జననం అపూర్వ పయనం

శైశవం అపురూప కవనం

యవ్వనం అచిరకాల గమనం!

ముఖంమీద ముడుతలు

అనారోగ్య మడతలు

వదులైన బిగుతులు

ఆయలు ఛాయలు

అంకెల్లోకి అనువాదాలు!

జనన నివారణ తరుణోపాయం

మరణ నిరోధక ఉపకరణ సంగ్రహణం

శాస్త్రం సౌపపత్తికసౌలభ్యం

ప్రయోగ విధాన ఫలవంతం?

జవనాశ్వజాడల సకిలింపు జరామరణ సంగమ సడలింపు జీవనకాల గమకాల పొడిగింపు అవధానం అవిచ్చిన్నం!అవిరచితం!

శతమానం భవతి?

శాశ్వత విలసిత విలాసం

భవిష్యత్ కాన్వాసుపై

అమృత ప్రబంధం!

అజరామర సుగంధం!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

PHP Code Snippets Powered By : XYZScripts.com