-అన్వేషి

ఇనరాజ కిరణాల ఘనతప్త జ్వా లల

నలరించి నిలుచు అంజలివి నీవు

అలచంద్ర చంద్రికా లలితంపు సవ్వడి

నిలిచి నవ్వెడి కళా నిధివి నీవు

శిలలెన్నో చిగురించు జలదాంబు రాసి వై

ఇలకు ఏతెంచేటి కలవు నీవు

మోసంపు లోకాన కాసింత దయతోడ

పలకరించెడి పొద్దు పాట వీవు

ఎచట జూచిన నీవును అచట గలవు

నేను ఏదన్న అదియిల నీవు తన్వి కరకు కత్తులు మెలగు ఈ కాననమున

పిల్లబాటవు గాదె ప్రఫుల్ల మూర్తి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com