవైపు దృష్టి పెట్టాలిసి ఉంది .సమాంతర సామాజిక ప్రతిఫలనం గా నవల పునర్వికాసం పొందాలిసి ఉంది .

జై తెలంగాణ, జై జాగృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com